కన్నడదేశ చరిత్ర - I మూలపురుషుడగు మూలరాజు, రెండవ తైలుని ప్రతినిధి యగు బరప్పును చంపి, లాట దేశము నాక్రమించెను. అప్పటినుండి 12వ శతాబ్దమున, ఉత్తరము నుండి మహమ్మ దీయ దండయాత్రలు హిందూ సామ్రాజ్యములను ముంచేత్తువరకు ప్రాచీన బాదామి చాళుక్యుల గుజరాతు శాఖీయులగు పారమారులకును, దేవగిరి యాదవులకును లాటదేశము సామంతరాజ్యముగ నుండెను. ఇట్లు గుజరాతు నందు 5 శతాబ్దముల కాలము (7-12 క్రీ.శ. మధ్య) రాజకీయ భద్రతకును సాంస్కృతికోన్నతికిని కర్ణాట దేశము కారణమాయెను. అట్లే తూర్పు చాళుక్యవంశ మును వేంగినాట నిలిపి శోషించుచున్న ఆంధ్రదేశ మునకు అది పుష్టిని కలిగించెను. రెండవకృష్ణుని యనంతరము ఆతని మనమడు మూడవ ఇంద్రుడు క్రీ. శ. 912 లో రాష్ట్రకూట సింహాసన మాక్ర మించెను. ఈ వంశమున లబ్ధప్రతిష్ఠుడైన మరియొక రాజు మూడవకృష్ణుడు. ఇతడు క్రీ. శ. 980-840 లో సింహాసన మెక్కెను. ఇతడు ఉత్తరమునకు దండెత్తి మధ్యభారత మందలి మైహార సంస్థానమందలి జురా అనుచోట తన దండయాత్రల ప్రశ స్త్రీని, బిరుదావళిని అచ్చపు కన్నడ లిపిలో వ్రానీ ప్రకటించుకొనెను. అది ఆతని ఉత్తర దిగ్విజయయాత్రకు ప్రబల నిదర్శనము. అతడు దక్షిణమున తక్కోలము యుద్ధమున రాజాదిత్యుని చంపి చోళదేశము (తొండై మండలము) నాక్రమించి అనేక సంవత్సరము లేలేను. ఆతని పాలనము రాజ్య విస్తృతియందును, కళా పోషణమునందును ప్రసిద్ధి వహించెను. ఆతని పాలనా కాలమున రాష్ట్రకూట రాజ్యము ఉత్తరమున చేది రాజ్యము (మధ్యభారతము) వరకును, పడమట ఖేటక మండలము (గుజరాతు) వరకును, దక్షిణమున తొండై మండలము (తంజావూరు) వరకును, తూర్పున వేంగి రాజ్యము (కృష్ణా గుంటూరు జిల్లాలు) వరకును వ్యాపిం చెను. అంతటి విశాల సామ్రాజ్యమును అతడు పాళియ గాండ్ర యొక్కయు, ప్రతినిధుల యొక్కయు సహాయ మున పాలించెను. తలకాడు గాంగులు అతని విశ్వాస పాత్రులైన సేవకులు. వారి రాజగు బుడుగునకు మూడవ కృష్ణుడు తన చెల్లెలు 'రేవక నిమ్మడి' నిచ్చెను. బుతుగుడు తన భానకు ఉ త్తర రక్షిణ దండయాత్రలలో పాయముచేసి 498 సంగ్రహ ఆంధ్ర ఘనమగు నిధులతో అతని బొక్కసమును నింపెను. మూడవ కృష్ణుని మనుమడుగు రాచమల్లు కాలమున బాహుబలి యొక్క బృహద్విగ్రహమును శ్రావణ బెళ్లోలా వద్ద చాముండరాయ పురాణకర్తయగు చాముండుడు ప్రతిష్ఠించెను. కల్యాణిచాళుక్యుల ప్రాలనలో కర్ణాటక ప్రాబల్యము : పశ్చిమ చాళుక్యరాజ కుమారుడగు రెండవ తైలుడు మూడవకృష్ణుని ప్రతినిధి. ఇతడు బిజాపూరును పాలించెడి వాడు. మూడవకృష్ణుని తమ్ముడగు కక్కాలుని దుర్భల పాలనాకాలమున రెండవ తైలుడు స్వాతంత్ర్యమును ప్రకటించెను. ఈతడు కక్కాలుని, పారమారముంజుని, గాంగపొంచాలుని నాశనమొనరించి రాష్ట్రకూట రాజ్యము నాక్రమించెను. పారమారులు శియకహర్షుని ఆధిపత్యమున మాన్యఖేటముపై దండెత్తి కళ్కాలుని పూర్వపాలకుడగు కొట్టిగుని పాలనాకాలమున లాట మండలము నాక్ర మించిరి. తుదకది రాష్ట్రకూటుల వశమయ్యెను. ఇట్లు 220 సంవత్సరములు వైభవోపేతముగ రాజ్యపాలనము కావించి రాష్ట్రకూటులు దక్కను కర్ణాటక రాజకీయ రంగము నుండి అంతర్ధాన మొందిరి. క్రీ. శ. 10 వ శతాబ్దపు తుది భాగమున ప్రాత ప్రభు త్వములు మాయమయ్యెను. కర్ణాటక మండలి రాజకీయ వ్యవస్థయందును, ఆర్థిక మత జీవితములందును, పునరుజ్జీ వనము కలిగెను. వీలైనంతవరకు గెల్చిన మండలములలో పాళియగాండ్రను నియమించు పద్ధతి తొలగింపబడెను. పరిపాలనా సౌకర్యార్థము దేశవిభాగములు పునర్వ్యవస్థీక రింపబడెను. ఒక విభాగమునుండి మరియొక విభాగమునకు బదిలీ యొనర్పదగు పద్ధతిపై సామంతులను రాజు నియ మించెను. రాణులకు, రాజకుమారులకు రాజకీయములలో అనుభవపూర్వకమయిన శిక్షణము నిప్పించి రాజు వారిని ఒక్కొక్క ప్రాంతమున శాంతిభద్రతలను నెలకొల్పుటకై అధికారులనుగా నియమించెను. కల్యాణి చాళుక్యులకు ప్రబల శత్రువులు తంజావూరు చోళులు. వీరు పల్లవుల చోళికావిషయమును లేక తొండ మండలమును 9 వ శతాబ్ది చివరిభాగమున ఆక్రమించిరి. చాళుక్యులు, చోళులు ఒకరితో నొకరు తరచుగ యుద్ధ ములు చేయుచు ఒకరి భూభాగములపై మరొకరు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/543
స్వరూపం