ఏనుగుల మహల్ ముగా నున్నది. ఆకారనిర్మాణ శాస్త్రపరిశోధనలు శారీరక శాస్త్ర పరిశోధనములకును, కణరసాయన శాస్త్రపరిశోధ నములకును, పునస్సృష్టి, అంటుతొక్కుట తిరిగి కలువుట, ప్రకాశవంతముగా చేయుట, మున్నగు ప్రయోగాత్మక మైన క్రియలకును కావొసంగెను. వాటి ఫలితములు ప్రోత్సాహకరముగా నున్నవి. ఏకకణజీవులపై జరుగు పరిశోధనములయందు ఒకప్రత్యేకమగు జీవినే ప్రధాన లక్ష్యముగా తీసికొనుట చాల కాలము క్రింద నే గతించినది. ఏకకణజీవశాస్త్రాభివృద్ధి భవిష్యత్తునందు అనేక శాస్త్ర ముల సమన్వయరూపముగ నుండగలదు. దానివలన ఈ జీవుల మనోజ్ఞ చరిత్ర నేకాక సమస్త జీవపదార్థముల యొక్క తత్త్వమును తెలిసికొనుటకు మార్గ మేర్పడెను. బి. ఆర్. కే. 3. B. 5. ఏనుగుల మహల్ - మందపల్లి : గోదావరి యను నామాంతరముగల గౌతమీనది రాజ మహేంద్రవరమునకు దిగువ నచ్చటచ్చట ఏడు శాఖలుగా విడిపోయి సప్తసాగర క్షేత్రము లను చోటులలో సాగర సంగమము గాంచుచున్నది. సుమారు ఇరువది మైళ్ళు రాజమహేంద్రవరమునకు దక్షిణమున గౌతమినుండి కాళికినది విడిపోయిన చోట చిరకాలమునుండి యావ ద్భారత దేశమునను శనైశ్చరునకు పవిత్రమగు మందవల్లి యను గ్రామముగలదు. సుందేశ్వరుడు వెలసినదగుటచే దీనికి మందపల్లి అను నామమేర్పడెను. పురాణకాలమున శ్రీరామచంద్రుడు సంచరించిన ఈ ప్రదేశమంతయు దండ కారణ్య మధ్యగతముగా నుండెను. ఇట రాక్షసులు ఆశ్ర మములందు తపస్సు చేసికొనుచు జీవితము గడపు ఋషులకు పీడగావించుచుండిరి. బ్రహ్మాండపురాణాంతర్గతమగు గౌతమీమాహాత్మ్యమున ఏక పంచాశ దధ్యాయమున ప్రశం సింపబడిన మందతీర్థమిచేయని స్థిరపడుచున్నది. పురాణ మున అశ్వశతీర్థము, వైప్పలతీర్థము, మందతీర్ధము నను నవి పేర్కొనబడినవి. మందుడనగా శని. ఈతడు ఛాయా సూర్యుల పుత్రుడు, శనిగ్రహదోషమును హరించు పుణ్య శేత్రము దేశమున నిదొక్కటే. శనివారమును, శనివార ముతో గూడిన త్రయోదశియు శనిగ్రహమునకు ప్రీతికర ములు. ఆ దినములలో మందేశ్వరునికి తైలాభిషేకము గావించి ఏడేండ్లు బాధించు శనిగ్రహపీడను వారించు సంగ్రహ ఆంధ్ర కొనుటకు భ క్తులు ఇటకు వచ్చుచుందురు. శనికి తిలలును, తైలమును ప్రీతికరములు. మందపల్లిని గురించి ఒక పురాణగాథ కలదు. అశ్వడు డను రాక్షసుడు రావిచెట్టు రూపముననుండి, తననీడను చేరినవారిని భక్షించువాడట. ఆ చెంతనే పిప్పలుడు అను రాక్షసుడు బ్రహ్మవేత్త రూపము దాల్చి, సాను వేదము బోధింతునను మిష పెట్టి తనకడ జేరిన శిష్యులను భక్షించెడి వాడట. ఆ ప్రాంతపు ఋషు లీ రాక్షసులవలన భీతిచెంది అగస్త్యునికడ కేగి మొర పెట్టిరట. అంత అగస్త్యుడు దక్షిణ మునకు ప్రయాణమై త్రోవలో వింధ్యపర్వతము నణచి 400 వేసి, గౌతమీ తీరమున తపమాచరించుచున్న శని కడకు వచ్చి, ఋషుల రక్షణకొరకు ఆతనిసాయ మర్థించెను. దీర్ఘాంతమున శని బ్రాహ్మణరూపమున అశ్వత్థుని జేరెను. ఆ రాక్షసుడు తనను మ్రింగగా, శని వాని ప్రేగులు చీల్చి వెలువడి, వేదాధ్యయమునకై పిప్పలునిజేరెను. వాడును తనను మ్రింగగా వాని పొట్ట చీల్చి బయట పడెను. ఇట్లు బ్రహ్మవంశస్థులను అశ్వత్థపిప్పలులను జంపుటచే తనకంటు కొన్న బ్రహ్మహత్యాపాతకమును పోగొట్టుకొనుటకు శని, అశ్వత్థ, పిప్పల, మందతీర్థములు గల ఇచ్చోట ఈశ్వర ప్రతిష్ఠ గావించెను. శనిప్రతిష్ఠితుడైన ఈశ్వరుడు మందే శ్వరుడనబర గెను. ఇట గౌతమిలో ఒక జలభాగమగు సూర్యగుండములో భక్తులు స్నానముచేసి మందేశ్వరుని దర్శింతురు. మందేశ్వరుని పార్శ్వమున శని పార్వతిని, బ్రహ్మ బ్రహ్మేశ్వరుని, కర్కోటకుడు నాగేశ్వరుని ప్రతి ష్ఠించిరి. నాగేశ్వరలింగము పాలరాతిది. దాని మీదిభాగ మున సర్పపుపడగ యున్నది. ఈ నాలుగు ఈశ్వరాలయ ములకును చెంత గౌతముడు క్షేత్రపాలునిగా వేణు గోపాలస్వామిని ప్రతిష్ఠించెను. ఇట్లు నాలుగు శివాలయ ములును, ఒక విష్ణ్వాలయమును ఒకే వరుసలో ఒకే అవర ణమున గలవు. నూరేండ్లనుండి శిథిలావస్థలో పడిన ఈ ఆలయములను భక్తులు పునరుద్ధరించుచున్నారు. ఈ ప్రాంతము పదునేడవ శతాబ్ది వరకును పెద్దా పురము వారి పాలనలోనుండి పిమ్మట పిఠాపురము వారికి చెందెను. పెద్దాపురమువారికి జగపతులను బిరుద నామము కలదు. తిమ్మయ జగపతి అను రాజు ఒకనాడు కనకదండి లక్ష్మణశాస్త్రి యను చౌషష్టికళానిష్ణాతుడును, సరసా
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/453
స్వరూపం