కంపనములు తరంగములు
సంగ్రహ ఆంధ్ర
స్వభావములో, ఈ అలలు తిర్యక్ తరంగములే. ఈ క్రింది పట్టికలు వివిధ యానకములందలి ధ్వని తరంగ వేగమును తెల్పును.
(1) ఘనపదార్థములలో 20°C (సెంటిగ్రేడు) వద్ద [అన్ని పట్టికలలోను వేగము సెకనుకు మీటర్లలో తెల్పబడెను.]
| అల్యూమినియము లేక స్ఫటము | ఇత్తడి | ఉక్కు | యశదము | గాజు |
|---|---|---|---|---|
| 5100 | 3400 | 5100 | 3700 | 5000 |
(2) ద్రవపదార్థములో ఉష్ణోగ్రత 20°C వద్ద :
| సారాయి | నీరు |
|---|---|
| 1210 | 1457 |
(3) వాయుపదార్థములో మామూలు ఉష్ణోగ్రత, పీడనములవద్ద :
| పొడిగాలి | కర్బనద్విఆమ్లజనిదము | ఉదజని | ఆమ్లజని |
|---|---|---|---|
| 331.4 | 259 | 1262 | 316 |
తరంగముల పరస్పర సంఘట్టనము (Interference of waves : ఒకే సమయమునందు ఒకే యానకము గుండా వేర్వేరు స్థానములనుండి రెండు తరంగములు స్వతంత్రముగా ప్రయాణము చేయవచ్చును. కాని ఒక స్థలములో ఈ రెండింటిఫలితము వాని కంపనవిస్తారములు బీజగణిత మొత్తముచే సూచింపబడును. ఈ విధముగా ఒక స్థలములో రెండు తరంగముల యొక్క కంపన విస్తారములు అభిముఖదిశ యందున్న యెడల ఆ రెండింటి యొక్క ఫలిత కంపనవిస్తారము తగ్గును. ఒకేదిశయందున్న యెడల రెండింటి యొక్క ఫలితకంపనవిస్తారము ఎక్కు వగును. అందువలన కొన్ని బిందువుల యొద్ద మొదటి తరంగము యొక్క స్థానభ్రంశము (Displacement) రెండవ కిరణము యొక్క ఉనికి వలన ఎక్కువగుట గాని తక్కువగుట గాని జరుగును. ఈ విధముగా తరంగములు ఒక దానితో మరి యొకటి జోక్యము కలిగించుకొనుటను 'పరస్పర సంఘట్టనము' అని అందురు. దీనికి ఈ రెండు తరంగములను ఉద్భవింపజేయు కంపనము యొక్క తరచుదనము సమానముగాను, అనుగుణముగాను ఉండవలెను. .
ఆఘాత స్వరములు : (Beats) తరచుదనము 312, 316 గల రెండు సంస్వరణ ద్విభుజులలో రెండు తరచు దనముల విలువలు దరిదాపు సమానముగా ఉన్నప్పుడు వానినుండి బయలుదేరి ఒక సమయములో మన చెవిని తాకు ధ్వనిపుంజముల వలన ధ్వని విస్తారతలో మార్పుకల్గును. ఈ మార్పును 'ఆఘాతస్వర' మందురు. ఈ ప్రత్యేక సందర్భములో ఆఘాతస్వరముల విలువ 'సెకనుకు నాలుగు. అనగా సెకనులో నాలుగు పర్యాయములు ధ్వనివిస్తారత (Loudness) లో హెచ్చుతగ్గులు వినబడును. సమాన కాలవ్యవధిలో నుండి ఎక్కువ ధ్వని నిచ్చుటయు, ఈ వ్యవధి మధ్యలో సరిగా ఈ రెండును వ్యతిరేక అవస్థలో నుండి మృదువైన ధ్వని నిచ్చుటయు ఆఘాతస్వరము యొక్క యునికియందుండు ధ్వనివిస్తారతలోగల మార్పుకు కారణము. పటము (5) చూడుము.
వర్గ వేగము (Group Velocity) : పై సందర్భములో వేగము తరంగ దైర్ఘ్యముపై నాధారపడిలేదు. ఆఘాత తరంగము (మిశ్రమతరంగము) A, C బిందువుల యొద్ద గరిష్ఠ ప్రమాణముకలిగియుండి దానియందలి ఆంతరతరంగముల వేగముతోనే ప్రయాణము చేయును. కొన్ని సందర్భములలో శూన్యముకాక ఇతర పారదర్శికయానకములో ప్రయాణము చేయు కాంతివిషయములో వలెను, లేక నీటి యుపరితలమందున్న తరంగ విషయములలో వలెను, వేగము తరంగ దైర్ఘ్యముపై నాధారపడి యుండదు.అటువంటి సందర్భము లలో మిశ్రమ తరంగము 'వర్గ వేగము' అను మరి యొక విధమైన వేగముతో ప్రయాణము చేయును. పటము. 6 (a) లో రెండు అంతర తరంగములు చూపబడినవి. పటము 6 (b) లో ఒక స్థితియందున్న 'ఫలిత తరంగము' పూర్తిరేఖవలన చూపబడినది. ఏదైన 486.