విజ్ఞానకోశము - J జపాన్, పిలిప్పైన్స్ మున్నగు దేశములందు పర్యటించి ఆయా దేశములందుండు విద్యాసంస్థల ఏర్పాటులను, స్థానిక పరిపాలనా పద్ధతులను, యంత్ర పరిశ్రమకై, వాణిజ్యాభివృద్ధికై ప్రభుత్వమువారు చేయు ఏర్పాట్లను పరిశీలించి సంపూర్ణానుభవమును సంపాదించినారు. రెడ్డి గారి విజ్ఞానము ఎంత విపులమైనదో, హృదయ మెంత విశాలమైనదో, వీరి జీవిత మంత వివిధ్యోపేతమైనది. ఆరంభమునందే బరోడా వీరు 1908 వ సం. లో మహారాజుగారి కళాశాలయందు ఉపాధ్యక్షులుగా పని చేసిరి. 1916-18 లో మైసూరు మహారాజుగారి కళాశాలకు ప్రధానాచార్యులుగను, 1918-21 లో మైసూరు రాష్ట్ర విద్యాశాఖాధిపతిగను సేవచేసి మన్ననలను పొందినారు. తరువాత 1921 వ సం. న అఖిలభారత విద్యాసంఘ సభ్యులుగ ఎన్నుకొనబడిరి. అదే సంవత్సరము మదరాసు విశ్వవిద్యాలయమునుండి, ప్రథమ, ద్వితీయ శాసనసభలకు సభ్యులుగా ఎన్నుకొనబడిరి. ఇట్టి ఉన్నత స్థానప్రాప్తి రెడ్డి గారికిగల దక్షతకును, పలుకుబడికిని ప్రబల నిదర్శనము. 1928-30 సం. ల నడుమ ఆంధ్ర విశ్వవిద్యాలయ - ఉపా ధ్యక్ష పదవిని స్వీకరించి ఆర్థికముగా ఆ విశ్వకళాపరిషత్తు నకు పుష్టిని కూర్చిరి. 1980 వ సం. నుండి వీరు అంతర్విశ్వ విద్యాలయ సంఘమునకు అధ్యక్షులుగ ఎన్నుకొనబడినారు. వీరికి 1987 వ సం. న ఆంధ్ర విశ్వకళాపరిషత్తు డి. లిట్ (D.Litt) అను బిరుదము నిచ్చి సన్మానించినది. 1987 వ. సం. ముననే రాష్ట్రీయ నూతనోన్నత శాసనసభకు వీరి పేరు ప్రతిపాదింపబడినది. ఇంతేకాక విశ్వవిద్యాలయ నిర్మాణరీతులపై, అర్థశాస్త్రము పై అనేక ఉపన్యాసములను గావించిన ప్రముఖ విద్యావేత్తలలో నొకరుగ నెన్నదగిన వారు శ్రీ రామలింగా రెడ్డిగారు. II పి. య. రె. శ్రీ రామలింగా రెడ్డి పాశ్చాత్య సారస్వతములో నెట్టి కృషిచేసెనో ప్రాచ్య వాఙ్మయములో నంతకుమించి కృషి చేసిన రచయిత. చదివి పట్టము గట్టుకొన్నది యాంగ్ల భాష లో నేకాని, ఆయన ఆంధ్ర సాహిత్యసాగరము లోతులు పట్టుకున్న దిట్ట. ఇంగ్లాండునకు బోయి యున్నతవిద్య పై గన్ను పెట్టినను మాతృ భారతిపై మనసు వీడినవాడు కాడు. కవిత్రయమువారి భారతము, కళాపూర్ణోదయము 475 కట్టమంచి రామలింగారెడ్డి రామలింగా రెడ్డి నిత్యపారాయణ గ్రంథములు, ఓ కేపించి, భారతకవుల కతడు బ్రహ్మరథము పట్టెను. అసహ్యమైన శృంగారవర్ణనములు చేసిన కొన్ని ప్రబంధముల తీరు రెడ్డి దృష్టికి కోక యనిపించెను. అతని యీ వాడి విమర్శ వమునకు గురికాక ఆగినది కవిత్రయమే. ఆమూవురిలో కవిబ్రహ్మ తిక్కన మరియు విశిష్టుడు. "ఆంధ్రలోక పరిశుద్ధ తపఃపరిపాక రూపుడు కవితాప్రకుంచ రవి. తిక్కన యొక్క డే." అని రెడ్డి హృదయము. ఉదార హృదయుడైన శ్రీ రామలింగా రెడ్డి తెలుగునకు చేసిన సేవావైభవము మరచిపోరానిది. అనేక గ్రంథముల కాతడు వ్రాసిన భూమికలు పత్రికలలో ప్రచురించిన వ్యాసములు వాఙ్మయమునకు చెరుగని యాధరణములు. పూర్వఖండము, అభిజనఖండము, భాషాఖండము, ఆధునిక కవితాఖండము, సాంఘిక ఖండము. అని యెదు భా ములుగా వింగడించి ప్రచురింపబడిన 'వ్యాసమంజరి' రామలింగా రెడ్డి విషయ విమర్శన చాతుర్యమునకు స్పష్ట సాక్ష్యమైన గ్రంథము. గద్య రచనలో నొక క్రొత్తతెన్ను రెడ్డి ప్రదర్శించెను. లక్షణమునకు విరుద్ధమైన రచనయే యతడు స్వీకరించెను. తన సిద్ధాంతమును సూటిగా తీయ్యని మాటలతో మొగమోటమీవీడి చెప్పగలుగుటలో శ్రీ రెడ్డి నేర్పు తీర్పులు గొప్పవి. మృదువైన హాస్యదృష్టి- మధురమైన ధ్వనిపుష్టి శ్రీ రెడ్డి వ్రాతలలో, వక్తృత్వ ములో మనము కనుగొనవచ్చును.
పింగళి సూరనార్యుని కవితాసార సర్వస్వమును గుర్తించి ఆవిష్కరించినవారిలో అగ్రస్థానము కట్టమంచి రెడ్డికే దక్కినది. అతడు రెడ్డికే దక్కినది. ఆతడు రచించిన "కవిత్వ తత్త్వ విచారము" విమర్శన సారస్వతమునకు బంగారు తొడవు. వేమన కవిని గూర్చి రెడ్డి వెలువరించిన అభిప్రాయము మికిలి యుదార గంభీరమైనది. జాతీయ కవితాభిమానము గల రెడ్డి యూహలో “వేమన కారణ విమర్శనశ క్తికి పట్టాభిషేకము చేసిన మహాత్ముడు, ప్రతిభాశాలియు నగు మహాకవి." ఆతనినిగూర్చిశ్రీ రెడ్డి యిచ్చిన మరియొక వాఙ్మూలమిది : "ఆంధ్రలోక గురువులలో వేమన మొదటి వాడందుమేని సుమతి రెండవ వాడు.” ఆధునిక రాజ్యాంగమున అక్కర గుర్తించి " అర్థ శాస్త్రము”ను రామలింగా రెడ్డి తెలుగున సమర్థముగా