విజ్ఞానకోశము - ౨
ఎల్లోరా గుహాలయములు
వహమయిన గజరాజు విగ్రహమొకటి కలదు. దానికి అభిముఖముగా సమదూరమున ఏకశిలామయమైన ఒక
స్తంభమో, ధ్వజస్తంభమో కలదు. దీని ఎత్తు 30 అడుగులు. ఇంద్రసభ యొక్క పై అంతస్తు భారమును 12 స్తంభములు వహించుచున్నవి. వాటిపై విరివిగ ప్రతిమలు చెక్కబడి యున్నవి. క్రింది అంతస్తును విశాలమైన సమప్రదేశముపైఅంతస్తునుండి విభజించుచున్నది. ఈ రెండు శిలానిర్మాణ భాగములు విస్తారమయిన చెక్కడపుపని కలిగియున్నవి. ప్రధానమైన చావడి యొక్క మధ్యభాగమునందలి లోకప్పు అత్యంత సౌందర్య గుణావహముగా ఒక పెద్ద కమల రూపమున కల్పితమయినది. ఆ చావడి యొక్క ప్రతి మూలయందును మహాశివుని మహావిగ్రహముగల గుడి కలదు. తోరణాకార, ఆచ్ఛాదిత ప్రదేశమున (loggia) ఇంద్రుని విగ్రహము కలదు. 'ధాని పాదములకడ ఐరావతము కలదు. ఈ దృశ్యము ఒక లలితమయిన శిల్పకళాఖండమై తనరారుచున్నది. విగ్రహ శిల్పరచన యందును, అలంకరణ కళాఖినివేశ మందును, శిల్పకారులు
అత్యంత విశిష్టములైన నిర్మాణముల నొనర్చిరి. ఎల్లోరా యందలి ఏ ఆలయముకూడ ఇంద్రసభయందలి పై అంతస్తు నందువలె పనితనపు పాటవమునందును, అవయవ పరిస్ఫూర్తియందును సంపూర్ణత నొందియుండ లేదు. గోడ స్తంభముల మధ్య తొలిచిన పెద్ద ఫలకము (Panels) లన్నియును ప్రతి కుడ్యమును వివిధ విషయక ప్రతిమా గాథలతో నింపబడినవి. స్తంభములు మోదావహములుగా ఎడఎడముగా ఏర్పరుపబడినవి. అవసరమునుబట్టి వాటిని పొట్టిగోడలతో కలిపి ఇతర సందర్భములందు వలెనే అగ్రములందు నిడుపాటి గాడులతో పలకల ముఖములతో మలచబడినవి.
జగన్నాథసభ అనునది ఎల్లోరాలో తొలచబడిన మరియొక విశిష్టమైన జైన చెక్కడమునకు తార్కాణము. ఇది మొత్తముమీద రూపపథమునందు ఇంద్రసభను పోలియున్నది. కాని ఇది ఇంద్రసభ కంటె పరిమాణమున చిన్నది. ఆదేవమందిరమును చిన్న ఉపశాలగుండా ప్రవేశింపనగును. ఆ ఉపశాలకు ఒక చక్కని యథా ప్రమాణ కృతమయిన బహిర్ద్వారము కలదు. ఆప్రవేశద్వారము మీదుగా తొరణ నిర్మాణము గలదు. ఈ ద్వారము లోపల సింహాసనస్థుడయిన మహావీరునియొక్క విగ్రహము కలదు. గోడలలో విగ్రహ నిర్మాణమునకై గూడులు ఏర్పాటు చేయబడినవి. స్తంభములపై శిల్పవిన్యాసము సమృద్ధిగనున్నది. అందలి శైలిజైనకళాకారుల విశిష్టప్రతిభను జాటుచున్నది.
సాధారణమైన నమూనాలోను, నిర్మాణశిల్ప లక్షణములోను ప్రధాన జైన దేవమందిరములకును, అచ్చటి బ్రాహ్మణ దేవమందిరములకుమ విస్మయోత్పాదకమయిన సామ్యము కలదు. కాని ఈ దేవమందిరముల యొక్క వివిధములయిన అనుబంధ నిర్మాణములు అనవసరములయిన అలంకరణ విస్తరములచే విశేషముగా సంకీర్ణములును, అతిభావా క్రాంతములై యున్నవి. అందుచే ప్రదర్శితమయిన వాటి సంకీర్ణతా క్లిష్టత చూపరులకు సంభ్రాంతిని, విసుగును కలిగించును. ఉదాహరణముగా, ఇంద్రసభయందలి యావరణమున ధ్వజ స్తంభము ఆలయకవాటమునకే కాక సభా కేంద్రమంటపమునకుగూడ చాల దగ్గరగానున్నది. అందుచే సర్వము ఇరుకుగను, సంకుచితముగను, చిత్తుగను కనిపించును. సభాస్తంభముల యొక్కయు, దాని పై భాగ ముననున్న కొన్ని చిన్న గదుల స్తంభముల యొక్కయు అల్ప పరిమాణములు ఈ వికృతపరిస్థితిని మరింతగా అధికము చేయుచున్నవి. వాస్తు శిల్ప సంబంధ విశేషములు వేర్వేరుగా పరికించినచో గొప్ప పరిశ్రమను, కౌశల్యమును చాటుచున్నను, ఈ పై లక్షణములు దేవాలయము యొక్ష ఆకార పథకమునందు వివిధాంగము లను పొందిక గాగూర్చు విజ్ఞానము మృగ్యముగా నున్నట్లు వెల్లడిచేయుచున్నవి. ఈశిల్ప విశేషములు సృజనాత్మక ప్రయత్నస్థానమున ఆత్మవిహీనమగు ప్రయత్నమును నిలిపి ఏదో ఫలితమును చూపించ దలచినట్లుండుటచే ఇందలి కళ తంత్రవిధానముగ దిగజారి పోయినట్లు గోచరించును.
ఈ గుహలయందలి శిల్పవిన్యాసము సమర్థమైన కార్య కౌశల్యమును ప్రదర్శించి మతవిషయక ప్రసన్నతా భావమును వెలిబుచ్చుచుండును. కాని మహనీయోజా త్తత యందు బౌద్ధ గుహాశిల్పమునుగాని, శక్త్యుత్సాహము లందు బ్రాహ్మణగుహాశిల్పమునుగాని ఇచ్చటి శిల్పవిన్యాసము పోలజాలదు. ఇచ్చటి కళ ఏదో వేరు విధానముగా నున్నది. శిల్పలేఖనములు కొన్ని ధార్మిక సిద్ధాంతముల ననుసరించి