Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐరోపాఖండ కళ

సంగ్రహ ఆంధ్ర


గ్రంథస్థచిత్ర ఉదాహరణములు: ప్రాచీన కాలమందలి గ్రంథములలో దారు చ్ఛేద చిత్రములు, శిల్పపు చెక్కడ ములు, ఉత్తమముగా ప్రకటింపబడెడివి. ఇట్టి చిత్రకారులలో, డామియర్, క్రూక్ షాంక్, టెన్ని యెల్, డుమారియర్, లీచ్ ! సభృతులు ప్రముఖులు. కాలక్రమమున, ఇట్టి చిత్రముల స్థానములలో వర్ణ చిత్రొదాహరణములు, రేఖా చిత్రములు ప్రవేశించెను. ఇందులకు నూతన పద్ధతులలో ఛాయా చిత్రముల ప్రత్యుత్పత్తులే (Reproductions) కారణము. ఈ ప్రత్యుత్పత్తి (Reproduction) విధానమందలి పరిధులను కళాకారులు పరిశీలించి అవగాహన చేసికొన నారంభించిరి. దీని ననుసరించి వారు చిత్రములను ఉత్పత్తి చేసిరి. వారు అనుసరింపదలచిన విధానమునకు ఈ చిత్రముల గుణవిశేషములు అనుసంధింపబడెను. బాలుర వినోదము కొరకై ఏర్పడిన వర్ణచిత్ర లిఖిత గ్రంథములు గమనింపదగినవి. ఇట్టి గ్రంథములు రచించిన వారిలో ముఖ్యులు వాల్టర్ క్రేన్, కేట్ గ్రన్ ఎవే అనువారు. ఆబ్రేబియర్డ్ స్లే అనునతడు పూర్తిగా నవీనమయిన అలంకారిక వర్ణ చిత్రములను ఉత్పత్తిచేసెను. కొంతకాలము వరకు ఐరోపా కళ కామోన్మాదమును, విశృంఖల వృత్తిని ప్రతిబింబించెడిసంక్షోభస్థితి యందు కొట్టుమిట్టాడెను. ఆబ్రేబియర్డ్ ఇట్టి చిత్రములను రచించెను. ఒక్కమాటలో చెప్పవలెనన్నచో, ఈ శతాబ్దిలో విస్తృతముగా అభివృద్ధి చెందిన గ్రంథ ఉదాహరణ చిత్రరచన అన్ని రూపములకు చెందిన రేఖాచిత్రములను, వర్ణచిత్రములను ప్రోత్సహించెను. సుద్ధరంగు (pasties) తోను, తైలము (oil) తోను, నీటిరంగు (water colour) తోమ, ఏక వర్ణము (monochrome) తోను తయారుచేయబడిన చిత్రములను పునరుత్పత్తి (reproduce) చేయుటలో వాటి నాణ్యము, శ్రేష్ఠత చెడిపోయెడివి గావు. ఇట్టి చిత్రములకు విపణివీథి యందు. ఆ దినములలో గిరాకి ఉండెడిది.

పారిశ్రామిక కళ: 20 వ శతాబ్ది ప్రారంభదశయందు పారిశ్రామిక రంగములో కళ ఒక రూపరహితమయిన అవస్థను అనుభవింపవలసివచ్చెను. వస్త్రములయందు, గోడ ప్రకటన కాగితములందు, తివాచీలయందు, గాజు సామగ్రులయందు, మృణ్మయపాత్రలందు, కొయ్యసామానుల యందు రూప విహీనమయిన పెక్కు నూతన చిత్రములు ప్రవేశ పెట్టబడెను. కారణమేమన, యంత్ర సహాయముచే తయారయ్యేడి వస్తువులమీద అలంకరణములను చిత్రించుటకు అట్టివాటిని తయారు చేయుటకు కళాకారులను నియోగింపవలెనను ఆలోచనకు ఆరోజులలో అంతగా బలము చేకూరలేదు. ప్రారంభములో పారిశ్రామిక రంగమందు ప్రవేశింప నిచ్చగించని కళాకారుడు క్రమముగా అందుల కొడంబడెను. ఈ కారణముచేత పారిశ్రామికులు పెక్కు ముంది ప్రఖ్యాత కళాకారులకు ఉద్యోగము లిచ్చి తమయొద్ద నుంచుకొని వారివలన ప్రయోజనముపొందిరి.ఈ ఉద్యమమును ప్రతిపాదించుట సరి అయినదే అని రాయల్ అకాడమీవారు సహితము అభిప్రాయపడి పారిశ్రామిక కళాప్రదర్శనము (Industrial Art Exhibition) ను 1914 లో ఏర్పాటు గావించిది. పరిశ్రమలకు అనుబంధింపబడిన వివిధ లఘు కళారూపములు.. నాజూకయిన చేతిపనులు ఈ ప్రదర్శనమందుంచబడెను. ఈ విధముగ ఆధునిక కళాకారునకు క్రమముగా దైనందిన జీవితముతో సన్నిహిత సంబంధము ఏర్పడెను. . నాటక రంగాలంకరణము:ఆధునిక కాలమున కణారంగము అభివృద్ధి నొందుటలో నాటక రంగాలంకరణము ముఖ్యమయిన పాత్ర వహించినది. కన్నులు మిరుమిట్లు గొలిపెడు వర్ణముల సమ్మేళనము, ఉల్లాసకరమును, చమత్కారము నయిన చిత్రరచన, నాటక రంగమందు అభివృద్ధి నొందుటచే వేలాది దర్శకులకు మితిలేని ఆనందము కలుగుచున్నది. ఈ రంగమందు కళాకారుడు అయబద్ధముగా వర్ణమును ప్రయోగించుటయందు వ్యక్తిగత ప్రతిభావ్యుత్పత్తులను, అభిరుచులను ప్రకటించుటకు అవకాశ మేర్పడెను. రంగస్థలమును అలంకరించుట యందును, ముఖ్యముగా విభిన్నములయిన నాట్య భంగిమములను చిత్రించుటయందును, బాక్స్, బెవాయిస్, ఆలివర్ మెస్సెల్, రెక్స్ విజ్లర్ అను కళావేత్తలు తమ ప్రతిభను ప్రకటించిరి. బ్యాలెట్ అను నాట్యభంగిమ రూపమునకు రష్యన్ చిత్రకారులు కన్నులు మిరుమిట్లు గొలిపెడి సౌందర్య ప్రకాశములను చేకూర్చిరి.

ఆధునిక కళాకారులు : 20 వ శతాబ్ది కళయందు పలు రకములయిన భావములు, శైలులు, యుద్ధమువలని ఘోరనష్టములు, ప్రజల మానసిక ఆందోళనలు, వారిని