Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము – ౨ 15,46,946 మంది కలరు. వీరితరువాత గణింపి తగిన వాడు ముసల్మానులు, క్రైస్తవులు. ఈ జిల్లాలో 25 మాతృభాషలు కలవారు ఉన్నారు. వీరిలో అధికసంఖ్యాకులు 16,41,350 మంది తెలుగువారు ఉన్నారు. కందుకూరు డివిజన్: ఈ డివిజన్లో లో కందుకూరు, కని గిరి, పొదిలి, దర్శి అను నాలుగు తాలూకాలుక లవు. డివిజన్ వైశాల్యము 2956 చ. మైళ్ళు, జనాభా 5,80,100 మంది. కందుకూరు తాలూకా : ఈ తాలూకాలో ఉత్తరమున పొదిలి, పడమట కనిగిరి, దక్షిణమున కావలి తాలూకా లున్నవి. తూర్పున బంగాళాఖాతమున్నది. సముద్రతీర ప్రాంతమగుటచే ఇందు ఇసుక బయళ్ళు కలవు. తాలూకా యందు అంతటను పొదల అడవి కలదు. మధ్యమధ్య నారికేళ వనములు, తాటితోపులు, సరుగుడు తోటలు కలవు. అచ్చటచ్చట విడివిడిగా గుట్టలున్నవి. మన్నేరునది ఈ తాలూకాగుండ ప్రవహించుచున్నది. ఉప్పుటేరు, పాలేరు, మూసీనది ఇందలి ఇతరములయిన చిన్న నదులు. తాలూకా వి స్తీర్ణము 801 చ. మైళ్ళు. ఈ తాలూకాలో 74.65 చ. మైళ్ళ అరణ్యము కలదు. సగటున ఇందు 33.05 అంగుళముల వర్షపాతముండును. నల్ల రేగడి, ఎఱ్ఱమట్టి భూమి, కలగలుపు భూమి, ఇసుక పట్టలు దాదాపు సమాన విస్తీర్ణము కలవిగా నున్నవి. మాచవరము, మోపాడు. పొన్నలూరు, కారేడు, ప్రభృతి గ్రామములందలి చెరువులు తరి వ్యవసాయమునకు ముఖ్యాధారములు. 1,80,325 ఎకరములు ధాన్యముల పంటకును, 11,788 ఎకరములు వాణిజ్యపు పంటలకును వినియోగింపబడును. ఆ ఈ తాలూకా జనసంఖ్య 2,01,816. ఇందు 1,01,884 మంది పురుషులును, 89,962 మంది స్త్రీలును ఉన్నారు. 1,89,409 మంది గ్రామవాసులును, 11,907 మంది పట్టణ వాసులును కలరు (1951). కందుకూరు, సింగరాయికొండ అను ఈ రెండును జాతరలు జరుగు ప్రదేశములు. చుండి కందుకూరు సీమకు రాజధానిగా నుండెను. ఈ తాలూ కాలో లి హైస్కూళ్ళు, 180 ఎలిమెంటరీస్కూళ్ళు, 5 వయోజన పాఠశాలలు కలవు. 9737 మంది వాలురును, 5208 మంది బాలికలును విద్యను అభ్యసించుచున్నారు. కందుకూరు 1886 కువీర పరిశ్రమలు కలవు. వీటిలో 4778 మంది జనులు పనిచేయుచున్నారు. చుండీ ప్రాంతములో "క్యానైట్" అను లోహము (Kyanite) అధిక ప్రమా ణములో దొరకును. ఈ తాలూకాలో 1 పట్టణము, 160 గ్రామములు కలవు. జలుగుతల్లి, పాకేల, కాలేడు అను గ్రామములు మాత్రమే 5000 లకు మించిన జనసంఖ్యను కలిగియున్నవి. ఇందు 39,763 ఇండ్లు గలవు. పదుమూడవశ తాబ్దములో కాటమరాజు అను యాదవ సంఘ వల్లభునకును, నెల్లూరు నేలుచుండిన మనుమసిద్ధి నృపాలునకును పసుల పుల్లరి విషయములో తగవులు ఏర్పడి ఉభయులకు గొప్ప యుద్ధము జరిగినది. ఆ యుద్ధ ముతో సంబంధముగల కాటమరాజు చరిత్రకును ఈ తాలూకాకును సంబంధము కలదు. ఈ విషయమును సూచించెడు శిలాశాసనము ఈ తాలూకా యందలి గుండ్ల పాలెములోని బ్రహ్మేశ్వరస్వామి ఆలయమున కలదు. ఆ శాసనమున ఈ క్రింది వక్కాణము గలదు : "జోరుగంటి ప్రతాపుని కాలమున కాటమ రాజు 82 రాజ్యంచేసి లింగాల కొండ ఎర్రగడ్డ పాటను నలసిద్ధి రాజు గూడి యుద్ధంబుచేసి బడుగులవారు జనిపొ పొయ్యే నాంటికి కలియుగంబోచ్చి 3985 యేండ్లాయెను"...... “స్వస్తిశ్రీ శాలివాహనశక వర్షంబులు 1170 అగు నేంటి కాళయుక్తి సంవత్సర కార్తిక కు. 5గు. నెల్లూరి నలసిద్ధి రాజు సర్వసన్నాహం మెరసి లింగాలకొండ ఎర్రగడ్డపాటి కూడలి సోమేశ్వరుని సందలిన నానఅత్రేయగోత్ర యాదవ క్షత్రియ మధురాపురమం దీశ్వర శ్రీవిష్ణుయోగమాయ దివ్య శ్రీపాదక బ్రకట శాత్రవ భంజన నచ్చేరవుంది పాత్రలాయత్తనం గౌరవ పౌరవుండు ద్వారకాపురి గోపికావల్లభుని పౌత్రుండు వల్లురాజు, అతని సుతులు పోలురాజు పెద్దురాజు వారి పుత్రులు మొదలైన యాద వులు నలసిద్ధింగూడి యుద్ధము సేసి మృతులైరి... భాగీరతి దుర్గస్తానం కొండయ్య కొడుకు రామయ్య వుద్ధరించిన శాసనం": కందుకూరు పట్టణము : కందుకూరు పట్టణము కందు కూరు డివిజనుకును, తాలూకాకును ప్రధానస్థలము . 1. కాలమరాజు చరిత్రకు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు రచించిన పీతికనుండి ఉద్ధృతము. 461