Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒరియా భాషా సారస్వతములు చును. సాధారణముగా హల్లులు అచ్చులసహాయము లేనిదే స్వతంత్రముగా ఉపయోగింపబడవు. ఒక్కొక్క ప్పుడు 2, 3 హల్లులును, ఒక అచ్చును కలిసి ఒక పరిపూర్ణ మైన అక్షరముగా ఏర్పడుచుండును. సంస్కృత వ్యాకర ణమునందలి లింగ నిర్ణయపద్ధతికి ఇందు తావులేదు. ఇందు లింగభేదము విశేషముగా, ఆయా వస్తువు యొక్క లింగ భేదమును బట్టియే యేర్పడును. ఓడ్ర భాషయందలి అనేక పదములకు, ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని సంస్కృతభాషయే మూలాధారమయి యున్నది. ఇందలి వ్యాకరణ లక్షణములుకూడ చాలాభాగము సంస్కృత వ్యాకరణ లక్షణమునే అనుసరించుచున్నవి. ప్రాచీన కాలములో సాంఘికముగా, రాజకీయముగా, వాణిజ్య రీత్యా, వివిధ దేశములతో నేర్పడిన అన్యోన్య సంబంధము వలన ఓడ భాషలో నూర్లకొలది, తెలుగు, తమిళము, అరబ్బీ, పార్సీ, ఉర్దు, ఇంగ్లీషు, ఫ్రెంచి మున్నగు వివిధ భాషావదములు కానవచ్చుచున్నవి. ఒరియా లిపి, 'కుటిల్, (Kutil) దేవనాగరి (Devan agari) లీపులద్వారా, బ్రాహ్మీలిపి జన్యమైన మాగధి లిపి నుండి పుట్టినది. వాడితేలిన ఇనుపగంటముతో తాళపత్ర ములపై వ్రాయుటచేత, అక్షరములు పైభాగమున గుండ్రముగా నుండెడివి. క్రీ. శ. పదమూడవ శతాబ్దము నాటికి ఓఢభాష స్వీయములైన లిపులను అభివృద్ధిచేసికొన గల్గినది. అక్షరములకు గుండ్రని తలకట్లు ఉండుటయే ఒరియా భాషకుగల ప్రత్యేకతయై యున్నది. ఒరియా భాష, ఆ భాషలో అతి విస్తారమగు మత విషయక ప్రాచీన పద్య వాఙ్మయము ఏర్పరచుటకు కొన్ని శతాబ్దులకు ముందే ఉత్పన్నమైనది. భారత దేశ మునందలి అతి ప్రాచీనములైన భాషలలో ఒరియా భాష యొకటి. అది పుట్టి వేయిసంవత్సరముల కంటే ఎక్కువకాలము గతించినది. ఒరియా భాషాచరిత్ర చాలా భాగము నిగూఢ విషయములతోను, రాజకీయ సంక్షోభములతోను పరి వృతమై యున్నట్లు కనిపించును. క్రీ. శ. పదమూడవ శతాబ్దికి చెందిన తామ్ర దానశాసనములయందలి విష యము శబ్దశాస్త్ర ప్రాముఖ్యము కలిగి ఆనాటి వాఙ్మయ సరణులకు ప్రతిబింబముగ నున్నది. క్రీ.శ. పదునొకండవ శతాబ్దికి చాల పూర్వమునందే పక్వస్థితికి రాలేకున్నను సంగ్రహ ఆంధ్ర ఏదియో యొక ఒరియా కావ్యము పుట్టియుండెననుట సత్యము. ఆ కాలములో బహుజనులకు ప్రీతిపాత్రములయి యున్న కొన్ని పాటలు, పద్యములు, కోయిలలు (koiles) భౌతిశా (choutisa), కీర్తనలు మొదలయిన వాటినిబట్టి గాంగప్రభువుల కాలమునందే ఒరియా వాఙ్మయసంస్కృతి ప్రారంభమైయుండి యుండునని నిస్సందేహముగా మనము చెప్పవచ్చును. ఏ వాఙ్మయాభివృద్ధి యొక్క ప్రాథమి కావస్థ యందైనను ఆ వాఙ్మయమునకు సంబంధించిన సామెతలు జనులు జిహ్వాగ్రగతము అయి యుండుట సహ జము. వంగ దేశ మునందును, అస్సామునందును ఇట్టి పెళ్ళు సామెతలు పెక్కురు జనులలో విశేషముగా వ్యాప్తి గాంచినవి. ఒరియా వాఙ్మయమునందును ఇట్టి సామెతలకు కొరతలేదు. విశేషమైన సంస్కృత భాషాప్రభావము కలిగిన ఒరియా భాషా వాఙ్మయముల యొక్క ఆరంభ కాలమును నిర్ణయించుట కీసామెతలు మిక్కిలి ఉపయోగ పడుచున్నవి. కేసరి వంశీయులును (క్రీ.శ. 520–1042), గాంగ ప్రభువులును (క్రీ.శ. 1042-1495) సూర్యవంశ్యు లును (1485–1584) ఒరిస్సాను క్రమముగా పరిపాలించిరి. కపిలేంద్ర పురుషో త్తమదేవుల యొక్క ములును, ప్రఖ్యాతములు నగు శూరకృత్యములును, దేశ భక్తియు, ఏదోఒక రీతిగా ఆనాటి వాఙ్మయారంభము నందు ప్రతిబింబించి యున్నవి. బౌద్ధమత వ్యాప్తి, బ్రాహ్మణుల ప్రభావము, కంచిపై పురుషోత్తమ దేవు డొనర్చిన దండయాత్ర, పూరియందును, కోణార్కము నందును దేవాలయముల నిర్మాణము మున్నగు గొప్ప చారిత్రక సంఘటనలే ప్రబల కారణములయి తొలుదొల్త ఒరియా జాతీయ వాఙ్మయ నిర్మాణమునకు పునాదులుగా నేర్పడెను. క్రీ.శ. 10వ శతాబ్ది మొదలుకొని అర్వాచీన కాలమువరకు పెంపొందిన ఒరియా వాఙ్మయ చరిత్రము నందలి ముఖ్య విభాగములు ఇట్లున్నవి : 434- సాధారణ (అ) క్రీ.శ. 1042 నుండి క్రీ.శ. 1485 వరకు నిర్మా ణాత్మక యుగము (గాంగవంక్యులు మొదలు సూర్య వంశ్యుల వరకు). ఇదియే ప్రథమ గేయ కావ్యయుగము, గద్యోదయ యుగము. (ఆ) 'పంచసఖ' (Panchasakha) యుగము, లేక వైష్ణవమత వాఙ్మయ యుగము లేక పురాణ వీరశావ్య