Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐర్లండు (భూగోళము)

సంగ్రహ ఆంధ్ర


గుల ఎత్తు మించియుండవు. ఇచ్చటి మధ్యమైదానము బురద నేలతో దగ్గరగా ముడివడి యుండును; కానీ తక్కిన మైదానభాగముల మధ్య పల్లముగా నున్న గట్టినేల చీలికలు వ్యాపించి యున్నవి. ఇచ్చట ఎక్కువ ఫీట్ (కుళ్ళిన వ్రేళ్ళు. మొ.) సరఫరా అగును. సముద్రతీరము నందలి అన్ని భాగములకు నదులు ప్రవహించుచు, మధ్య మైదానము నందలి ఎక్కువ నీటిపారుదలకు ఆధారములుగా నున్నవి.

ఇచ్చటి ముఖ్యమైన నదులన్నియు పర్వతములలో పుట్టినవి.

ఐర్లండులోని పెద్దనదిగా 'షానన్ ను పేర్కొననగును.ఇది 200 మైళ్ళ పొడవుకలిగి ఉన్నది. మధ్య మైదానము నందలి పశ్చిమ భాగము మీదుగా, ఉత్తరమునుండి దక్షిణ ముఖముగా ఇది ప్రవహించుచున్నది. సున్నపు రాయి కరుగుటచే ఏర్పడిన విశాలమైన లోతులేని అనేక సరస్సుల మీదుగా ఈ నదీ ప్రవహించుచున్నది. ఐర్లండులోని ముఖ్యమైన నదులు, లాగూన్, బోయిన్, లిప్ఫే, స్లేన్సీ యైయున్నవి. ఇవి తూర్పు సముద్ర తీరమునకు ఎక్కువ నీటిపారుదలు చేకూర్చుచు, ప్రవహించుచున్నవి. ఐర్లండులో లెక్క లేనన్ని సరస్సులు కలవు.

ఐర్లండునందలి శీతోష్ణస్థితి, ఆర్ద్రతకు, సమభావముగల శీతోష్ణస్థితికి ప్రసిద్ధి. ఈశాన్య భాగమునందు తప్ప, తక్కిన స్థలములలో శీతకాలపు ఉష్ణోగ్రత 40° ఫా. కంటే తగ్గదు. జూలై నెలలో సరాసరి ఉష్ణోగ్రత ఎల్లప్పుడు 60° ఫా.కు తక్కువ ఉండును.

వానలు కలిగించు పడమటి గాలుల యొక్క ప్రభావమునకు ఐర్లండు, పూర్తిగ లోనగును. తుపాను గాలులు తరుచు ప్రబలముగా కలుగుచుండును. వర్షపాతము చాల హెచ్చుగా నుండును. అయినను మొత్తము దేశము నందు సమముగా కురియును. పశ్చిమమునందలి పర్వతములలో 80' పైనను, మధ్యమైదానమునందు 30" నుంచి 40" వరకు వర్షము కురియును.

ఐర్లండు యొక్క శీతోష్ణస్థితి వ్యవసాయ కార్యక్రమములపై ఎక్కువ ప్రభావమును చూపు చున్నది. ఇచ్చటి శీతకాలపు ఉష్ణోగ్రత, సంవత్సర మంతయు పచ్చగడ్డి పెరుగుటకు అనుకూలముగా నున్నది. అందుకే, పశువు లను పెంచుటకు పెక్కు ప్రదేశములలో శాశ్వతములైన పచ్చగడ్డి మైదానములు కలవు. ఇచ్చటి ముఖ్యమైన వంట ఓట్సు. పశువులను, గొట్టెలను, మాంసమునకై పెంచుదురు. ఉత్తర ఐర్లండునందు ఫ్లాక్సు (ఎల్లగినె) వ్యవసాయము భారీగా సాగుచున్నది.

పైన చెప్పబడిన వంటలే గాక, పర్వతభాగమునందలి రాళ్ళ చేలలో బార్లీ, బంగాళాదుంపలు, కోసుకూర