Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - - భాగము శోభాయమానమగునట్లు కళావిషయకముగను, శిల్పవిషయకముగను దర్శనీయమగు మనోహర కళాఖండ మొకటియు సృష్టింపబడ లేదు. సుమారు క్రీ. శ. 10 శతాబ్దినాటికి క్రైస్తవమతము నాకు నూతన ప్రాబల్యము చేకూరెను. శిల్పమునకును ప్రోత్సాహము లభించెను. క్రీ. శ. 13 వ శతాబ్దిలో ఇటలీలో పునరుజ్జీవనము (Renaissance) ఆరంభమగు వరకు శిల్పాభివృద్ధి మందీకృత మైనసు, స్థిరముగా వర్థిల్లెను. బ్రిటను దేశమునందును, ఫ్రాన్సు దేశమునందును, పశ్చిమ ఐరోపాఖండమందలి భిన్న భాగములందును రోమానెస్క్, గోధికుళ్లు. కోవెలలు నిర్మింపబడెను. కాని వాటి అలం కారములో నొక భాగమయిన శిల్పమునందు సంప్రదాయ బద్ధమును, వా స్తవికమునగు నొక విచిత్ర కళాస మ్మేళనము గోచరించెను. విగ్రహ శిల్పమునందు క్రీస్తుయొక్కయు, కై 9 స్తవయోగుల యొక్కయు జీవితములనుండి గ్రహింప బడిన దృశ్యములను చిత్రించుట పరిపాటి అయ్యెను. కాబట్టి పరమపావన మూర్తులను గ్రహించినట్టులుగా. సర్వ ఐహిక పాపముల మూలమున బాధనొందుచు జీవించి యున్న వారి జీవితగాథలను పరమలక్ష్యములుగా గ్రహిం చుట అసంగతముగా తలపబడేను. కావుననే తరచుగా సహజమనుష్యాకృతిని మోటుగా మాత్రమే ప్రదర్శించు శరీరము పై విషాదాత్మకమైన లేక అనుకంపాత్మక మైన ముఖలక్షణములు కల రమ్యమైన శిరము కనిపించు చుండును. అననురూపముగా దేహమును పొడుగుగా నొనర్చుట అపుడు సాధారణమైన వాడుకగా నుండెను. చిత్రింపబడిన పవిత్ర విగ్రహములకు ఘనతను చేకూర్చుటకై ఈ విధముగా పొడవును పెంచుట జరుగుచుండెను. ఇది ముఖ్యముగా క్రీ. శ. 18వ శతాబ్దిలో నిర్మింపబడిన చార్టరు దేవాలయముల ద్వారమార్గములలో గల యోగుల విగ్రహములలో “కాననగును. క్రీ. శ. 9వ శతాబ్ది మొదలు 14 వ శతాబ్ది వరకు మధ్యయుగము లనబడు కాలమునందు చిత్రింపబడిన పెక్కు విగ్రహ రూపములలో అట్టి అలంకరణ పద్ధతులే బలీయముగా కుదురుకొనెను. పరచాల ముడుతలను దిద్దుటయందును, వస్త్రాలంకారములను గూర్చుటయం దును చిత్రితమైన రూపవిధానములు అత్యంత ప్రముఖ 411 ఐరోపాఖండ కళ పాత్రను వహించెను. ఒక విచిత్రమైన నూతన కళా విధా నము విడువకుండ కొనసాగెను. ఈ విధానము ననుసరించి విగ్రహము యొక్క చేతుల వ్రేళ్ళన్నియు విప్పారి యున్నట్లుగాని, వీటిలో ఒకటి రెండు వ్రేళ్ళు దేనినో చూపుచున్నట్లుగాని చిత్రింపబడుచుండెను. గోధుల కాలము : రోమనెస్క్ (Romanesque) శిల్పశైలినే ఒకప్పుడు ఇంగ్లండులో "నార్మన్" శిల్ప శైలి యనుచుండిరి. ఈ రోమ నెస్క్ శిల్పశైలి యందలి సరళ శోభయొక్క స్థానమును 18 వ శతాబ్ది యందు అత్యంత సాలంకృతములైన గోధికుశైలులు ఆక్రమించెను. పశ్చిమ ఐరోపా ఖండమునందంతటను శిల్ప కళ శీఘ్రవ్యా ప్తి గాంచుచుండగా ఇటలీ దేశము మరి యొక సారి నూతనమయిన సాంస్కృతిక జీవిత చైతన్యమునకు గురియయ్యెను. కొంత కాలమువరకు కళలు మతాభిమాన ముతో అభివృద్ధిపరచబడెను. ఇపుడు కళాపోషకులగు సామాన్య జనులు మరల శిల్పులను అన్వేషించి వారినీ తమరిని గూర్చియో, ఏదేని మతగాథను గూర్చియో, ఏదేని జాతీయ ప్రాముఖ్యముగల గొప్ప విషయమును గూర్చియో జ్ఞాపక చిహ్నములుగ మనప్రమాణములలో చిత్రలేఖనము గావించుటకు నియోగించిరి. 18 వ శతాబ్ది మధ్య భాగమునుండి 17 వ శతాబ్ది మధ్య భాగమువరకునుగల కాలము పునరుజ్జీవన (Renaissance) కాలము. ఇందు ప్రాచీన విద్య యొక్కయు, ప్రాచీన కళాచై తన్యము యొక్క యు పునర్జన్మము దృష్టమయ్యెను 18వ శతాబ్ది ప్రారంభము నందలి శిల్పుల శిల్పము. గోధికుయుగమునందు ఆరంభమయిన మత ప్రేరణచే ఇంకను ఉత్తేజితమై యుండెను. ఈ కాలమునందు విశిష్టు అయిన శిల్పులు ఇంకను కొంతవరకు అంగీకృతమైయున్న కళా సంప్రదాయముల ప్రభావమునకు లోనై యుండిరి. అయినను ప్రాచీన గ్రీకు, రోము దేశములందలి కళా, సారస్వతాభిరుచి విషయకమయిన ఉజ్జీవనము, స్వాభా వికతయందును, ప్రాచీన దృక్పథమునందును, అభిలాషను ఉద్దీపింపజేసెను. 18వ 14 వ శతాబ్దులందలి ఇటాలియన్ శిల్పములందు సత్యబద్ధమైన నూత్నానుభూతి సహితమగు ముగ్ధమోహన సౌందర్యము గోచరించును. ఇవి నిస్సందే హముగ ప్రత్యేక ప్రశంసకు అర్హత నొందినవి.