విజ్ఞానకోశము ౨ మున క్రీ. పూ. 4 వ శతాబ్దమునాటికి ఈ ఉత్తమరకపు మృణ్మయ శిల్పము (Ceramic art) అదృశ్యమై పోయినది. రోమనుకళ : రోముయొక్క ప్రతిభయంతయు ఎక్కు వగా యుద్ధవిజయపరంపరలందు తీరని దాహము కలదిగా నుండెను. అయితే గ్రీసును జయించిన పిదప కళాత్మక విష యములలో గ్రీకుల సంస్కృతియం దంతర్గర్భితముగానున్న ప్రతిభను ఉపయోగించుకొనుటకును, జీర్ణము చేసికొనుట కుకు రోమనులు అభిలషించిరి. కళకు సంబంధించిన ప్రతి విషయమును పృథక్కరించి విచారించుటయందును, అత్యుత్తమ విధానముతో తీర్చుటయందును గ్రీకులకుగల అసాధారణమైన ప్రజ్ఞ నుబట్టి రోమను విజేతలు గ్రీకుల యందు గౌరవభావము కలవారయిరి. విస్తారముగ ధన మును కూడ బెట్టిన ప్రతిరోమను ఉద్యోగియు, అధికారియు, తన ప్రాసాదమును తాను జయించిన దేశమునుండి కొల్ల గొట్టుకొనివచ్చిన అమూల్య వస్తుజాతముతో అలంక రించుట నాగరికతా విశేషముగా, సామాజిక కర్తవ్యలక్షణముగా గ్రహించెను. గ్రీకుల దేవాలయములను, గృహములను కొల్లగొట్టుట ఆగిపోయెను. అందమైన శిల్ప విగ్రహములు మిక్కిలి అరుదయ్యెను. రోమనులు గ్రీకు శిల్పులను ఇట లీలో పనిచేయుటకై పిలిపించి, వారిచే రోము వాస్తవ్యు లకు కళ నేర్పించుటకు ఆరంభించిరి. కాలక్రమమున రోమను విద్యార్థులు గ్రీకుల సహజక ళావేశమును జీర్ణించు కొనిరి. తత్ఫలితముగా అలేఖ్య శిల్పోదాహరణములు పెక్కులు ఉపలభ్యము లగుచున్నవి. వాటియందు రోమ నుల సాంగ్రామిక (warlike) ఉద్దండపౌరుష లక్షణములు (aggressive vitality) గ్రీకు శిల్పుల సాంకేతిక విద్యా కౌశల్యముతో సమ్మిళిత మైనవి. అయితే రోమను కళా ధర్మములు యధార్థమయిన మతోత్సాహముపై నాధారపడినవి కావు. రోమ ను సామ్రాజ్యము వి స్తరించి ప్రజలలో మెల్లగా భోగాభిలాష, విలాసప్రవృత్తి ప్రాధాన్యము వహించెను. కళాసంస్కృతి వ్యాసంగములయందు క్రమక్రమముగా శ్రీణదశ వాటిల్లెను. ఆరంభదశయందు వాస్తు, శిల్ప, కళారంగములలో బాని సలవలన సేవగొనుట పూర్తిగా లాభదాయకమును, ఫల ప్రదమును నైవరలెను. కాని వారి సంగ్రామిక పటిష్ఠత 52 409 ఐరోపాఖండ కళ నశించినప్పుడు, వారి సై నిక రాజకీయశక్తి కించినప్పుడు, బానిసలనుండి చపుకగా సేవనుగొను ఈసులభమార్గము అసాధ్యమయ్యెను. కళాప్రపంచమున రోమనులు సాధిం చిన కార్యములు చాలా తక్కువయ్యేను. సామ్రాజ్యము సంస్కృతీ చిహ్నా లంకృతమయిన మొః గుల్లగా మాత్రమే పరిణమించెను. అయినను కె యాత్రాశీలురగు గోథుల (Gothes), హూణుల ( Huns మూకలు రోమనుల కళాపారీణనను కొండకొంత గ్రహీం చుటయేగాక, తాము మోటుకనున్నను పౌరుషవంచ మగు తమ దృక్పథమును, పెడసరమైనదైనను పట్టుదల తో గూడిన తమ పటుక్వమును కొంతవరకు ఇటలీలోని సంస్కృతీ సంస్కృతీ సంప్రదాయ విశేషములకు సంక్రమిం": జేసిరి. బైజాంటైనుకళ: రోముపట్టణము పతనోన్ముఖ మగు చుండగా ప్రఖ్యాతి చెందిన రోమను చక్రవర్తి యొకడు దానిని వినాశమునుండి తప్పించుటకై బ్రహ్మాండమయిన యత్న మొనర్చెను. అతని ఆశయములు ఉత్తమమైనవి. అతడు క్రైస్తవమతమును స్వీకరించెను. అతడు రోనును సామ్రాజ్యము యొక్క ముఖ్య పట్టణమును 'బైజాం టియమ్' అను పట్టణమునకు మార్చెను. అది పిదప కాన్ స్టాంటినోపిల్ (Constantinople) గా ప్రసిద్ధమయ్యెను. అది నేడు ఇస్తాంబుల్ (Istamble)గా నిలిచియున్నది. దాని మొదటిముఖ్యపట్టణము యొక్క ప్రౌణ్యముతో నెట్టి సంబం ధములేకుండగనే శృంగారాత్మక కళారూప మొకటి నూతనముగా ఆవిర్భవించెను. ఈ కళారూపమందు రోమనుల ఆశయములు, ప్రాచ్య వర్ణాలంకారములు సమ్మిళితములైనవి. ఇందలి ఉద్దేశములు విశేషముగా క్రైస్తవమతమునుండి స్వీకృతములైనవి. ఈ ప్రాచ్య, ఐరోపా క్రైస్తవ దేవాలయ శిఖరములు, అందలి పాలంకృత స్తంభములు, వాటి వర్ణమయదీప్తి అద్వితీయములు, కాని అందు పునరుద్ధరణ చిహ్నముగాని, భవిష్యత్ప్రగతికి ఆధారముగాని కనిపించదు. ఆ దీర్ఘకాలమునం దాకళ, క్రమక్షయమునొంది, తుదకు మధ్యయుగములు తమస్సు నందు విలీనమయ్యెను. దీ రోమనెస్క్ కళ రోమక రాజ్య పతనానంతరము ఇటలీ, శతాబ్దుల పర్యంతము అరాజకము పాలయ్యెను.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/464
స్వరూపం