Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = _j నొక గొప్ప రచయితల బృందము అవతరించెను. అతడు సారస్వత వ్యవసాయమునందు నిర్వ్యాజమైన ఉత్సాహము గలవాడు. అతడు వృత్తపత్ర లేఖన కళ (journalisun) యందు మార్గదర్శకుడు, ధర్మపదకార కవిత మొదలగు కృతుల నాతడు రచించెను. కృపాసింధు మిశ్ర, పండిత నీలకంఠదాన, పండిత గోదావరీశ మిశ్ర, పండిత వాసు దేవ మహాపాత్ర ప్రభృతులయిన సుప్రసిద్ధ రచయితలు, పండితులు, విద్యావేత్తలును అతనికి సహకారులు. నీలకంఠ దాసు అత్యుత్తమ శ్రేణికి చెందిన వ్యాసములను, విమర్శ నలను వ్రాసెను. 'కోణార్క', 'ప్రణయిని' అనునవి ఆతని ఉత్కృష్టమైన రచనలు. పండిత గోదావరీళ మిత్రుడు ప్రతిభావంతుడైన కవి. ఆంగ్లేయపద్ధతులపై నతడు రచించిన గీతములచే అతనికి గొప్పకీర్తి చేకూరెను. అతని 'ఆలేఖిక' స్థానిక ఇతివృత్తములతో రచింపబడిన కొన్ని గీతముల సంపుటియైయున్నది. అతని 'కాలీజాయీ' అను గీతము కడు రసాత్మకము. అది ఒరిస్సాయాత్రి నౌకావిషయక ఖ్యాతి స్మారకముగా రచింపబడినది. అతడు ‘కిసలయ', 'చయనిక' అనునట్టి లలిత ములయిన పద్య కృతుల రచించెను. ఒరిస్సా పత్రికలకు తమ రచన లను ఇచ్చుచు సేవచేసిన సత్యవాదిక విబృంద మను రచ యితల అపారకృషికి ఆధునిక మైన ఒరిస్సా వాఙ్మయము మిక్కిలి ఋణపడి యున్నది. చరిత్ర, వృత్త పత్ర లేఖనక ళ (journalism), వ్యాకరణము . ఈకాలములో ఆరంభింప బడినవి. ఆధునిక సాంఘిక జీవితమును, సారస్వతమును నిర్మించుటలో సత్యవాది బృందము అతి ముఖ్యమైన తోడ్పాటు చేసినది. గోపబంధుదాసు జాతీయ కాంగ్రెసు నందు చేరి, దాని సందేశమును ప్రజల కందజేయుచు, ఒరిస్సా ప్రజలలో గొప్ప సంచలనమును కలిగించెను. వాసుదేవ మహాపాత్రకవి ఒరియా వ్యాకరణమును రచిం చెను. కృపాసింధు మిశ్రకవి ఉత్కల ఇతిహాస రచనము నకు మార్గదర్శకుడయ్యెను. ఈ సత్యవాది బృంద రచ యితలు ఒరిస్సాలో వృత్త పత్రలేఖన కళకును (Journa- lism), చారిత్రక సంకలనములకును, రాజకీయ వాఙ్మ యమునకును ప్రారంభకులైరి. గోదావరీశ మిశ్రుడు - కథారచనలో అతి సమర్థుడైనవాడు. అతడు 'ముదిసే మంత్రీథిలి' వంటి అనేక చిన్న కథల గుచ్ఛములను రచిం 56 441 ఓరియా భాషా సారస్వతములు చెను. దేశములోని విద్యావంతులైన యువకులతో సరి పూర్ణమైన జాతీయగర్వము రేకెత్తెను. ఒరియా బాఙ్మయ మునందు ప్రజావిషయక పరివర్తన రేకెత్తెను. కవులు తమ రచనలను దేశావసరములకోసరమై వినియోగింప వలసిన ఆవశ్యకత కన్పట్టెను. సత్యవాది బృందమునకు వెనువెంటనే వెలసిన అత్యాధునిక యుగమునకు హరిత సమితి యుగమని పేరు. ఈ హరిత బృందమునందు ఉత్సాహవంతులయిన యువకులు అర్ నందా శంకరరాయ, హరిహర మహాపాత్ర - శరీరత ముఖవజీ - వైకుండ పట్టనాయక, కాళిందీచరణ పాణిగ్రాహి ప్రభృతులు అల్పసంఖ్యాకులు పనిచేయుచుండిరి. ఈ హరిత బృందము గేయ కవితాధర్మమున (lyricism)కు పేరుపొందెను. దీని కల్పనారీతులు, ఆశయములు అద్భుతావహములును, విప్లవ కరములును, వాస్తవికములునై యున్నవి. వారి ఆదర్శ ములు, లక్ష్యములు సబ్జుక విత యను పద్య సముచ్చయము వందు అతని నవలలైన అమరచిత, ముకాగడర్ కుడా, మటిర్ మణిష, లుహారమణిష ప్రశంసాపాత్రమైనవి. అతడు ఒరియా వాఙ్మయమున నవలారచనకు కాళండి చరణ పాణిగ్రాహికి పిమ్మట మార్గదర్శకుడుగాను ఒరియా సాహిత్యమునకు సదుపదేశకుడుగాను ఎన్నదగి యున్నాడు. ఆతడు గొప్ప విమర్శకుడు, ఆవేశ కారకుడగు కవి. హరిత సంఘరచయితల నిజమైన సంరక్షకుడు. అటుతరు వాత ఆధునిక యుగమునందలి గొప్ప అభ్యుదయ రచ యితయైన వైకుంఠ పట్టనాయకుడు ఆధునిక కవులలో నొకడు. అతడు వేదాంత విషయకములైన పద్యములను వ్రాసెను. ఆతనియొక్క కావ్యనించయము, 'ముక్తి పథ' అను రచనలు అతని యొక్క మేధాసంపదను చాటు చున్నవి. పూర్వోక మైన హరిత సంఘరచయితలేకాక అర్ నదా శంకరరాయకవియు, హరిహర మహాపాత్ర తదితరులును, ఒరియా వాఙ్మయ నిర్మాణమునకై అత్యంత "సేవను చేసిరి. హరిత సంఘమును, అందలి కర్మములైన సభ్యులకు తోడు, 'ధూప' అను మిక్కిలి వ్యాప్తిచెందిన రచన యొనర్చిన డాక్టరు మాయధరమాన్ సింగ్ అనునతడు కూడా ఒరియా వాఙ్మయములో నెన్నదగిన గొప్పవ్యక్తి.