Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఐర్లండు చరిత్ర 100 గురు సభ్యులను ఆంగ్ల ప్రజాప్రతినిధి సభకును (House of Commons), 32 మంది సభ్యులను ప్రభువుల సభకును (House of Lords) ఐర్లండు దేశీయులు పంపు నట్లు ఇంగ్లీ షువారు సమ్మతించిరి. కొంతకాలము తరువాత ఐర్లండునకు శాసన నిర్మాణాధికార మొసగబడెను. ఇంగ్లండు ప్రధానులలో కొంతమంది ఐర్లండు ప్రజల అభి ష్టములయెడ సానుభూతి కలవారయి యుండిరి. 'చిన్న పిట్టు' కేథలిక్కుల విమోచనము నెడ సౌమనస్యము కల వాడయి యుండెను. 1928 లో ఒక క్రొత్త కేథలిక్కు సంఘము ఐర్లండులో సంస్థాపితమయ్యెను. దీనిచే ఐరిషు ప్రజలకు చాల సంతుష్టి కల్గెను. కాని ఇంతలో వారిదేశ మొక ఘోరమగు ఆపదకు గురియయ్యెను. ఈ పరిస్థితికి మూలకారణము 1845 లో సంభవించిన ఉర్లగడ్డ (Potato) మమే. రెండు లక్షలమంది జనులు అప్పుడు చనిపోయి రట! ధాన్య శాసనములవలన (Corn laws) ఐరిషువారికి ఎట్టి సహాయమును ఇతరులనుండి లభింపలేదు. కొంత కాలము తరువాత, ధాన్య శాసనములు రద్దుపరచబడెను. ఇట్టి భయంకర వామదేవత దంష్ట్రలనుండి ఎట్లో బయట పడి కోలుకొన్నతరువాత, ఐరిషు ప్రజలు ఉత్తర, దక్షిణ ఐర్లండు ప్రాంతములను సమైక్యపరచుటకు ప్రయత్నించిరి. తమలో తాము మైత్రీ కలిగియుండుటకును, విదేశీయులు యాజమాన్యము నుండి విముక్తి పొందుటకును ఐరిషు Ľ ప్రజలు చేసిన ప్రయత్నములలో మహాసమర్థులగు నాయ కులు వారికి లభించుట వారి భాగ్యవిశేషము. ఎడ్మండు బర్కు మహాశయుని ముఖ్యముగా ఇచ్చట పేర్కొన వలయును. ఇతడు, ఐర్లండు, ఇంగ్లండులకు సంబంధించిన రాజకీయ జీవిత వ్యవహారమున ప్రఖ్యాత పాత్రను వహించిన మహావ క్త. హెన్రీగ్రాటన్ (Henry Grattan). అనునతడు మరి యొక నాయకమణి. ఇతడు తన దేశము పథమున పోరాడి, అపారమైన త్యాగము చేసియుండెను. అందుచే తద్దేశీయులు, 1,00,000 పౌండ్ల ధనమును అతనికి కానుకగా నొసంగ నిశ్చయించిరి. ఆదేశ భక్తాగ్రేసరుడు ఆ ధనమును తీసికొనుటకు తిరస్కరించెను. కాని చివరకు ఎంతో నిర్బంధము మీద ఆ ధనమునం దర్ధభాగమును గ్రహింపక అతనికి తప్పదయ్యెను. అతడు ఐరిషు నాయక శిరోమణి. జనసమ్మాన్యుడు, ఇప్పుడు నెలకొనియున్న 424 సంగ్రహ ఆంధ్ర ఐరిషు ఫ్రీ స్టేటు (Irish Free State) అనబడు స్వతంత్ర ఐర్లండు రాజ్యము అనేకకష్టపరంపరలు అనేడు భయంకర మగు అగ్ని గుండమునుండియే ఉద్భవించియున్నది. ఐరిషు ఫ్రీ స్టేటు ఏర్పడువరకు ఐరిషువారి రాజకీ యాందోళనము వారి ఆర్థిక విషయముల యొక్క ఒడు దొడుకులతో సన్నిహిత సంబంధము కలిగియున్నది. ఇట వారి ప్రాచీనకాలపు ఆర్థిక వ్యవస్థ ఎట్లుండెనో మనము తెలిసికొనుట అవసరమగుచున్నది. విదేశ వాణిజ్యమునకు ఐర్లండు యొక్క రాజకీయ వాతావరణము అననుకూల ముగా నుండెను. అచ్చట ఓట్లు ముఖ్యమైన ధాన్యపుపంట. కాని గోధుమలు, యవలుకూడ పండుచుండెను. తేనెటీ గల పెంపకము శ్రద్ధగా అచట జరుగుచుండెను. ఊరపందులను సాకుట వారికి ఆర్థిక ముగ లాభించువృత్తి. పూర్వము ఐర్లండునందు నాణెముల చెలామణి లేకుండెను. వర్తకమంతయు వస్తువుల మారకపు పద్ధతిపై సాగు చుండెను. ఐరిషుప్రజలకు ముఖ్యమైన తిండి పదార్థము ఉర్లగడ్డ. 1845 లో ఎనుబది లక్షల మందికి ఉర్లగడ్డయే జీవనాధారముగ నుండెనట. ఉర్లగడ్డ యొక్క గ్రామము ఐరిషుప్రజల జీవితమును పూర్తిగా తారుమారుచేసెను. ఐర్లండు ఆర్థిక నిర్మాణమంతయు స్వాతంత్ర్యసిద్ధి అనంత రమే ఒక రూపమును పొందగలిగెను. స్వాతంత్ర్య యుద్ధమున ఐరిషు ప్రజలు ఆర్థిక విమోచన మునే గాక మతవిషయక స్వేచ్ఛనుగూడ అభిలషించుచు వాదించిరి. జనులలో అధిక సంఖ్యాకులు కేథలిక్కులు. ఇంగ్లీషువారు ప్రొసెస్టెంటు మతానుయాయులు. ఇంగ్లీషు వారి అధికారమున కేథలిక్కులపై పెక్కు విధములగు నిర్బంధములు విధింపబడెను. ఐరిషు ప్రజలు ప్రాచీన రోమక కేథలికు మతసంప్రదాయములను పాటించు వారయి యుండిరి. సెయింట్ ప్యాట్రిక్ ఒక క్రొత్త సందేశము నొసంగి, వారిలో నూత్న జీవితవిశాస మును కలిగించెను. సెయింట్ ప్యాట్రిక్ యొక్క ఐర్లండు ఆగమనము పెక్కు అద్భుత సంఘటనలతో కూడినదని కొన్ని పురాణకథలు వివరించుచున్నవి. ఐరిషు మతసంస్థ సెయింట్ ప్యాట్రిక్, పల్లాడిన్ వంటి ధర్మాచార్యుల వలననే గాక, అచ్చటికి కాందిశీకులయి ఏతెంచిన బ్రిటిషు మతగురువులవలనను ఎంతో ప్రాబల్యమును