Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏకకణజీవులు వేరు వేరుగా నుండును. ఆహారమునుగ్రహించు పద్ధతులలో భేదములు గలిగిన ఈ ప్రత్యేక విధానములు, మొక్కలను పోలిన 'ఫ్లాజెల్లాట' జాతినుండి జంతువులను పోలిన ఏక కణ జీవులవరకు జీవపరిణామము ఎట్లుజరిగినది ఊహించు టకు త్రోవచూపును. ప్రయోగాత్మకముగా ఏకకణ జీవు లను పెంపొందింపచేయు పరిశోధనముల వలన ఆహారవిషయ పరిజ్ఞానము ఎక్కువ అభివృద్ధి చెందుచున్నది. పరాధీనజీవు (Holozoic) లలో, గమనాంగములు శరీరములోనికి ఆహారమును అందింపజేయుటకు సహాయ వాటి రసములను పడును. జీర్ణకార్యమునకు సహాయపడు ఉత్పత్తిచేయుటయందు, ఆహారపుతిత్తులు తోడ్పడుతున్నవి. 'ఫైటోమాస్టిజినా' జాతికి చెందిన ఏకకణ జీవులు చాల భాగము స్వయంపోషణ విధానమునకు అలవాటుపడినవి. వీటికితోడు కొన్ని 'శాప్రోజోయిక్' (Saprozoic) (శవభోక్తలు), పరాన్నజీవు (Parasitic) ల విధానము నకు అలవాటు చెందినవి మరికొన్ని కూడ గలవు. చనిపోయిన జంతువృక్ష సముదాయములపై జీవించు విధానమును శాప్రోజోయిక్ అందురు. బ్రతికియుండు జంతువృక్షసముదాయములపై ఆధారపడియుండు విధాన మును పరాన్న భోజన (Parasitic) విధాన మందురు. బాహ్యపరిస్థితుల మార్పునకు అనుగుణముగా పరాన్న భుక్కు లైన ఏక కణజీవులు ఒకేసమయమున అనేక విధాన ములుగాను, లేక ఒక్కొక్క సమయమున ఒక్కొక్క విధానముగాను ఆహారమును గ్రహించును. ఇట్టి పోషణ మును మిక్సోట్రాఫిక్ (Myxotrophic) పోషణమందురు (సంకీర్ణ పోషణ విధానము). వీటియందు జీవపరివ ర్తవ వ్యాపారమునైనను, వృద్ధిపైనను, ప్రభావము కల్పించు టకై, హార్మనులు, విటమినులు ప్రయోగింపబడి "పెక్కు పరిశోధనములు జరుగుచున్నవి. వీని ఫలితములు జయ ప్రధములుగ నున్నవి. . am · "నిలువయున్న ఆహారపదార్థము, తరచుగా గ్లైకోజీను గాను, పార గ్లైకోజినుగాను, పేరమిలియంగను, మారి ఉత్త రోత్తరము ఆజీవియొక్క "పెరుగుదలకును ప్రత్యుత్ప త్తికిని తోడ్పడును. మైక్సోస్పోరిడియా (Myxosporidia), ప్రోటోసిలి యొటా (Protociliata), పెనోసోమ్చు (Trypanosomes) వంటి ఏకకణజీవులలో నూనెలు, 398 సంగ్రహ ఆంధ్ర క్రొవ్వులు కని పెట్టబడినవి, పొలిస్టి మెల్లా ఎజిలిస్ (Polysti- mella agilis) మరియు 'స్పైరిలియం వాల్యూటాన్స' (Spirillum Valutans) లో నున్న చుట్టచుట్టలుగానున్న గింజలవంటి పదార్థము గ్లైకోప్రోటీను (Volutin gran- nules) లతో తయారుచేయబడిన నిలువయున్న ఆహార పదార్థము అని భావింపబడుచున్నది. శ్వాసక్రియ (Respiration) : ఏకకణజీవులలో శ్వాస కార్యము కొనసాగించుటకు క్లిష్టమైన నిర్మాణముగల శ్వాసాంగముల యొక్క ఆవశ్యకత లేదు. సామాన్యముగా వాయు వ్యాపనమువలనను శరీరములోనికి నీరు వేగముగా వచ్చిపోవుటవలనను, జీవపదార్థమందలి కదలికలవలనను ఈ జీవులలో ప్రాణవాయువు తగుమాత్రవు ఒత్తిడితో నుంచబడును. ఇట్లు జరుగుటవలన శరీరమునందు కర్బనద్వి ఆమ్లజనిదమువలన ఏర్పడు విషపదార్థములు నశించును. విసర్జనము-స్రావము (Excretion and Secretion): శరీరమునందు అపచయ చర్యల (నాశక చర్యల) వలన కొన్ని వ్యర్థపదార్థములు ఏర్పడుచున్నవి. నీరు, బొగ్గు పులుసు వాయువు, మూత్ర సంబంధమగు లవణములతో కూడిన వ్యర్థపదార్థముల విసర్జనము శరీరపు ఉపరితలము నుండిగాని, తెరచుకొను, ముడుచుకొను శక్తిగల రంధ్ర ములనుండి కానీ వాయువ్యాపనమువలన జరుగును. సిలి యాటాజాతిలోను, సక్టోరియా (Suctoria) జాతిలోను ఇట్టి రంధ్రములు సర్వసాధారణముగ గలవు. హెమొస్పోరి డియా (Haemospordia) యొక్క హెమొజాయిను (Haemozoin) అనునది అపచయక్రియలవలన ఏర్పడేడు మరియొక వ్యర్థపదార్థము. ఎముక పొలుసులు, చిప్పలు, రంగులు మున్నగు స్వభావము కలిగిన ప్రత్యేక కణ, బహిస్రావములేకాక, చాల రకపు ఏకకణ జీవులు సుడోపొడియా (Pseudo- podia) (కృత్రిమ పాదములనుండియు (tentacles) వెంట్రుకల కుచ్చులనుండియు, బ్రైకోసిస్టుల ద్వారాను, (శాము పట్టుకొనిన) ఎరను మొద్దుబారునట్లుగా చేయు శక్తిగల కొన్ని పదార్థములను స్రవింప జేయును. ప్రత్యుత్పత్తి (Reproduction): ఏకకణ జీవుల యందు ప్రత్యుత్పత్తి కార్యము వేరువేరు జాతులలో పేరు వేరు రకములుగా నుండును. ఈ ప్రత్యుత్పత్తి కార్యము