Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - సంబంధ విషయమునను, తత్ఫల విషయమునను పరిశీలనా విధానమార్గ మేర్పడెను. ఈ వాదమువలన ప్రభావితు లయిన వాన్ గోమ్, గాగ్విన్, అను కళాకారులు అత్యా శ్చర్యకరములయిన వర్ణచిత్రములను ధీరప్రజ్ఞాస్ఫూర్తితో తయారు చేసిరి. మానెట్ అను చిత్రకారుడు రూపొం దించిన చిత్రములకంటే వీరిద్దరి యొక్క చిత్రములు ఎక్కుడు వాదోపవాదములను రేకెత్తించెను. స్యూరట్ అను నతడు వా స్తవికతా వాతావరణ మేర్పరచుటకై చిత్రమును స్వచ్ఛమైన రంగులో చుక్కలవరుసలతో రచించెను. ఈ నవ్య కళాకారులు ఒక నూతన వర్గముగ ఏర్పడి త్వరితగతిలో "పోస్ట్ ఇంప్రెషనిస్టులు" (post Impressionists) పేర్వడసిరి. ఇంగ్లండునందు జేమ్స్ మాక్నల్ విజ్లర్ అను నతడు సమకాలికమయిన ఫ్రెంచికళను విశేషముగ శ్లాఘించి అభిమానించెను. తత్ఫలితముగా అతడొక ప్రత్యేక కళా శైలిని రూపొందించేను. అతడు జపానుదేళ మందలి వర్ణ చిత్రములను పరిశీలించి, అవగాహన చేసికొని, తత్ఫలితముగ పాశ్చాత్య కళావస్తువులందు కొన్ని నియమములను, నమూనాలను జాగరూకతతో ఆలోచించి ప్రవేశ పెట్టెను. తన తల్లి యొక్కయు, కాక్టైల్ యొక్కయు వర్ణచిత్ర ములు విజ్లర్ కళాసూత్రములకు ఉత్తమ ఉదాహరణ ములు. కాని 'నాక్టర్నెస్' అని ఆతడు నామకరణ మొనర్చిన 'థేమ్స్' నదీ దృశ్యచిత్రము, పై రెండు చిత్ర ములకంటె ఎక్కువ ప్రఖ్యాతిని గడించినది. 20 వ శతాబ్దము: 20 వ శతాబ్దారంభమున కొలది సంవత్సరముల వరకు ఐరోపా ఖండములో ఎన్నడు ఎరుగ నట్టి అపూర్వమయిన శాంతి, సమృద్ధులు వరలెను. ఈ కాలములో ప్రతిభాన్వితులయిన పెక్కుమందిక ళావేత్తలు ప్రాముఖ్యమును గడించిరి. ఇట్టి వారిలో సర్వజనులకు ప్రీతి పాత్రుడయిన కళాకారుని పేరు సార్జంటు. ఇతడు ఎడ్వర్డు కాలమునాటి భాగ్యసంపన్న లగు సుందరీరత్నముల యొక్కయు, అమెరికాలోని ధనికజాతి సంబంధుల యొక్కయు రూపములను చిత్రించెను. ఈ చిత్రములు సాహసాత్మకములయినను, ఎంతో మనోజ్ఞములై తమ చిత్రములను వ్రా వాయించుకొనిన ఆ పనితలనే ముగ్ధలను గావించెను. కాని ఇంగ్లండులో పెక్కురు సర్వసమభావు 419. ఐరోపాఖండ కళ లగు (Cosmopolitan) కళాకారు లుండెడివారు. వీరు ఫ్రెంచి కళాజీవితమునుండి ఉత్తేజమును, ఉత్సాహమును పొందినవారేగాని పూర్తిగా ఇంగ్లీషు కళావి ధానమునకు చెందిన వారుకారు. 'సికెర్ట్' అను కళాకారుడు బ్రిటిష్ ప్రజాజీవితములోని హైన్యమును చాటుట కై విషయములను గ్రహించెను. లండన్ నగరములోని మురికి కూపములను, సంగీతసభామందిర వినోదములను కన్నులకు కట్టెడి విధ ముగ చిత్రించెను. ప్రముఖులయిన కళావేత్తలందరు ఆంగ్లేయ కళాగోష్ఠి గృహములలో (Clubs) సభ్యులుగా చేరెడివారు. ఫ్రెంచి వాస్తవికతావాదము యొక్క ఆశయములను అభివృద్ధిచేయుటకును, 19 వ శతాబ్దిలో ముఖ్యముగా ఇంగ్లండులో నూనవుని వాస్తవ దృష్టికి మాంద్యముకలిగించి, స్వాప్నిక భావములచే ఆవరింపబడిన వాతావరణమును శుభ్రపరచుటకును, ఈ గోష్ఠీగృహములు స్థాపింపబడినవి. వ్యాపారకళ వర్తక వ్యాపారముల యొక్కయు, పరిశ్రమల యొక్కయు అభివృద్ధికై పత్రికలలో అలంకరణ సహితమయిన ప్రకటనలు పుష్కలముగ ప్రచురించేడి రోజులవి. వ్యాపారస్థులు తమప్రయోజనములను సాధించు కొనుటకై కళాశ క్తిని సాధనముగా ఉపయోగించుకోస ప్రారంభించిరి. పియరు సబ్బును విరివిగా అమ్మకము చేయుటకై బ్రహ్మాండమయిన వర్ణ చిత్రములను ప్రకటనలో నెక్కించు నుద్దేశములతో 'విలియమ్స్' చే రచింపబడిన 'బబ్బుల్సు' (బుడగలు) అను చిత్రములను వ్యాపారస్థులు ఖరీదుచేయ దలంచిరి. ఈ చిత్రములన్నియు అకాడమీలో అలంకరింపబడియుండెను. కాని లబ్ధప్రతిష్ఠుడయిన విలి యమ్స్ తన కళాప్రతిభన వ్యాపారాభివృద్ధికై అమ్ము కొనుటకు ఒడంబడలేదు. ప్రారంభములో వ్యాపారస్థులు ఉపయోగించిన వర్ణచిత్రములు, అతిస్వల్పములయిన వివ రములు, మొరటుగా రంగులకలాపము కలిగియుండెను. కళారహితములయిన ఇట్టి చిత్రములు ప్రజలను మభ్య పెట్టి వారి దృష్టిని ఆకస్మికముగా ఆకర్షించు ఉద్దేశముతో ఉపయోగింపబడినవి. సున్నితములయిన జ్ఞానేంద్రియము లను ఆకర్షించుటేగాక, వారిదృష్టిని దబాటుగా ఈ వ్యాపార చిత్రములవైపు మరల్చుటయే వర్తకుల ప్రధా నోద్దేశము.