విజ్ఞానకోశము – ౨
కంపనములు - తరంగములు
చిన్న అల (EFG) వేగము 'V' తో ప్రయాణము చేయు చున్నదనుకొనుము. వర్గ వేగము 'V' తో ప్రయాణము
చేయుచున్న మరియొక తరంగమునకు వివిధ బిందువుల వద్దనున్న కంపన విస్తారమును చుక్కలతో గీయబడిన ABC అను వక్రరేఖ తెల్పును. కంపన విస్తారము శూన్యముగాగల L, M అను రెండు వరుసబిందువుల వద్ద నున్న తరంగములే వర్గతరంగములు.
స్థిర తరంగములు (Stationary Waves): ఇది రెండు తరంగముల పరస్పర సంఘట్టనము యొక్క ప్రత్యేక దృష్టాంతము. ఒకే యానక మందు ఋజుమార్గములో సమాన కంపన విస్తారము తరచుదనము గల రెండు తరంగములు అఖిముఖ దిశలో ప్రయాణము చేసినచో 'స్థిర తరంగము' లేర్పడును. పురోగమన తరంగము, దాని పరావర్తన తరంగము ఒక దానితో నొకటి కలియునప్పుడు కూడ స్థిరతరంగము లేర్పడును. యానకమందలి ప్రతి భాగము తన స్వస్థలమును విడిచి పెట్టకుండ, ముందు వెముకలకు కదలు నన్న విషయములో స్థిరతరంగము మామూలు తరంగముతో భేదించును. ఒక దండము యొక్క ఒక కొనను (B) స్థిరముగానుంచి, రెండవకొనను బిగువుగానున్న (దారము రెండవ చివర భారముండుట వలన) దారము యొక్క ఒక చివరిభాగమునకు కట్టి ఆ దండమును స్పందింప జేసిన యెడల కలుగు స్థిరతరంగము పటము (78) లో చూపబడినది.
దీనియంచు ప్రతిబిందువు ఒకే తరచుదనముతో B. P. కి లంబమార్గములో స్పందించుచుండును. కాని “N” అను కొన్ని బిందువులకు కంపన విస్తారము లేదు. A అను మరికొన్ని బిందువులకు గరిష్ఠ కంపన ఇస్తారమున్నది. మధ్యతరగతిలోనున్న కంపన విస్తారములు A, N బిందుపుల మధ్య యుండును. N బిందువును అస్పందన స్థాన (Node) మనియు, A బిందువును ప్రతిధ్రువము (Antinode) అనియు అందురు. రెండు వరుసల అస్పందన స్థానముల మధ్యదూరము గాని, రెండువరుసల ప్రతిధ్రువముల మధ్యదూరము గాని పురోగామి తరంగము యొక్క తరంగ దైర్ఘ్యములో సగముండు నని చూపవచ్చును. 7 (b)
పటములో చూపినట్లు గాలిలోకూడ స్థిర తరంగము లేర్పడును. పురోగమించుచున్న అనుదైర్ఘ్య తరంగము, దాని పరావర్తన తరంగము రెండును కలియుటవలన ఇవి యేర్పడును.
వక్రీభవనము (Re-fraction): తరంగము ఒక యానకమునుండి మరియొక యానకములోనికి పోపునపుడు దాని వేగములో కలుగు మార్పును వక్రీభవన మందురు. ఇది ధ్వని తరంగములందును, కాంతి తరంగము లందును కూడ కానబడును.
విశ్లేషణము (Diffraction): తరంగములు మార్గ నిరోధకములను తాకినయెడల అవి ఆ వస్తువు యొక్క 'ఛాయ' లోనికి వ్యాపించుట చాల సహజమైన విషయము. దీనినే విశ్లేషణ మందురు. వస్తువు యొక్క పరిమాణము తరంగ దైర్ఘ్యమునకు దరిదాపులో నున్న యెడల ఇది సంభవించును. ఒక పెద్ద రాతి వెనుక భాగమున చిన్న చిన్న అలలవలన కలుగు ఛాయ దీనికి సహజ దృష్టాంతము. కాని పెద్ద పెద్ద సముద్ర కెరటములు ఒక రాతివెనుక భాగమున ఛాయలను కలుగజేయ లేవు.రాతివెనుక భాగము నిలకడగా నుండదు.