ఆర్సెనిక్
సంగ్రహ ఆంధ్ర
ఆర్సెనిక్ :- చిరకాలమునుండి వైద్యములోను, విషప్రయోగము కొరకును వాడబడిన వస్తువులలో పాషాణమును పేర్కొనవచ్చును. పాషాణ మాంగ్లములో “ఆర్సెనిక్” (Arsenic) అను లోహము యొక్క సమ్మేళనములలో నొకటి
(As2 O3, ). (ఆర్పి మెంటునకు సంస్కృతములో "పిండ హరితాళము"అని, హిందీలో “సంఖియా”అని యందురు.)
ఆర్సెనికు స్వల్ప పరిమాణములో స్ఫటికమయ శిలల యందు వెద చల్లబడి యున్నది. ఇది భూమి యొక్క ఉపరి భాగములో (earth's crust) పదిలక్షల పాళ్ళకు నాలుగు పాళ్ళవరకుండవచ్చునని క్లార్కు అంచనా వేసెను.ఆర్సెనికు విడిగా ఆంటిమొని (Antimony) అను లోహముతో కలిసి దొరకును. కాని గంధక సంయోగపదార్థములుగనే యెక్కువగా లభ్యమగును. కొన్ని సందర్భములలో, ఈ ఖనిజములు కాలగతిని చెమ్మ తగిలి, మార్పు చెంది, నీటిలో కరిగి, అంతర్జాలములలో చేరును. అక్కడక్కడ నీటి బుగ్గలయం దార్సెనికు కనిపించుటకిది యొక కారణ మనవచ్చును. సూర్యగోళములో ఆర్సెనికు ఉన్న సూచన లేమియు లేవని శ్రీ మేఘనాథ్ సహా మున్నగువారు ప్రకటించిరి. ఖనిజము లలోనేగాక తదితర వస్తువులలో కూడ నార్సెనికు ఉండును. కొన్ని రకముల పొగాకులలో పదిలకల పాళ్ళకు 6.30 పాళ్ళవర కార్సెనికుండినట్లు కనిపెట్టిరి. కొంతమందికి ఆర్సెనిక్ ఏదో యొక రూపమున పుచ్చుకొను అలవాటు కలదు. అట్టివారి సంతానము యొక్క శరీరములో ఆర్సెనిక్ ఉండును. తల్లి ఆర్సెనిక్ సంబంధమైన పదార్థములు తినినయెడల నామె పాలలో ఆర్సెనికును గుర్తించవచ్చును. ఇటీవలి పరిశోధనలవలన ఆర్సెనికు మనుష్యశరీరములో నొక ఘటకముగా (Constituent) చెప్పుటకు వీలులేదని తెలియుచున్నది.
ఉత్తరదేశములో కుమాఁక్ ప్రాంతమున మున్స యేరీ వద్ద ఆర్పీ మెంటును, వంగదేశమున డార్జిలింగు జిల్లాలో ఉత్తర సంప్తర కొండలయందు మిస్పికలు నిధులును గల వని భూతాత్విక సమీక్షాశాఖవారు ప్రకటించిరి. కాశ్మీరములోను, జైపూర్ లోను అక్కడక్కడ స్వల్పముగా నార్సెనికు నిధు లున్నవని కొంతమంది సూచించిరి. కాని ప్రస్తుతము పై తావులయందు ఎచ్చటను ఆర్సెనికు నిధులు పనిచేయుట లేదు. మన దేశములో కావలసిన ఆర్సెనికు పదార్థము లన్నియు పై దేశములనుండి దిగుమతి యగు చున్నవి. ప్రపంచపు సగటుమీద ప్రతిసంవత్సరము 55,000 టన్నుల ఆర్సెనిక్ ఉత్పత్తి యగుచున్నది. అందులో నూటికి 75 పొళ్ళు అమెరికాలోనే తయారగుచున్నది.
ఆర్సెనికును సంయోగపదార్థముల నుంచి వేరు చేయు విధానము మొట్టమొదట ఆల్బర్టస్ మేగ్నస్ (Albertus Magnus) క్రీ.శ. 1250 సంవత్సరమున కని పెట్టెను. ఆర్సెని కాక్సయిడును కర్రబొగ్గుతో కలిపి ప్రత్యేకమైన మట్టి పాత్రలలో వెచ్చ చేసిన యెడల పాత్ర యొక్క చల్లని కొనలయందు ఉత్పతితమగును. ఆవిధముగ తయారగు ఆర్సెనికును మరల పైక్రమములో కర్రబొగ్గుతో వెచ్చ చేసినయెడల పరిశుభ్రమయిన ఆర్సెనికు లభించును.
కొన్ని మూలపదార్థములు వాటి యొక్క భిన్న అణు సంపుటివల్ల బాహ్యభేద (allotropy) మును అగపరచును. ఆర్సెనికు కూడ నాలుగు రకములుగా కన్పడును. మొదటి రకము బూడిదరంగులోను, రెండవది గోధుమవర్ణము లోను, మూడవది పసుపుపచ్చగాను, నాల్గవది ఉక్కు, రంగులోను సాంద్రతాభేదము కలిగియుండును. ఉక్కు రంగు ఆర్సెనికు లోహపుతళతళ చూపు విద్యుద్వాహక పదార్థము. తక్కిన మూడు రకములు లో హేతరములుగ నేకన్పించును.
ఆర్సెనికులోహము నెక్కువగా వాడరు. దానిని ముఖ్యముగా లోహ మిశ్రమములు తయారు చేయుటకు ఉపయోగింతురు. స్పెక్యులమ్ మెటల్ (Speculum metal) లో రాగి, తగరములతోపాటు కొంచెము ఆర్సెనికూడ నుపయోగింతురు. తెల్లరాగిలో (White copper) ఆర్సెనికు నూటికి పదిపాళ్ళవరకుండును. ఆర్సెనికల్ రాగిలో (Arsenical copper) 0.3% ఆర్సెనికుండును. దీనిని బాయిలర్ స్టేస్ (Boiler stays) లోను, ట్యూబు ప్లేట్లు (Tube plates) చేయుటకు వాడుదురు. సీసమును గుండ్లుచేయుటలో ఆర్సెనికుపయోగించిన యెడల వాటికెక్కువ గట్టితనము వచ్చును.
ఆర్సెనికును ముఖ్యముగా దాని ఆక్సయిడురూపములో నుపయోగించుదురు. తెల్లార్సెనికు (As2 O3,) కాలికో ముద్రణాలలోను, పింగాణీ పోయుటలోను, ఎలుకలను, ఈగలను చంపు కాగితములలోను, కర్రసామాను భద్ర