ఎల్లోరా గుహాలయములు
సంగ్రహ ఆంధ్ర
నంది ఆలయమునకు ఇరుప్రక్కల 51 అడుగుల ఎత్తుగల రెండు ధ్వజస్తంభములు గమనింపదగిన మరియొక
కళావిశేషము. దక్షిణ భారతములో ధ్వజ స్తంభముల నిర్మాణపరిణామదశయందు, ఈ రెండు ధ్వజ స్తంభముల
నిర్మాణచాతుర్యము ముఖ్యమయిన ఒక ఘట్టమును సూచించుచున్నది. ఈ దేవాలయము యొక్క శిల్పా
లంకారమునుబట్టి, ఇందలి అన్ని భాగములును శాస్త్రీయముగనే నిర్మింపబడినవి. ఇందులో ప్రదర్శించిన
నైపుణ్యము చిరస్మరణీయమగు విశిష్టకళాఖండమునకు తగినట్లుగా నుండెనని చెప్పగలము. రావణుడు కైలాసపర్వతమును పెకలించినట్లు రచించిన శిల్పము ఇందలి శిల్పవి శేషములలో అగ్రగణ్యమైనది.
ఇందలి బ్రాహ్మణ గుహాలయములవలెనే, కైలాస గుహాలయమందు ప్రదర్శింపబడిన శిల్ప నైపుణ్యమునందు అత్యద్భుతమయిన శక్తి, అపరిమితమయిన తేజస్సు ప్రస్ఫుటముగ గోచరించుచున్నవి. దేవతలు మానవాతీతులని తెలియచేయుటకు పెక్కు తలలు, చేతులు, ఇతర ప్రధాన లక్షణములు ఈ విగ్రహనిర్మాణ మందు కల్పించుట ఇందలి విశేషము. బ్రాహ్మణాలయములలో అచ్చటనచ్చట చురుకయిన చలనమును, సౌందర్యమును, సంతోషమును, లావణ్యములను చిలుకుచు, అయిదవ శతాబ్దినాటి బుద్ధ నిగ్రహ సముదాయమును జ్ఞప్తికి తెచ్చు కొన్ని శిల్పవిశేషములు కన్పించును. ఉదాహరణమునకు, ఆకాశ వీధియందు కొన్ని జంటలు ఎగిరిపోవుచున్నట్లు కైలాస గుహాలయపు గోడల పైభాగము మీద మలచిన చెక్కడములు వాటి సౌకుమార్యము, ప్రశాంతచిత్తము, గమనవిధానము, బౌద్ధాప్సరసల మనోహరత్వమును, లావణ్యమును పోలియున్నవి.
ఎల్లోరాలోని అన్ని గుహాలయందువలె, ఈ గుహాలయ మందు కూడ వర్ణచిత్రములు బాహుళ్యముగ తప్పక ఉండియుండవచ్చును. ఈనాటికి ఎత్తయిన గోడలమీదను, పైకప్పులమీదను వర్ణచిత్రముల ఛాయలు కన్పించుటయే ఇందుకు నిదర్శనము. ఇప్పటికిని కైలాస, గణేశ గుహాలయములందు వర్ణచిత్రముల చాయలు మిగిలియున్నవి. ఇచ్చటికన్న జైన గుహాలయములలో ఈ చాయ లెక్కువగా కన్పట్టును. అజంతా గుహలకంటె ఎల్లోరాగుహలు ఎండ వానలకు ఎక్కువగా గురియగుటచే,ఇచ్చటి వర్ణములు వాతావరణ పరిస్థితుల ఒత్తిడికి తాళజాలక మకమకగా విలాసహీనములై యున్నవి. నమూనా విషయములో అవన్నియు ఒకే వర్గమునకు చెందియున్నవి. అవి లతాపుష్పజాతులకు చెందిన తరగతులు; రేఖాగణిత (Geometrical) సంబంధ చిహ్నములు. వీటిలో ఆథరణముల పోకడలు, చారుచిత్ర సంబంధమయిన రీతులు చేరిఉన్నవి. వీటి మూలము లన్నియు అంతకుపూర్వము నిర్మింపబడిన అజంతా గుహాలయముల కప్పులపై ఇప్పుడు చూడ వచ్చును.
కైలాస గుహాలయమునకు చెందిన ముఖమంటపము యొక్క పై కప్పు మీద చిత్రలేఖన చాయలు కొన్ని కన్పించుచున్నవి. ఇవి 8 వ శతాబ్ది మధ్యభాగముననో లేక కొంచె మవతలనో, ప్రధానాలయము మీద విగ్రహములు చెక్కబడిన కాలముననే చిత్రింపబడి యుండవచ్చును. వీటిలో ఒక చిత్రమందు పూజగొనుచున్న ఒక బ్రాహ్మణ దేవత చూపబడినది. ఇతడు శార్దూలముపై నధివసించి యుండును. ఆ శార్దూలము సింహపు తల, జూలు, పంజా తోడను, ఎద్దుయొక్కయో లేక మహిషముయొక్కయో కొమ్ములతోడను ఉండు పౌరాణిక ప్రసిద్ధిగల శరభమో, పాళ్వమో అయియుండును. భావనలోను, రూపకల్పన లోను ఈ బ్రాహ్మణదేవత శిరము అజంతాలో అదివరకు చిత్రింపబడిన బోధిసత్త్వుల శిరములను పోలియున్నది. అయితే ఈ వర్ణచిత్రములోని ఇతర వ్యక్తులు అతి వికృత రూపములో చిత్రింపబడి యున్నారు. అందుచే ఈ చిత్రముల యొక్క మత ప్రాధాన్యము లోపించెను. ఈ చిత్రముల అవయవ విశేషములు వాటి పరస్పర అనను రూపతను చాటు చున్నవి. ఇంతియే కాక, అజంతా గుహల నుండి అరువు తెచ్చుకొన్న సంప్రదాయ సిద్ధములయిన మేఘ రూపములు ఈ శిల్ప ప్రణాళికయందు మొత్తము మీద మోటుతనమునే ప్రవేశ పెట్టినవి. అందలి వర్ణములు గూడ లలితమయిన అభిరుచిని కల్పింపలేదు. కళాత్మక మయిన సౌందర్య, విశిష్టతలు ఈ చిత్రమందలి ప్రతి లక్షణములో నీరసింనచిట్లు ద్యోతకమగును.
పై చెప్పబడిన ముఖమంటపము యొక్క కప్పుమీద వలయాకారముగ నొక మండలము గలదు. దీనిపై నొక పటముకూడ కన్నట్టును. అందు యముడు, అతని అర్ధాం