Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 'సెయింట్ పీటర్స్' అను మహాసౌధమునకు వాస్తుశిల్పి అయ్యెను. విచిత్రకళ (Baroquc Art): 17 వ శతాబ్దిలో ఇటలీ యందు పునరుజ్జీవన ఉద్యమము పతనమొందుటతో బరోక్ అను (విచిత్రమైన) నూతన శిల్పశైలి అవతరించెను. అందచందములు గూర్చుటయందును, రూపరచనావికాస కరణమునందును, అద్భుతావహమగు ప్రతిభాసంపత్తి ప్రదర్శించుటకు కారణభూతమైన ప్రాచీనక శాసంప్రదా యపు పునాదు అనే ఈ నూతన శైలివిధానము వ్యత్య స్తము చేయసాగెను. మదించిన మన్మథులు, వన్నెచిన్నెల వగలాడులు, కాండా ప్రదాయినులు (Cornucopias) పుష్కలవస్త్రధారణము, వైదేశిక పుష్పములు, కృత్రిమ భంగిమములు-ఇట్టి ఆడంబరములతో మన కిప్పుడు మనస్సుల యందు నాటుకొనిన నాటకీయ రంగ ప్రదర్శనా పద్ధతి అపరి మితముగా కనబడునట్లు ప్రకాశనూనవర్ణబద్ధము, చాపల్య భావ సంపన్నము, శృంగార భూయిష్ఠము అయిన పనితన మునకు ఎక్కువగా ప్రోత్సాహ మియ్యబడెను. ఉచ్ఛం బలమయిన అద్భుత రసప్రచుర ప్రదర్శనము యొక్క అమి తానువ ర్తనము కారణముగా గ్రీకుల శిల్పనియమాదర్శ ములు విస్తృతము లగుటయో, లేక పరిత్యక్త ములగు ట సంభవించెను. ఇటలీకంటె భిన్నములయిన దేశములలో ఇటాలియను కళాప్రభావము అత్యంతముగా ప్రసరించుటకు పునరుజ్జీవ నోద్యమము కారణమయ్యెను. అయినను ఆకాలమున శీఘ్రప్రయాణసౌకర్యములు లేకపోవుటయు, విద్యా విషయక, సాంఘిక, సాంస్కృతిక దృక్పథముల పై క్రైస్తవమతాధికారులకు గొప్ప ప్రాబల్యము ఉండుటయు కారణములుగా ఇటలీ యొక్క సాంస్కృతిక ప్రభావము మందముగా వ్యాప్తిచెందెను. దాదాపు 14 వ శతాబ్ది బాగుగా పురోగమించిన పిదపగాని కళారంగమున ఇటలీ సాధించిన ఘనకార్యముల చాయలు ఇతర దేశములమీద ప్రతిఫలింపలేదు. అప్పటివరకునున్న ఉజ్జ్వల వర్ణరంజితమై పతనావస్థలోనున్న గోథిక్ కళాశైలిప్రభావమునుండి విముక్తినొందుటకు క్రమముగా ఐరోపాయందలి ప్రతి దేశము ప్రయత్నించెను. 15 వ శతాబ్దిలో క్రమముగా వ విభిన్నమయిన జాతీయ క శాసంప్రదాయములు అవతరించి 413 ఐరోపా ఖండ కళ నవి. స్వతంత్రమైన ఈ నూతన కళావిధానము అనుసరించి బడుటతో, కళారంగమందు విగ్రహనిర్మాణమునందు సహజత్వము పునః ప్రతిష్ఠిత మయ్యెను. కాని ప్రతిదేశము స్వీయ వ్యక్తి త్వానుసారముగ నే కళను పోషించుకొన సాగేను. హాలేండు కళ : 15వ శతాబ్ది ప్రారంభమున జాన్ వాన్ అయెక్ అను హాలెండు వర్ణచిత్రకారుడు కావించిన వర్ణ చిత్రములతో హాలెండునందు కళాపోషణము ఆరంధ మాయెను. ఈ చిత్రములందు గాఢ వర్ణ సంపత్తిని చేకూర్చుటయందును, ఇతర కళావివరములను ప్రదర్శిం చుట యందును ఇతడు అధికమయిన శ్రద్ధాసక్తులు ఐరోపా పునరుజ్జీవన ప్రారంభ దశయందు నిగనిగలాడెడి సాంద్ర వర్ణచిత్రములకు తోడుగా నఖచిత్ర ములు గీయుటయందును, జలబిందు ప్రతిబింబ లేఖనము నందును, కనురెప్పపై ఆశ్రుకణము నిలుచునట్లు చిత్ర రచన చేయుటయందును, జాన్ వాన్ అయెక్ సూక్ష్మమైన సావధానత చూపెను. ఉదాహరణముగా ఇతడు రచిం చిన అర్నోల్ ఫిని (Arnol fini) యొక్కయు, అతని భార్య యొక్కయు చిత్రములో వీరి విగ్రహములకు వెనుకగానున్న వక్రపుటద్దములో ప్రతిబింబ సంబంధ సూక్ష్మాంశము మనోహరమును, అనంతముగా ఆనంద దాయకమునై యున్నది. రత్నములయందును, లేక మనసుగొలుపు కాంతివి శేషములందును, వాటియందుగల పెక్కు వివరములను చిత్రించుట యందును, కళాకారులు చూపిన అట్టి అభిరుచియే డచ్చి కళాసంప్రదాయమునం దొక విశిష్ట లక్షణముగా పరిణమించినది. శ తాబ్దిలో ఉన్నతస్థాయి నందుకొనెను. గృహచిత్రములను రూపొందించుటలో హాలెండు కళాకారులు సాధించిన అది 17 వ పరిపూర్ణతా విషయమున మరి ఏ ఇతర జాతీయ కళా కారుడును అట్టి పరిపూర్ణత్వమును పొందజాలడయ్యేను. హాలెండు చిత్రకారులు గ్రహించెడి వస్తువులలోను, చిత్రిం చెడి చిత్రములలోను సరళశాంతమయిన గృహజీవిత వాతావరణము కనిపించెడిది. వీరును, వీరిపొరుగువారైన ఫ్లెమ్మిష్ జాతీయులును పుష్పాలంకారములను, వర్గ జీవి తమునందలి ప్రశాంతతను చిత్రించు నాచారమును ప్రారంభించిరి. చిత్రములందలి వివరములకు నూతన