Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏకకణజీవులు చెందిన ఏకకణజీవులకు వర్తించును. కాలక్రమేణ ఇతడు మానవులయందును, మృగములయందును ఉండు పరాన్న భుక్కులగు ఏకకణజీవులలోని చాలరకములను, మానవుని నోటియందుండు సూక్ష్మజీవులను గమనించెను. ఏబది సంవత్సరముల తరువాత, ప్రఖ్యాత సూక్ష్మదర్శిని శాస్త్రజ్ఞుడైన సి. జి. ఎహెరన్ బర్గు (C. G. Ehrenberg) (1795-1878) అప్పటికి విశేష ప్రచారములో నున్న కణ శేషప్రచారములోనున్న సిద్ధాంతమునుబట్టి ఏకకణజీవులకు సమగ్రమైనట్టియు, సూక్ష్మమైనట్టియు అంగమండలము కలదని వెల్లడించెను. అదేకాలమున ఫ్రాన్స్ దేశములో 'ఫెలికు డుజార్డిను' (Felix Dujardin) అను ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు వెలిసెను. ఈతడు చిరకాలము ఫారామిని ఫెరా అను జాతికి చెందిన ఏకకణజీవులనుగూర్చి యధ్యయనముచేసి దానియందు ఆస క్తి పరుడై యుండెను. 'ఏమి' వంటి ఏకకణజీవులను (Rhizopods) 'జంతుజీవపదార్థము' (Sarcode) అని పేరు పెట్టెను. డుజార్డిన్ 1841 సంవత్సరములో ఏకకణ జీవులనుగురించి ప్రామాణిక మైన గ్రంథమును వ్రాసి, ప్రచు రించి ప్రఖ్యాతి కెక్కెను. ప్రప్రథమమున మేయరు (Meyer) అను శాస్త్రజ్ఞుడు 1889 లో 'ప్రొటోజోవా"లు ఏకకణ జీవులని సూచించెను. 'బట్స్' (Batschli) అను శాస్త్రజ్ఞుని కథనము ప్రకారము మొట్టమొదటిసారిగా కణసిద్ధాంత మును ప్రోటోజోవా'కు వర్తింపచేసినవాడు భారీ' (Bary) (1848) అను శాస్త్రజ్ఞుడు, 1845 లో 'వాన్సియబోల్డు' (Von Siebold) అను శాస్త్రజ్ఞుడు 'ప్రోటోజోవా' యొక్క ఏకకణజీవస్వభావమును సిద్ధాంతీకరించెను. నేడు ఏకకణజీవుల యొక్క విజ్ఞానము జీవశాస్త్ర దృక్ప థమునుండియు, పరాన్నభుక్ దృక్పథము నుండియు విస్తృ తముగను, గహనముగను చర్చించబడుచున్నది. మానవుని యందు ఎమీబా యొక్క ఉనికి మొట్టమొదటిమాటు 1849 లో కనుగొనబడెను. మానవుని నోటియందుండు 'ఎంటా మొడాజింజీ వాలిస్ '(Entamoeba gingivalis) అను జాతి ఎమిబాను గ్రాసు అను శాస్త్రజ్ఞుడు గుర్తించేను. అయిదు సంవత్సరముల తదుపరి 'డెవానైన' (Devanine) అను శాస్త్రజ్ఞుడు రెండురకముల 'ఫ్లెజెల్లెట్సు' 'సై కొమొనసు' (Trichomonus), మరియు 'చిలో మాస్టిక్ ' (Chilo- mastik) అమవాటిని కనుగొనెను. 1855 లో క్లాసు .394 ' సంగ్రహ ఆంధ్ర (Kloss) అనుశాస్త్రజ్ఞుడు, 'కొక్కిడియను'(Coccidian), 'క్లోసియా హెలిసినా' (Klossia helicina) అను ఏక కణ జీవులను నత్తగుల్ల ల యొక్క మలవిసర్జకాంగములలో కనుగొనేను. 1870 సం. లో 'ఎమిరు' (Eimer) అను శాస్త్రజ్ఞుడు అనేక జంతువులలో యుండెడి 'కొక్కిడి యను' ను కనుగొనెను. గత శతాబ్దారంభమున పట్టు పురుగులకు సంబంధించిన వెబైను' అను అంటు వ్యాధి ఇటలీ దేశములోను, ఫ్రాన్సు దేశములోను ప్రబలెను. 'పాశ్చరు' (1870) మున్నగు చాలమంది జీవశాస్త్రజ్ఞులు, ఆ రోగకారణమైన సూక్ష్మజీవుల స్వభావము పై నను, పెరుగుదల, వృద్ధిపొందుట, నష్టమును కలిగించుట మున్నగువాటి పైనను విరివిగా పరిశోధనలు సాగించి, ఆ వ్యాధిని కలిగించు జీవులు 'గోసిమాణాంబిసిస్' (Nosemabombycis) అను ఏకకణ జీవులని తెలిపిరి. వ్యా ప్తిని అరికట్టుటను, వాటి నివారణోపాయము లను గురించి వివరించిరి. 'లెవరాను' (Laveran) అను శాస్త్రజ్ఞుడు 1880 సం. లో మానవ రక్తములో పరాన్నభుక్కులగు మలే రియా సూక్ష్మజీవులను కనుగొనుటలో పరాన్న భుక్కులగు ఏకకణజీవులు జీవశాస్త్రము విపరీతముగా వృద్ధికివచ్చెను. పశువులకు తగులు 'టెక్సాస్' జ్వరమును కలిగించెడి 'ఔబేసియా' (Babesia) అను ఏకకణ జీవులకును ఈగలు, శుళ్ళుపురుగులు, నీతాకోకచిలుక, తేనెటీగలు మున్నగు 'ఆర్థ్రోపోడా' (Arthropoda) జాతికిని గల సంబంధ మును 1898 లో 'స్మిత్' (Smith), 'కిల్ బోర్ని' (Kilbourne) అను శాస్త్రజ్ఞులు వెలుగునకు తెచ్చిరి. ఆఫ్రికాదేశమునందు 'నగానా' అను వ్యాధిచే బాధ చెందు గుఱ్ఱములు, పశువుల రక్తములలో 'పై ఫానోసోమా బ్రూసై '(Tryipanosomabrucei) అనువాటిని బ్రూసు' (Bruce) అనునాతడు కనుగొనేను. తదుపరి 'రాస్ (Ross) అను శాస్త్రజ్ఞుడు 1898 లో ఇతర పరిశీలకు లతో కలసి మలేరియా రోగ కారణమగు పరాన్న భుక్కు జీవియొక్క జీవిత చరిత్రను, ఇతర పరాన్న భుకు లగు ఏకకణ జీవుల చరిత్రను పరిశీలించెను. తత్ఫలితముగా రాసాయనిక వైద్యశాస్త్ర విషయమునకును, రోగ నివారణ విధానమునకును, సంబంధించిన శాస్త్రీయ విజ్ఞా