ఓనాల్డ్ ఫీడ్రిష్ విల్హెల్మ్ 1831 వ సం॥ లో రిగా పాలిటెక్నిక్ లో పదవి ఖాళీ అయినపుడు, దానికి ఓస్ట్ వాల్డ్ ప్రొఫెసరు బడెను. ఆహ్వానిం i ఇది మొదలు రిగా వదలు వరకు (1887) ఓస్ట్ వాల్డ్ తీవ్రతతో పరిశోధనములు సాగించెను. ఇతనికి మొదటి నుండి ద్రవ్యముల రసాయనికాకర్షణమును పరిశీలించుట యన్న యెక్కువ శ్రద్ధయుండెను. పూర్వము ద్రవ్యములు రాసాయనిక ముగా సంయోగము చెందుటకుగల కారణము కానీ వాటిమధ్యనున్న బంధుత్వమని తెలుపుచుండిరి. 1799 లో బెర్తోలే (Berthollet) తన ప్రయోగముల ద్వార, సంయోగ కార్యము కేవలము ద్రవ్యములమధ్య నున్న బంధుత్వమేగాక వాటి పరిమాణములనుబట్టి కూడ ఉండునని నిరూపించెను. అనగా బంధుత్వములోని లోటును ద్రవ్యరాశి (Mass) తీర్చగలదని స్పష్ట మయ్యెను. రసాయన క్రియలు ఒకే సాంద్రతగల ద్రావణములలో జరిపిన రాసాయనిక బంధుత్వము సులభముగా పరిశీలించవచ్చునని, ఓస్ట్గ్వాల్డ్ అభి ప్రాయపడెను. ఇంతకుపూర్వమేఇతడు, (డోర్పటులో వివిధ ఆమ్లములు ద్రావణ రూపములో, ఒకే ప్రక్రియలో వేరు వేరుగా పాల్గొనినపుడు భౌతిక ధర్మములలో తెచ్చు మార్పులనుబట్టి వాటి బలములనునిర్ణయించెను. ఇపుడు కొన్ని రసాయన క్రియల వేగములో . సంగ్రహ ఆంధ్ర ఈ రోజులలో నే ఓస్ట్ వాల్డ్ జర్మనీ వెళ్ళ అచ్చటి విశ్వ విద్యాలయములను సందర్శించేను. అర్హీనియస్ ను కలిసి కొనుటకు స్వీడను వెళ్ళెను. ఆతని పనిని మెచ్చుకొని తన లేబొరేటరీకి ఆహ్వానించెను. అర్హీనియస్ ఓస్ట్ వాల్డ్ కలిసి రిగాలోను, తదుపరి లీగ్లోను ప్రయోగములు జరిపెను. వీరిద్దరు కలిసి జరిపిన ప్రయోగములు భౌతిక రసాయన శాస్త్రములో ఎన్నియో పరిశోధనములకు దారితీసెనని చెప్పవచ్చును. ఓష్ట్వాల్డ ఆమ్లములు తెచ్చుమార్పును బట్టి వాటి బలమును కొలిచేను. మీ థెల్ ఎసిటేటు జలవిశ్లేషణము (hydrolysis), పంచ దార ద్రావణము గ్లూకోస్ ఫ్రక్టోస్ క్రింద విశ్లేషించ బడుట, మొదలగు ప్రక్రియలు చాల నెమ్మదిగా నడచును. కాని వాటిలో ఆమ్లము చేరినచో అవి త్వరగా పూర్తి అగును. ఈ ప్రక్రియల వేగములో వివిధ ఆమ్లములు తేగల మార్పులు వాటి బలములపై ఆధారపడి ఉండునని తన ప్రయోగముల ద్వారా నిరూపించెను. ఈ పరిశోధనముల ఫలితములేకొన్ని సంవత్సరముల తరువాత ఓస్ట్ వాల్డ్ ను వేరక ప్రక్రియలు (Catalytic reactions) పరిశీలించు టకు-ప్రోత్సహించెను. 456 ఓస్ట్ వాల్డ్ రీగాలో నుండినపుడు సాధించిన కార్యము లలో రెండింటిని పేర్కొనక తప్పదు. మొదటిది భౌతిక రసాయన శాస్త్రముపై తాను రచించిన పుస్తకము ప్రక టించుట, ఈపుస్తకములో అప్పటివరకు ఈ శాస్త్రమును గురించి తెలిసిన విషయములను, కనుగొనబడిన సిద్ధాంత ములను సమగ్రముగా అతడు విశదీక రించెను. రెండవది, భౌతికరసాయన శాస్త్రములో జరుగు పరిశోధనముల ఫలితములు ప్రచురించుటకు ఒక పత్రి కను స్థాపించుట. ఈ రెండు పనులు భౌతిక రసాయన పురోగమనమునకు ఎంతో తోడ్పడినవి. 1887 వ సం. లో ఓస్ట్ వాల్డ్ కు జర్మనీలోని లిప్జిగ్ విశ్వ విద్యాలయ ములో భౌతిక రసాయన ప్రొఫెసరు పదవి లభించెను. లీప్లైగ్ కు ఆహ్వానింప బడుట ఒక గౌరవమేగాక, గొప్ప అదృష్టముగా ఓస్ట్ వాల్ భావించెను. లీప్జిగ నకు వచ్చిన కొలదికాలములోనే అక్కడ ఎన్నియో మార్పులను తెచ్చి ఒక నూతన వాతావరణ మేర్పరచెను. అక్కడ ఇతనితో పనిచేసిన వారందరు ప్రసిద్ధ శాస్త్రజ్ఞులే. అర్హీనియస్, బ్రెడిగ్, బోడెన్ ను, ఫ్రోయిండ్లిష్ నెర్నస్ట్, కెక్మను మొదలైన వారిని భౌతికరసాయన శాస్త్ర ప్రధానస్థాపకు లనవచ్చును. ఓస్ట్ వార్డు పరిశోధనములు జరుపుటేగాక అచ్చటికి ఆకర్షింప బడ్డ వందలకొలది విద్యార్థులకు శిక్షణమునిచ్చి పరిశోధన ములు జరుపుటకు ప్రోత్సహించుచుండెడివాడు. లీస్టిగ్ లో ఓస్ట్ వార్డు జరిపిన పరిశోధనలు ముఖ్యముగా అర్హీనియస్ అయానీకరణ సిద్ధాంతముపై ఆధారపడి
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/517
స్వరూపం