Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - ౨

ఐస్‌లాండు

(క్యాబేజి), గడ్డి మొదలగునవి పెంచుచున్నారు. దక్షిణమునను, ఐర్లండు మధ్యప్రదేశమునందును పాలు, పెరుగు చేయు పరిశ్రమ ముఖ్యవృత్తి. పుష్కలముగా లభించు పాలనుండి వెన్న, జున్ను తయారుచేయుదురు. మీగడ తీసిన పాలు పోసి పందులను పెంచి, వాటినుండి మాంసమును ఉత్పత్తిచేయుదురు.

ఐరిష్ స్వతంత్ర రాష్ట్రములోకన్న. ఉత్తర ఐర్లండులో పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందియున్నవి. ఇచ్చటి ముఖ్యపరిశ్రమలు, నౌకానిర్మాణము, లినేను ఉత్పత్తియును నై యున్నవి. బెల్ఫాస్టు నౌకానిర్మాణ కేంద్రము. లంకా షైర్ నుంచి బొగ్గు, ఇనుము వీరికి లభ్యమగును. బెల్ఫాస్టునకు పశ్చిమమందలి పల్లపు నేలలు లినెన్ పరిశ్రమకు ముఖ్య కేంద్రములు

గ్రామప్రదేశములలోని గృహములలో మామూలుగ ఉపయోగించు వంటచెరకు పీట్ (కుళ్ళిన వ్రేళ్ళు. మొక్కలు మొ. జీర్ణకములు). షాన్ యందలి విద్యుచ్ఛక్తి కట్టడము ఐరిష్ స్వతంత్ర రాష్ట్రమునందలి పరిశ్రమలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయును. కార్కు యందలి ఫోర్టు పరిశ్రమ చాల ముఖ్యమైనది. ఇచ్చట లేసు అల్లుట, కుట్టుపనులు మొదలగునవి గృహపరిశ్రమలు.

ఐర్లండులో బొగ్గు, బాక్సైట్ గనులు గలవు. బాక్సైటును కరిగించుటకు స్కాట్లండుకు ఎగుమతి చేయుదురు. ఇచ్చటి జనాభాలో 76% మందికి ఇంగ్లీషు రెండవ భాషగా తెలియును. మిగిలినవారు ఐరిష్ భాషయే మాట్లాడుదురు. 1951 లో ఐర్లండులో 29,60,593 మంది జనాభా కలదు. జనాభా అన్ని ప్రదేశములందు సమముగా వ్యాపించియున్నది. పశ్చిను ప్రదేశములందు మాత్రము జనాభా చాల తక్కువగా నున్నది. డబ్లిన్, బెల్ఫాస్టు, కారన్, లండన్ డెరీ మొదలగు చోట్ల 50,000 కు ఎక్కువ జనాభా కలదు. ఉత్తర ఐర్లండునందు 90% జనులు ఆంగ్ల భాష మాట్లాడుదుగు. తక్కిన 10% ఐరిష్ భాష మాట్లాడుదురు. ఐరిష్, స్వతంత్ర దేశము నందు జనులు పూర్తిగా ఐరిష్ తత్వము కలవారు.

ఐర్లండు నంతయు అనేక కాలువలు, నీటిమార్గములు చీల్చుచుండును. అది ఒక వల అల్లినట్లు కనుపించును. ఐరిష్ స్వతంత్ర దేశమునందు డబ్లిన్ రైలుమార్గముల కేంద్రము. ఉత్తర ఐర్లండునందు కెల్ఫాస్టు అట్టి రైల్వే కేంద్రము. డబ్లిన్, బెల్ఫాస్టుల మధ్యను, వాటినుండి లండనువరకును, నిత్యము విమానములు నడపబడుచున్నవి.

ఉత్తర ఐర్లండు, లినెన్, ఓడలు, పాడి వస్తువులు, కోడిగ్రుడ్లు, పశువులు, గొజ్జెలు, బంగాళాదుంపలు, మొద లగునవి ఎగుమతి చేయును. ఐరిష్ స్వతంత్రరాష్ట్రము వ్యవసాయ సంబంధమైన వస్తువులు ఎగుమతి చేయును. ఇవి రెండును బొగ్గు, ధాన్యము, జొన్న, ఎరువులు, టీ, చక్కెర, ఇనుము మొదలగు ఉష్ణదేశ వస్తువులను దిగుమతి చేసికొనును.

ఐర్లండునందలి సముద్రపు చేపల పరిశ్రమ ఆదేశమునకు ఒక విలువయైన జాతీయ నిధిగా నున్నది.

కె. వి. రె.


ఐస్‌లాండు:

ఐస్‌లాండు ఉత్తర అట్లాంటిక్ సముద్రములోని ఒక ద్వీపము. ఇది గ్రీన్ లాండుకు 200 మైళ్ళు తూర్పునను, స్కాట్లండుకు 540 మైళ్ళు పశ్చిమోత్తరమునను ఉన్నది. దీని విస్తీర్ణము 39,709చ మైళ్ళు, నిడివి 298 మైళ్ళు, వెడల్పు 194 మైళ్ళు. జనసంఖ్య 1,51,300. తీర రేఖ యొక్క పొడుగు 3,730 మైళ్ళు, దీనిలోని ¼ భాగము పశ్చిమోత్తర ద్వీపకల్పమునకు సంబంధించినదే. ఐస్ లాండు అగ్ని పర్వతమయమైన పీఠభూమి. అసాధారణ శీతోష్ణస్థితి యుండుటవలన ఈ దీవిలోని మధ్య పీఠభూమి నివాసయోగ్యమైనది కాదు, ఇక్కడి నేలలో నూటికి పదమూడు వంతుల భాగము మంచుగడ్డలతో నిండియుండును. వాతావరణములో తేమ ఎక్కువగా నుండుట, విశేషముగా వర్షములు కురియుట, ఇక్కడ మంచు విస్తారముగా నుండుటకు ప్రబల కారణములు.మంచుగడ్డలు ఎక్కువగా నుండుటవలన ఇక్కడ చిన్న నదులు అసంఖ్యాకములుగా కాననగును. ఈ ద్వీపములోని మంచుగడ్డలు ధ్రువమండలములోని మంచుగడ్డలను పోలియుండును. ఇచ్చట అనేక సరస్సు లున్నవి. వానిలో 'తింవల్ల వాతు' మరియు 'తోరిస్ వాతు' కడు పెద్దవి. ఇవి ఒక్కొక్కటి 27 చ. మైళ్ళను ఆక్రమించుకొని యున్నవి.

ఐస్‌లాండులో దాదాపు 127 అగ్ని పర్వతము లున్నవి. ఈ అగ్ని పర్వతములు వెలిగ్రక్కు లావ్యాద్రవము దాదాపు