విజ్ఞానకోశము - ౨ చావడిలో ప్రవేశించుదుము. దీని సరంబి (Roof ) కి అత్యంత స్థూలమయిన స్తంభములు ఆధారముగా నున్నవి. ఈ స్తంభాగ్రములందు దిండువంటి కుదుళ్ళు కలవు. ప్రతి ప్రక్క యందును చిన్న ప్రాంగణములు కలవు. వీటి వెనుక భాగమున చిన్న గుడులు కలవు. దక్షిణదిక్కునందు ఉత్తమమయిన నీళ్ళకుండి కలదు. ఇందు స్వచ్ఛమయిన మంచినీరు కలదు. ఉత్తర దిశయందు మధ్యయుగపు (Mediaeval) జంతుజాలము కాపలా కాయుచున్నట్లు కనబడును. ఇట్టి జంతుజాలమే ఎల్లోరాలోని 29వ గుహ యగు సీతాస్నాన ఘట్టమునందును కాన్పించును. ఈ గుహ యందు అన్నిటినిమించి అద్భుతావహముగ గనుపడునట్టిది “త్రిమూర్తి” దివ్యవిగ్రహము. ఈవిగ్రహశిల్పము ప్రధాన శాల యొక్క వెనుక భాగపు కుడ్యమునందు మలచబడినది. హిందూమతమునందలి మువ్వురు దేవతల ఏకత్వము త్రిమూర్తి విగ్రహము సూచించును. నడిమి శిరస్సు సృష్టి కారకుడగు బ్రహ్మది. కుడివై పుననున్న శిరస్సు స్థితికారకు డయిన విష్ణువుది. విష్ణువు పద్మహస్తుడయి యున్నాడు. మూడవది లయకారకుడయిన శివుని ముఖచిత్రము. శివుడు రుద్ర ద్రాకారమున నుండును. ఇచ్చట మలచిన వివిధ శిల్ప చిత్రములను బట్టియు, వాడిన సాంకేతిక సంజ్ఞలనుబట్టియు ఈ గుహాలయమంతయు శివాంకితముగా నిర్మితమయినట్లు స్పష్టమగుచున్నది. ప్రధాన శాలాంగణమున వాయవ్య దిశయందు ప్రత్యేకముగ నిర్మితమయిన ఆలయములో "లింగము" ప్రతిష్ఠింపబడినది. త్రిమూర్తీకి వామపార్శ్వమున వెనుక భాగపు కుడ్యము మీద బ్రహ్మాండమగు "అర్ధనారి" (అర్ధనారీశ్వర) విగ్ర హము కలదు. ఈ విగ్రహము చుట్టును ఎన్నో ప్రతిమలు గుంపులు గుంపులుగా నుండును. త్రిమూర్తికి దక్షిణపువైపు గదియందు రెండు విగ్రహములు కలవు. ఒకటి శివమూర్తి, రెండవది ఆయ నకు ఎడమవైపున పార్వతి. ఈ దేవమందిరములోని ఇతర శిల్పచిత్రములు బ్రాహ్మణ (హిందూ) పౌరాణిక గాథలకు సంబంధించిన రంగములు. ఈ గాథలు ఎక్కువగా శివ, విష్ణు లీలలు తెలుపునవిగా ఆ. వీ. 371 ఎలికో (Elgreco) 1548-1614 A.D. : ఎల్లికో ఎల్లికో అనువాని మొదటి పేరు 'డొమినికన్ థియొ టొకోపోలస్' అనునదై యుండెను (Domenicos- Theotocopolus). ఆతడు క్రీట్ (Crete) ద్వీపమునందు జన్మించెను. స్పెయిను దేశవాసులు (Spaniards) అతనికి "ఎల్లికో" (గ్రీక్ నివాసి) యని నామకరణము చేసిరి. ఆతడు బై జంటైను (Byzantine) కళా సంప్రదాయ ప్రభావమునకు పూర్తిగా లోనై యుండెను. పొడవైన దేహములతో నొప్పుచు మెలికెలు నొప్పుచు మెలికెలు తిరిగిన మనుష్యుల చిత్రములే ఆ ఆ విషయమును నిర్ధారణచేయును. యౌవనము నందే ఇతడు ఇటలీ దేశమున ఉత్తమ చిత్రకారుడుగా ప్రకాశించెను. వెనీసు (Venice) నగరములో టిటియను (Titian) అనువాని భావచిత్రము లితనిదృష్టి నాకర్షిం చెను. మైకెలాం జెలో(Michelangelo) అను ఇటాలియను శిల్పకారుడు తయారుచేసిన శిల్పములు కాలక్రమమున భగ్నములు కాగా, వాటియందలి ఆకృతి విశిష్టతయు, దివ్యత్వమును ఎల్లికో హృదయము నాకర్షించెను. అతడు వెనీసు నగరములోని ప్రఖ్యాత చిత్రకారుడగు టింటారిటో (Tintorito) అనువాని శిల్పగృహమునందు (Studio) చిత్రకళ నభ్యసించెను. ఇటలీయందుకంటె ఇతర దేశములలో ఆ కాలమున చిత్రకారులకు పని యెక్కువగా లభించుచుండెడిది గావున ఎల్దికో ఇటలీని వదలి స్పెయినులోని టోలెడో (Toledo) అను నగరమునకు 1578 లో చేరుకొనెను. 16వ శతాబ్దము నందు ఇటలీ యందుకంటే స్పెయినులో మతవిశ్వాసము ప్రబలతరముగా నుండెను. ఎల్లికో యొక్క మతావేశమును ఒకరకమైన వివశత్వమును ఉబికివచ్చు చుండును. అతని చిత్రాలను అల్పశ్రేణికి చెందిన ఇటాలి యను చిత్రములచే తృప్తిచెందెడి ప్రభువులేగాక అచటి క్రైస్తవ దేవాలయములందలి అధికారులు కూడ కొని వాటియందు ఆదరాభిమానముల చూపిరి, కళయందు ఎల్దికో కళలోని అంతర్యము, భావసౌందర్యము అతని సుప్రసిద్ధములైన చిత్రములు కొన్నింటిని జూచిన యర్థము కాగలవు. "సెయింట్ మార్టిను బిచ్చగాడు” (Saint Martin the Beggar) "కౌంటు ఓర్గాజు యొక్క సమాధి" (Burial of Count Orgáz)
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/412
స్వరూపం