Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఐరోపా ఖండ కళ వచ్చిరి. నీరు జై ల, జలవర్ణ చిత్రములందలి తమ సాం కేతిక నైపుణ్యముచే ఒక్క ఇంగ్లీషు కళాభివృద్ధికి మాత్రమే -కాక, విశ్వవ్యాప్తమయిన వర్ణచిత్ర కళాన్నత్యమునకు గూడ అధికముగ సేవచేసిరి. ఆధునిక కళావతరణము : పారిశ్రామిక యుగము ప్రారంభనుగుటయు, ఛాయాపటగ్రహణకళ (Photo- graphy) అవతరించుటయు సంభవించుటచే, పెక్కు కళా రూపములకు తీవ్రమయిన విఘాతము కలిగెను. తమ పరిసరములలో గల సందడి, గడబిడలు, తమ మనస్తత్వ మునకు అననుకూలముగ పరిణమించె నని వారు ఆందోళ నము పొంద నారంభించిరి. అప్పటివరకు కళయందు అభి మానము చూపిన కళాప్రియులు తెరమరుగునకు పోయి, వారి స్థానములలో పారిశ్రామిక విప్లవ ఫలితముగా ధన మును ఆర్జించు మిల్లుయజమానులు, ఫ్యాక్టరీ ఖామందులు ప్రవేశించిరి. ఈ ధనవంతులు విజ్ఞానులు కారు ; కళ యందును, సంగీతమందును అనుభవముగానీ, ఆదరణము గాని లేనివారు. కథలను అభిమానించి పోషించు లక్షణ ములు వీరిలో పూర్తిగా లోపించెను. అత్యద్భుతకల్పనాయుగము (Romanticism) : యాం త్రిక యుగమున వృద్ధియగుచున్న అనర్థములకు వీరు గుడుగా, అత్యద్భుతకల్పనాయుగపు విలుణోద్యమము మొదట మొదట కొంతవరకు కళాకారులకు ఊరటను కలిగించెను. చిత్రవిచిత్రములయిన దృగ్గో చరదృశ్యములు, పిమ్మట ప్రాచ్యదేశీయ సాహసకృత్యములు, కాల్పనిక గాథలు, చారిత్రక అఖ్యానములు క్రమముగ సర్వజన ప్రీతి పాత్రములయ్యెను. కాని త్వరలోనే చారిత్రకముగా సరికాని యంశములతో ఒక సంకర విధానము ప్రవృద్ధి కాసాగెను. మధ్యయుగమునాటి కళాపై ఖరుల “కాల్ప నిక వాదము" ననుసరించి మార్పు చెంది ప్రతులు సిద్ధమగు చుండెను. ఏతత్కారణమున నూతనయుగమునందు కళా వాస్తు శిల్పముల అభివృద్ధి కుంటుపడెను. వాస్తవికవాదులు (Impressionists); ఫ్రెంచి కళా రంగమందు అత్యాశ్చర్యకరమయిన పరిణామము సంభ వించెను. ఈ పరిణామము కాల్పనికవాదాభిమానులకును, వారి భావవైఖరులకును విరుద్ధమయినదిగా నుండెను. ఈ నూతన పరిణామము 'కోర్ బెట్' అను నతని నాయ సంగ్రహ ఆంధ్ర కత్వము క్రింద 'వాస్తవికత' అను కళాసంప్రదాయము పేరుతో అధిక ప్రాధాన్యము నందెను. సమకాలిక జీవితము నందలి సర్వసామాన్యవిషయములను, కుద్రలక్షణములను కూడ ఉన్న వున్నట్లుగా చిత్రించుటకు ఈ వాస్తవికతా'కళా సంప్రదాయము అంగీకరించెను. రాఫెలిటస్ అను నాతనికి పూర్వులు ప్రకృతి యొక్క సత్యస్వరూపమునే చిత్రించ వలయు నను సిద్ధాంతము గలవారు. ఈ సిద్ధాంతము భావ మందు ఫ్రెంచి వా స్తవిక వాదులు ప్రతిపాదించిన సిద్ధాంత మును పోలియున్నది. ఫ్రెంచివా స్తవిక తా వాదులు కళను సున్నితమయిన ఉన్ని వస్త్రములో దాచి దానికెట్టి అంటు సొంటులు సోకకుండ భధ్రము చేయవలె ననెడి ప్రాచీన భావమును గర్హించిరి. కళాకారుడైన వాస్తవికతా వాది నిర్భయమైనట్టి, నిర్మొగమాటమైనట్టి దృక్పథమును అల పరచుకొనవలెనని ఉద్ఘాటించిరి. కళాకారుడు కళావస్తువు నకు ప్రథమస్థాన మొనగగూడదనియు, అతడు దర్శించిన విషయములను ఆదర్శరూపముతో, యథార్థదృష్టితో వ్యక్తీకరింవవ లెననియు వీరి అభిప్రాయము. ఈ ఉపదేశముల లోని భావములను ఆకళింపుచేసికొనుటలో ప్రజలు చాలా జాగుచేసిరి. చాలకాలము వరకు బ్రిటిష్ ప్రజలు ఈ నూతన సిద్ధాంతమును వ్యతి రేకించుటయు, ఫ్రెంచి ప్రజలుగూడ వాటిని ద్వేషించుటయు సంభవించెను. కోర్బేట్ అసంత రము ఈ నూతన 'వాస్తవికతా' సిద్ధాంతమును కళా 418. కారులు ఒక తరము వరకు అనుసరించుచునే యుండిరి. మానెట్, రెనాయిర్, డెగాస్ మొదలయినవారు సమ కాలిక జీవితమును ప్రతిబింబించు చిత్రములను నేర్పు తోను, నిశితమయిన ఆలోకవ్యక్తిత్వముతోను రచించిరి. ఆనాటి ప్రజలు ఇట్టి చిత్రములను నిరాదరణముతో చూచి, ఈ వర్గపు కళాకారులను 'ఇంప్రెషనిష్టులు' అని పిలిచినను ఈ వర్ణచిత్రములలో నూతనత్వము, పటుత్వము, కండ పుష్టి లేదని చెప్పుట కెంతమాత్రము వీలులేదు. ఈ వర్ణ చిత్రములు ప్రపంచకళా చరిత్రయందు నేడు ఉన్నత స్థానము సంపాదించుకొన్నవి. ఈ చిత్రకళా సరళి 19 వ శతాబ్దము యొక్క భావదాస్య శృంఖలములను త్రెంచు కొని స్వాతంత్ర్య మొందినది. ఇంప్రెషనిస్టు అనంతర యుగము: నా స్తవిక తా వాదప్రభావమువలన, కళారంగమున వర్ణముల పరస్పర