ఏక్ నాథజీ
ఆధారపడియుండును. కుటుంబములోని పురుషులు ఆహార మును సంపాదించుట, ఇండ్లు కట్టుట, అను పనులను నిర్వహింతురు. స్త్రీలు ఆహారమును సిద్ధమొనర్చుట, చుస్తులను కుట్టుట, అను పనులను నెరవేర్తురు. వేరు వేరు కుటుంబములలోని పురుషులందరును కలిసి వేటకాండ్ర గుంపుగా ఏర్పడుదురు. ఆదేశములో ప్రత్యేక మైన ప్రభుత్వవిధాన మేదియులేదు. 'Angakut' అను వారికిని, శ్రేష్ఠులైన వేటగాండ్రకును సర్వశక్తులును ఈయబడి యున్నవి. నాయకత్వము వంశానుగత మైనదికాదు. సమర్థులైనవారికే నాయకత్వము లభించును. రా. ప్ర.
ఏక్ నాథజీ :
మహారాష్ట్రసీమలో నామనంకీర్తనము 18 వ శతాబ్దము
నుండియే ఎక్కువ ప్రచారములోనికి వచ్చినది. ఈ సంప్ర
చాయకులను “వర్కరాలు" అందురు. వీరు ఆషాఢశుద్ధ
ఏకాదశి, కార్తీకశుద్ధ ఏకాదశి పుణ్యతిథులలో పండరీపుర
యాత్రకుపోవు ఆచారమున్నది. వీరు చంద్రభాగానదిలో
స్నానముచేసి పాండురంగ విఠలుని యాలయమునకుపోయి
స్వామిని సేవించెదరు. అక్కడ వాతావరణమంతయు
"రామకృష్ణ హరే, విఠల్" అను నామసంకీ ర్తనలతో
మార్మోగుచుండును.
ఫో
17 వ శతాబ్దములో మహమ్మదీయుల దాడి నెదుర్కొను
టకు శస్త్రాలను ధరించి ఈ వర్ష్య రాగాలందరు 'ధార్యరీలు'గా
మారిపోయినారు. వీరు భాగవతధర్మము ననుష్ఠించి, భాగ
వత, భగవద్గీతాది వేదాంత గ్రంథములను పఠించెదరు.
వీరు నిష్కామ భక్తి యోగులు. ఈ సంప్రదాయకులలో
ముఖ్యులు ధ్యానేశ్వరుడు, ఏకవాథుడు, సమర్ధరామ
దాసు, తుకారాము అను మహనీయులు, వారి రచనలను
మహారాష్ట్రులు వేదముగా భావించెదరు.
క్రీ. శ. 1528 లో, భ క్త శ్రేష్ఠ ఏక నాథుడు పై రానే వేలీ
ప్రతిష్ఠాన నగరములో మహారాష్ట్ర బ్రాహ్మణకుటుంబ
ములో రుక్మిణీ సూర్యనారాయణ దేవుల పుత్రుడుగా
జన్మించెను. తలిదండ్రులను బాల్యములోనే గోల్పోయెను.
అందుచేత అతడు తన తాతయైన చక్రపాణిచేతులలో
'పెరిగి, పోషింపబడినాడు. ఇతని ముత్తాత భానుదాసు
గొప్పభ క్తుడగుటచే శ్రీకృష్ణ దేవరాయల మహలులో
నుండి
శ్రీ పాండురంగని విగ్రహమును తీసికొనివచ్చి పండరిపుర
ఏ
ములో ప్రతిష్ఠించినాడు. బాల్యదశలోనే ఏకనాథుడు గొప్ప బుద్ధిమంతుడుగాను, శ్రద్ధాళువుగాను ఉండుట చేత భజనగోష్ఠిలో కాలమును గడపి ఆనందించువాడు. ఇతనికి అరవయేటనే ఉపనయన సంస్కారము జరిగెను. నాటి నుండి రామాయణ, మహాభారతాది గ్రంథములను శ్రద్ధతో వినుచుండెడివాడు. కీ.శ. 1540 అనగా పండెండవ యేటనే యితనికి భ క్తి అంకురించుటచేత, భగవద్దర్శనలాలసుడై, సద్గురువును అన్వేషించుచుండెను. ఈకారణముచేత రాత్రి నాలుగవ జామున శివాలయమునకుపోయి, అక్కడ హరిగుణకీర్త నము చేసెడువాడు. ఒకనాడు ఆకాశవాణి ఇతనికి 'దేవగడ్' అను పట్టణమున కేగి అక్కడ జనార్ధన వంతు యొక్క దర్శనము చేసికొనవలసినదని ప్రబోధముచేసెను. అతడు వెంటనే బయలుదేరి దేవగడునకుపోయి అక్కడ జనార్దన పంతు దర్శనముచేసి అతని ఆశీర్వాదము పొందెను. పిమ్మట అవిరళ పరిశ్రమలచే ఆరు సంవత్సరాలు గురుసేవ చేసి, కృతార్థుడై దత్తాత్రేయ సాక్షాత్కారము పొందీ ధన్యుడయ్యెను. కొన్నాళ్ళకు గురువితనికి శ్రీకృష్ణ మంత్రము నుపదేశించి శూలభంజన పర్వతముపై తపస్సు చేయమని యాజ్ఞాపించెను. కొంత కాలమిట్లు ఘోరతపస్సు నొనరించిన పిదప ఏకనాథుడు గురువులతో సంతనమున భాగవత ధర్మప్రచారార్థము నాసికా త్రియంబక మునకు పోయెను, ఆ రోజులలో చతుశ్లోకీ భాగవతమును ఛందో రూపముగా రచించెను. పంచవటి తీరములో శ్రీరామ చంద్రమూర్తి వారి దేవాలయములో గురుదేవులకు అభంగములన్నియు వినిపించినాడు. పిమ్మట తన జన్మస్థాన