ఓషధులు
సంగ్రహ ఆంధ్ర
కసకార్క వటావహ్ని ర్విద్రుమః పంచమస్తభా |
తిలకం కురుతే యస్తుపశ్యేత్తం పంచదారిపుః ॥
ఆర్దాయాం వటవంచాకం గృహీత్వా ధారయేత్త రే
సంగ్రామే జయమాప్నోతి జయాంస్మృత్వా జయీభవేత్౹౹
ఇందు విజయసిద్ధికై అయిదు యోగములు చెప్పబడినవి. మొదటిదానిలో గోజిహ్వ యనుదానినిగాని, శిఖీషూల మును గాని పుష్యమీ నక్షత్రములో ఉద్దరించి ధరింప వలయుననియు, రెండవయోగములో ఒక శిఖిమూలమునే మార్గశిర పూర్ణిమనాడు సంగ్రహించి ధరించవలెననియు, దానివలన వివాదమునందు జయము కలుగుననియు, మూడవ యోగములో గిరికర్ణి, శమీ, శ్వేత గుంజ యను వానిని జేర్చి నూరి, అందులో చందనమును గూడ చేర్చి తిలకముగ ధరించినను, నాల్గవ యోగములో కనక (నల్ల ఉమ్మెత్త) అర్క, వట, వహ్ని- విద్రుమములు చేర్చి తిలకముచేసి ధరించినను, అర్ధా నక్షత్రమున వట వందాకమును గ్రహించి దానిని హస్తమునందు ధరించినను, శత్రువులను ఓడించు నని చెప్పబడియున్నది.
'పుష్యోద్ధృతం సీతార్కస్య మూలం వామేత రేకుజే
బద్ధ్వా సౌభాగ్య మాప్నోతి దుర్భగాని నసంశయః॥
' పుష్యమీ నక్షత్రమునందు ఉద్ధరింపబడిన సీతార్క మూలమును (తెల్ల జిల్లేడు) దక్షిణ భుజమున ధరించినచో సౌభాగ్యవతి యగును.
వ్యాఘ్రనివారణమునకు ---
'ముఖస్థం బృహతీమూలం, హస్తస్థం వ్యాఘ్రభీతిజిత్* బృహతీమూలమును హస్తమునందును, ముఖము నందును, ధరించిన వ్యాఘ్రభీతి యుండదు. దీనికిని పై వానికివలేనే వేరే మంత్రముగూడ జెప్పబడినది. దానిని పురశ్చరణ చేసిన పిమ్మటనే ఇది ఫలించును.
'మూలం కృష్ణచతుర్దశ్యాం గ్రాహ యేల్లాంగలీభవం |
హ స్తస్థం వ్యాఘ్రభీతాది భయహృత్పరి కీర్తితమ్ '
కృష్ణచతుర్దశినాడు యథాకల్పముగ లాంగలీ మూలమును ఉద్దరించి హస్తమునందు ధరించినచో వ్యాఘ్రభయము తొలగును.
· పుష్యారే. మధువందాకం గృహీత్వా ప్రథ పేద్భుధః
సభామధ్యేచ సర్వేషాం ముఖ స్తంభః ప్రజాయతే॥'
పుష్యమీ నక్షత్రయుక్త థానువారమునాడు మధువం దాకము (ఇప్పబదనిక)ను సంగ్రహించి యుంచుకొని సభా మధ్యమున పై చినచో సభలో నుండువారికి ముఖ స్తంభన గలుగును.
నౌకా స్తంభనము —
భరణ్యాం వీరకాష్ఠన్య కీలం పంచాంగులం & పేత్!
నౌకామధ్యే తచానౌకా స్తంభనం జాయతే ధ్రువమ్||
భరణినడత్రమున వీరకాష్ఠము (పాలకట్టె) యొక్క పంచాంగులు పరిమితమైన కీలమును నౌకయందు మధ్య ప్రదేశములో నుంచిన నౌక స్తంభించును.
శస్త్రస్తంభనము ..-
కపిమళ్యసవంచాకం కృత్తికాయాం సమాహరేత్ :
వక్త్ర సంస్థంతు దేవస్య శస్త్రస్తంభనకం పరమ్
కరేసుదర్శనా మూలం బంధనాత్ స్తంభనం భవేత్ |
గృహీత్వా శుభనక్షత్రే అపామార్గన్య మూలకం
తేవమాత్రే శరీరాణాం సర్వళస్త్ర నివారణమ్||
ఫుష్యార్కే శ్వేత గుంజాయా మూలముద్ధృత్య ధారయేత్౹
హస్తే కాండథయం నాస్తి సంగ్రామేచ కదాచన॥
కృత్తికా నక్షత్రమునందు కపిమవంచాకమును గ్రహించి ముఖమం దుంచుకొనినను - హస్తమునందు సుదర్శనా మూలమును బంధించుకొనినను, శుభనక్షత్రమున అపా మార్గ మూలమును గ్రహించి, నూరి దానితో శరీరమునకు లేపము చేసికొనినను, పుష్యార్క యోగమున శ్వేత గుంజా మూలము నుద్ధరించి హస్తమునందు ధరించినను, యుద్ధము నందు శస్త్రభయ ముండదు.
విజయనగర సంస్థానమునకు చెందిన అరణ్యములలో కోయవాండ్రను జయించుటకు ప్రయత్నము జరిగి, అందు నాయకుని పట్టికొట్టునపుడు వానికి శస్త్రబాధ కలుగకుండుటను జూచి వాని శరీరమును, కేశములను వెదకి అందున్న మూలికలను దీసివైచి కొట్టుటచే వెంటనే మృతి చెందెనని చెప్పుదురు. అటులనే ఒక దొంగలనాయకుని విషయముగూడ చెప్పుదురు.
అంకోల తైలము : “శవముఖే బిందుమాత్రం తతైలం ప్రక్షి పేద్యది | ఏకయామం భవేన్జీవోనాన్యధా శంకరో దితం " అంకోలభైలము నొక బిందుమాత్రము శవ