విజ్ఞానకోశము - ౨
ఐర్లండు (భూగోళము)
లక్ష్యమును సాధించుటకై వీరు సిన్ ఫిన్ అనునొక అతివాదపక్షమును నెలకొల్పిరి తుట్టతుదకు ఒక వంక అల్ స్టరు రాష్ట్రము వారును, వేరొక వంక ఇతర ఐరిష్ ప్రజలును యుద్ధసన్నాహములు కావించుకొని అంతర్యుద్ధమును సాగించిరి. 1920 వ సంవత్సరమున బ్రిటిషు ప్రభుత్వము వారు అల్ స్ట్రరు రాష్ట్రమున కొక శాసనసభను, ఐర్లండు నందలి ఇతర భాగమునకు వేరొక పార్లమెంటును నెలకొల్పి, ఐర్లండు సమస్యను పరిష్కరింపదలచిరి. కాని దక్షిణ ఐర్లండులోని ప్రజలీ నిర్ణయమును అంగీకరించుటకు నిరాకరించి తమకు సంపూర్ణ స్వాతంత్య్రము కావలయునని ప్రకటించి, బహిరంగముగ తిరుగుబాటు చేసిరి. ఈ సందర్భముననే వారు స్వతంత్ర ఐరిష్ రాష్ట్రమును నెలకొల్పుకొని, ఆ ప్రజాస్వామ్యమున కొక అధ్యక్షుని కూడ ఎన్నుకొనిరి. ఈ తీవ్రపరిస్థితిని గమనించి బ్రిటిషు ప్రధాని యగు లాయడ్ జార్జి ఐరిష్ జాతీయవాదులతో 1921 వ సంవత్సరమున మరల రాయబారములకు కడంగెను. తుదకు ఐరిష్ ఫ్రీ స్టేట్ (Irish Free State) రాజ్య మునకు అధినివేశ ప్రతిపత్తి (Dominion Status) ఒసగునట్లును, ఆ రాజ్యము బ్రిటీషు కానున్వెల్తులో ఒక భాగముగ నుండునట్లును నిర్ణయింపబడేను. బ్రిటిషు ప్రభుత్వము వారికి దక్షిణ ఐర్లండునందలి కొన్ని రేవుపట్టణములలో ప్రత్యేక సౌకర్యములు, హక్కులు ఉండునట్లు అంగీకరింపబడెను. అల్ స్టరు రాష్ట్రము ఐరిష్ ఫ్రీస్టేటుల సరిహద్దుల నిర్ణయము మాత్రము సంతృప్తికరముగ జరుగలేదు. సిన్ఫీన్ పఠములోని అతివాద శాఖవారు మొట్టమొదట ఈ సంధి నంగీకరించుటకు నిరాకరించిరి. కాని తుదకు వారి నాయకుడగు డీవెలరా శాంతమును వహించి బ్రిటిషువారితో సహకారము చేయ నంగీకరించెను. 1937 వ సంవత్సరమున ఐరిష్ ఫ్రీస్టేటు వారొక రాజ్యాంగవిధానము నేర్పాటు చేసికొనిరి.
మొదటి ప్రపంచ మహాసంగ్రామము నడచినకాలమున స్వతంత్ర ఐర్లాండు రాష్ట్ర మేర్పడియే యుండలేదు. రెండవ ప్రపంచ సంగ్రామమునందు ఐరిష్ ఫ్రీస్టేటువారు ఏపక్షమును కూడ వహింపక తటస్థముగ నుండిరి. కాని రహస్యముగ ఐర్లండు ప్రజలు జర్మనీ పక్షమువారికి సహాయము కావించెదరేమో యని బ్రిటిషు ప్రభుత్వము చాల భయపడెను. 'కాని అట్టి పరిస్థితులు సంభవింపలేదు. అల్ స్టరు రాష్ట్రమువారు మాత్రము రెండవ ప్రపంచ సంగ్రామ సందర్భములో బ్రిటిషువారికి చేయూత నొసగిరి.
ఇప్పుడు ఐరిష్. ప్రజలు ప్రపంచమందలి ఇతర స్వతంత్ర రాజ్యములందలి ప్రజలతో సమాన ప్రతిపత్తి గౌరవములను పొందుచు, తమదేశవు సర్వతోముఖాభివృద్ధికై శాంతి యుతముగ కృషి సల్పుచు ముందునకు సాగిపోవుచున్నారు.
వి. దే.
ఐర్లండు (భూగోళము) :
ఐర్లండు రెండు రాజకీయ భాగములుగ విభజింపబడి యున్నది. 1. ఉత్తర ఐర్లండు : ఇది వెస్టు మినిస్టరుకు శాసన సభ్యులను పంపించును.
2. తక్కిన ద్వీప భాగమంతయు కలిసి స్వతంత్ర ఐరీషు దేశముగా పరిగణింపబడుచున్నది. ఇందు ఆంగ్లేయులకు, ఐరిష్ వాసులకు మధ్యనున్న ప్రబలమైన సాంస్కృతిక, జాతీయ విభేదములు కనబడును.
జీవిత దృక్పథము, భాష, మతము, మున్నగు వాటి యందు, ఐరిషు వాసులకు, వారి పొరుగువారైన ఆం యులకు విభేదము లున్నవి.
ఐర్లండు ద్వీపము గ్రేటు బ్రిటనుకు పశ్చిమముగా నున్నది. ఇది 51°26′ –52° 21' అక్షాంశముల మధ్యను; 5° 25' – 10° 30' రేఖాంశముల మధ్యగను విస్తరించి యున్నది. అట్లాంటిక్ మహాసముద్రము దీనిని ఆవరించి యున్నది. ఈ ద్వీపమును, గ్రేటు బ్రిటనును, ఐరిష్ సముద్రము తూర్పున విడదీయుచున్నది. దీని సరాసరి వెడల్పు 110 మైళ్ళు. మొత్తము వైశాల్యము 31,800 చదరపు మైళ్లు. ఈ ద్వీపములోని సరాసరి ఎత్తు 400 ఆడుగులు. కాని ఇది సరిసమానముగా లేదు. సముద్ర తీరమునుండి పదిమైళ్ళు ద్వీపము లోపలి వరకు గుంపులుగా చిన్న పర్వత పంక్తులు ఎన్నియో విడివిడిగా వ్యాపించి మధ్య మైదానమును చుట్టియున్నవి. సముద్రతీరము క్రమముగా నిట్రముగా నున్నది. ఐర్లండులోని ప్రతి పర్వతపంక్తియును ఒక ప్రత్యేక వర్గముగా నున్నది. అన్ని దిక్కులకును విస్తరించెడి లోయల సమూహములు ఈ గుట్టలను ఒకదానినుండి వేరొక దానిని విడదీయుచున్నవి. ఈ సర్వతములు సాధారణముగ 3,000 అడు