Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ ఉండి. ఈ పరిశోధనములద్వార, వివిధ గాఢతల ద్రావణములలోని అయాన విచ్ఛేదనము (Ionic Disso- ciation - విద్యుద్వాహక ద్రవ్యద్రావణముందు ద్రవ్యము అయాన్లుక్రింద విడిపోవుట) నకు వర్తించు నొక సమీకర ణము కనిపెట్టెను. ఇది నేటికీ 'ఓస్ట్ వాల్డ్ అవమిశ్రణ నియమము' (Ostwald Dilution Law) అని పిలువ బడుచున్నది. ఓస్ట్ వార్డు 1887 వ సం. నుండి 1997 వ సం. వరకు జరిపిన పరిశోధనములు నాలుగు పుస్తక ములక్రింద అచ్చు వేయబడినవి. ఇతడు లిఫ్టిగ్లో కూడ గ్రంథరచన సాగించుచునే యుండెను. భౌతిక రసాయనశాస్త్రములో అనేక విషయములపై గ్రంథములు ప్రచురించెను. 1894 వ సంవత్సరములో విద్యుత్ రసాయన పరిశోధన ఫలితములు ప్రచురించుటకు ఒక ప్రత్యేక పత్రికను స్థాపించెను. ఓస్ట్ వాల్డ్ ఒత్తిడిపై 1897 వ సం లో లీస్టిగ్ లో త్త ప్రయోగశాల (లేబొరేటరీ) నిర్మించబడెను. ఇచట ఓస్ట్ వాల్డ్ ప్రేరక ప్రక్రియలపై (catalytic reactions) పరిశోధనములు ప్రారంభించెను. కొన్ని రసాయన క్రియలు మామూలు పరిస్థితులలో గుర్తింపలేనంత నెమ్మదిగా జరుగుచుండును. కాని వాటికి ఒక ద్రవ్యము చేర్చిన చో ఆ ప్రక్రియలో వేగము హెచ్చును. ఈ విధానమును ప్రేరణమందురు. ప్రక్రియా వేగములో మార్పు తెచ్చు ( ఈ మార్పు వేగమును తగ్గించుటకూడ కావచ్చును) ద్రవ్య ములను ప్రేరకద్రవ్యములు లేక ప్రేరకము లందురు. ఈ ప్రేరణ క్రియలను సమగ్రముగా పరిశీలించి, ప్రేరక ముల - క్రియావిధానమును గురించి ఓస్వాల్డ్లు కొన్ని సూత్రములు నిర్వచించెను. L ఈ పరిశోధనములు జరుపుచున్నపుడే ఇతడు ఔయెర్ (Bouer) తో కలిసి ఒక ముఖ్యమైన రసాయన క్రియ సాధించెను. అది ప్రేరకముద్వారా అమ్మోనియాను ఆమ్ల జనీకరణ మొనర్చుట. వీరు ప్లాటినము ధాతువును ప్రేరక ద్రవ్యముగా మపయోగించిరి. అమ్మోనియాను ఆమ్లజని వాయువుతో కలిపి బాగుగా వెచ్చచేసి ప్లాటినముపై పంపి నచో అమ్మోనియా ఆమ్లజనీకరణము చెంది వైట్రిక్ ఆక్సైడ్ క్రింద మారును. దీనినుండి నత్రికామ్లము తయారు చేయుట చాల సులభము. ఈ విధానమునకు త్వరలోనే 58 457 పారిశ్రా ఓస్ట్్వల్డ్ ఫీడ్రిషవి లైలి శ్రామిక ప్రాముఖ్యము లభించుట ఆ విషయము కాడు. ఆశ్చర్యకరమైన ఓర్ట్ వాల్డ్ ప్రేరణ విధానముపై జరిపిన పరిశోధన ములకు 1900 వ సంవత్సరములో ఇతనికి నోబెల్ బహు మానము ఈయబడెను; సైన్సు ఆకాడమీలు, వ్వి విద్యా లయములు మొదలైన 67 సంస్థలు ఇతనిని గౌరవించినవి. ఎన్నియో పడకములు బహూకరింపబడినవి. పని తీవ్రతవలన ఇతని ఆరోగ్యము సన్నగిల్లెను. అప్పు డప్పుడు ఇంగ్లండు అమెరికా దేశములకు ఉపన్యాసము లిచ్చుటకు వెళ్ళినప్పుడు కొరకిన విశ్రాంతి తప్ప ఎల్లప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నుడై ఉండెడివాడు. ఓస్ట్ వాల్డ్ అభి రుచి కేవలము రసాయనశాస్త్రమున కేగాక ఎన్ని యో శాఖ లకు వ్యాపించియుండెను. సంగీతము, చిత్రలేఖనములలో పాఠశాలలలో చదువుచున్న కాలమునుండి ప్రవేశముండెను. లీప్లైగ్ లో నున్న చివరిరోజులలో ఇతనికి త సత్త్వశాస్త్ర ముపై అభిరుచి కలిగెను. ఈ విషయములపై ఎన్నియో ఉపన్యాసము లిచ్చుటేగాక పుస్తకములను రచించెను. ఒక తత్త్వశాస్త్ర పత్రికకు సంపాదకత్వము కూడ వహించెను. ఓస్ట్ వాల్డ్ 1906 వ సంవత్సరములో ప్రొఫెసరు పదవి నుండి విరమించుకొ నెను. కాని యితనికి విశ్రాంతి లభించ లేదు. విజ్ఞాన సంస్థలనుండి ఉపన్యాసములు ఇచ్చుటకో లేక క్రొత్త సంఘములు స్థాపించుటకో పిలుపులు వచ్చు చునే యుండెను. శాస్త్రీయ విజ్ఞానవ్యాప్తికి సహాయ పడుటకు ఓన్వాల్డ్ ఎన్నడూ వెనుదీయలేదు. చివరిరోజులు చిత్రలేఖనములో గడిపెను. ఈ రోజుల లోనే రంగుల ఛాయలపై పరిశోధనములు జరిపి ఒక పు సకము కూడ రచించెను. 1992 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఇతడు లీప్జిగ్లో మర లో ణించెను. ఓస్ట్ వాల్డ్ గృహజీవితము సుఖవంతముగా నుండెను. 1879 వ సంవత్సరములో తాను ప్రేమించిన స్త్రీని వివాహమాడెను. ఈమె అతనికి చివరివరకు ఎంతో భక్తితో సేవచేసి గృహభారము కడుసమర్థతతో నిర్వ హించెను. ఇతని సంతానములో ఒక కూతురు చిత్రకారిణి గను, కొడుకు ఫుల్ఫ్ డాంగ్ ఓస్ట్వాల్డ్ భౌతిక రసాయన శాస్త్రజ్ఞుడుగను విశేష ఖ్యాతి గాంచిరి. 3. *.