Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

{ విజ్ఞానకోశము = ౨ యుగము. ప్రతాపరుద్రదేవుడు మొదలు దివ్యసింఘ దేవుని వరకు.) (ఇ) కావ్యయుగము లేక రీతి (Riti) యుగము. (ఈ) సంగీతయుగము లేక రాధానాథ పూర్వయుగము (క్రీ.శ. 1700-1850.) (ఉ) నవయుగము లేక రాధానాథ-మధుసూదన - ఫకీరు మోహన్ (క్రీ. శ. 1850-1920) ల యుగము. M - (ఊ) రాధానాథ - అనంతరయుగము లేక నవీన కవి యుగము. ఇందు శ్రీ కాళిందీచరణ పాణిగ్రాహి-వైకుంఠ నాథ పట్టనాయక - ఆనంద శంకరరాయ మాయాధర మానసింఘ్ మున్నగువారి నాయకత్వమున నున్న హరిత సంఘము (Green Group క్రీ.శ. 1919-1985) మొదటిది. పండిత గోపబంధుదాసు, పండిత నీలకంఠదాసు, పండిత గోదావరీళ మిశ్రుడు, గోదావరిశ మహాపాత్రుడు, వాసుదేవ మహాపాత్రుడు, కృపాసింధు మిశ్రుడు మున్నగు వారి నాయకత్వముననున్న సత్యవాది సంఘము (Satya Vadi Group) రెండవది. (ఋ) రాధానాథునికి అవ్యవహితో త్తర కాలికులును, సమకాలికులునునైన కవులు (క్రీ.శ. 1900-1990). (ౠ) అత్యాధునిక కవులు, అతివాది కవులు - వారిలో పేర్కొనదగిన రచయిత సచ్చిదానంద రాఉతరాయ్ మొద లగువారు (క్రీ. శ. 1922 1955). ఒరియా వాఙ్మయములో ఏది అత్యంత ప్రాచీనమైన కావ్యము అను సంశముపై భేదాభిప్రాయము లున్నవి. కొందరు, మార్కండదాసు యొక్క కేశవ కోయిల్ (Kesav Koil) ప్రాథమిక రచన అనియు, మరికొందరు బఛాదాసు యొక్క కలసాచౌతిళా (Kalasa Choutisa) ప్రప్రథమ రచన అనియు అనుచున్నారు. మాదలా పొంజి అనునది అత్యంత ప్రాచీనమైన ఒరియా వచన రచనకు నిదర్శనము. అది పూరియందలి జగన్నాథాలయమునకు సంబంధించిన చరిత్రను తెలుపునట్టి యొక తాళ పత్ర గ్రంథము. మరికొన్ని ప్రాచీనములైన ఒరియా వచన కావ్యములును కలవు. వాటిలో ఓపాసు (oshas) అనగా స్త్రీల ఉత్సవములును, ఒరిస్సా యందలి కొన్ని రాజవంశ ముల చరిత్రయును వర్ణింపబడి యున్నవి. ఆదిమ పద్య కావ్య రచయితలు సాధారణ మానవునకు రుచించు 435 ఒరియా భాషా సారస్వతములు నట్టియు సామాన్యమైనట్టియు రచనపైనను, ఛందస్సు పైనను తమ దృష్టిని కేంద్రీకరించిరి. ఓరియా వాఙ్మయ మున నూరు వృత్తము లుండుట యొక పిలక్షణము. సాధారణ వాఙ్మయములో అవలంబింపబడిన చౌతీశా అను వృత్తమునందు అధమపక్షము 34 పంక్తు లుండెడివి.. 'క' నుండి వరకుగల అక్షరములు క్రమముగా ప్రతి పంక్తికిని మొదటి అక్షరములుగా నుండవలెను. హాస్యరని పూరితముగను, ఆహ్లాదకరముగను శివపార్వతుల వివాళ- మును వర్ణించిన కలసా చౌతిశాయును, ధక్తచరణదాసు రచించిన మన బోధ చౌతీశాయును, 19వ శతాబ్ది ప్రారం భము నందలి ఒరియా చౌతీశా వాఙ్మయమునకు ఉత్తమ మైన మచ్చుతునకలు. ఒరియా యందలి కోయిల్ అను పదము కోయిల (కోకిల) అను పదమునకు ప్రతిరూపము. మార్కండేయదాసు వ్రాసిన 'కేశవకోయిల్' లేక ‘యశోచా కోయిల్ ’అనునది మరి యొక ఒరియావాఙ్మయ ప్రక్రియకు చెందినది. ఇది స్వగతవచోరూపము. మిక్కిలి వ్యాప్తిలోనుండి, పాఠశాలకు పోవు పిల్లలందరిచేత సాధారణముగా ఇది కంఠస్థము చేయబడుచున్నది. ‘యశోదాకోయిలి’లో యశోధ, తన బిడ్డడైన కృష్ణునితో తనకు కలిగిన ఎడబాటువలన జనించిన విషాద భావ ములను కోయిలలో చెప్పుకొనుచున్నది. ఈ విధముగా కోయిల మానవుల కష్టముల యెడ సానుభూతి గలిగినదిగా ప్రతిపాదింపబడినది. జగన్నాథదాసు రచించిన అర్థకోయిల్ అనునది కేళ వకోయిల్ యొక్క ఆధ్యాత్మిక వ్యాఖ్యానమై యున్నది. బలరామదాసు వ్రాసిన 'కాంతకోయిల్' రావ ణుని చెరసాలయందున్న సీత యొక్క మనోవృత్తిని వివ రించుచున్నది. 'బరమాసికోయిలి'ని శంకరదాసు రచించెను. ఈ రచనలన్నియు కరుణరసముతోను మానవుని అంతర భావములతోను నిండియున్నవి. సరళ దాసు రచించిన మహాభారతము బ్రహ్మాండమైన వీరచరిత కావ్యము. ఇది అనేక పాత్రలతోను, కథలతోను, సాంఘిక జీవన వర్ణనల తోను, మతసంబంధమైన బోధనలతోను, 18 భాగములుగా రచింపబడిన కవి యొక్క స్వతంత్రసృష్టి. చండీపురాణము, బిలంకా రామాయణము అను మరి రెండు గ్రంథములను ఈకవి వ్రాసినాడు. ఈ కవి అభిప్రాయము ననుసరించి ఈ రచన లన్నియు, అతనికి భగవతి యైన సరళాదేవి