విజ్ఞానకోశము - ౨ చూపినది. ఆతడు నాటకములు వ్రాసెను. ప్రబంధములు గ్రంథించెను. శ్లేషకృతి నిర్మించెను. వైద్యగ్రంథమును రచించెను. పురాణము లిఖించెను. తంత్రగ్రంథము వెల యించెను. ఈ మహోపాధ్యాయుడు శతాధిక గ్రంథ కర్తయైనట్లుగా ఆతని యాదవ రాఘవ పాండవీయము లోని 'సారసారస్య సచ్చంద్రికా పరిణయ ప్రముఖ శతాగ్రప్రబంధక ర్త-' అను పద్యపాదమువలన స్పష్ట పడు చున్నది. బాల సరస్వతీయమువంటి శాస్త్ర వ్యాఖ్యాన ములను, మల్లభూపాలీయమువంటి అనువాదములను ఆతడు కావించెను. ఆతని గ్రంథములలో తెలియవచ్చినవి. కొన్ని ఇవి. 1. రంగకౌముది : ఇది యొక నాటకము యక్షగాన ఫక్కీలో వెలసినదియై యుండును. 2. చంద్రకాపరిణయము : ఇది యొక సరస ప్రబంధము. కాశీరాజు కూతురైన చంద్రికను భీమసేనుడు విశాహ. మాడిన కథ ఇందు వర్ణింపబడినది. ఈ గ్రంథము బెజ వాడకు రెండామడల దూరములోనున్న పరిటాల అను నొక సంస్థానమును పాలించు జూపల్లి వెంకటాద్రి యను నాతని కంకితము కావింపబడెను. 3. మల్లభూపాలీయము : ఇది సుప్రసిద్ధమైన భర్తృహరి సుభాషితమునకు ఆంధ్రానువాదము. సుభాషి త ము నాంధ్రీకరించిన ఇతరకవులలో పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణకవి అనువారలు ప్రసిద్ధులు. వీరిలో బాలసరస్వ తియే మొట్టమొదట సుభాషితమును తెనిగించినవాడు. అతడు తన అనువాద గ్రంథమునకు మల్లభూపాలీయమని పేరుపెట్టెను. 'సురభిమల్లా నీతివాచస్పతీ'- 'సురభి మల్లా మానినీ మన్మథా' - 'సురభి మల్లా వైదుషీ భూషణా' - అని నీతి శృంగార వై రాగ్య శతకములకు తగినట్లుగా మకుటము పెట్టి సురభి మల్లభూపాలునికి అంకితముగా ఈ గ్రంథమును రచించేను. ఈ సురభి మల్లభూపాలుడు హైదరాబాదు రాష్ట్రములోని జటప్రోలు సంస్థానమున కధీశ్వరుడైన వెలమనాయకుడు. 4. యాదవరాఘవపాండవీయము : ఇది యొక త్ర్యర్థి కావ్యము. శ్లేషతో నొక పద్యమును రచించినను కావ్యజ్ఞులు మెచ్చుదురట. పూర్తిగా నొక కావ్యమునకు కావ్యమే శ్లేషలో నిర్వహించినవారగుట పింగళి సూర 367 ఎలకూచి బాలసరస్వతి నార్యుడును, రామరాజభూషణుడును విశేష ప్రతిభా వంతులుగా కీర్తింపబడినారు. అట్టియెడ మూడర్థములు వచ్చునట్లు సంపూర్ణ శ్లేష ప్రబంధమును నిబంధించిన బాల సరస్వతి అసాధారణ ప్రజ్ఞాన్వితు డనుట అతిశయోక్తి కాదు. తెలుగులో వ్యర్థికావ్యమును రచించినవారిలో నీతడే ప్రథముడు. 5. బాలసరస్వతీయము : ఇది ఆంధ్రశబ్ద చింతామణి యను వ్యాకరణ గ్రంథమునకు వ్యాఖ్యానము. బాల సరస్వతి అఖండకీర్తికి హేతువై నదీ యుద్ధంథమే. ఆంధ్ర శబ్ద చింతామణి, కవితాయుగారంభకుడైన నన్నయ భట్టారకునిచే రచింపబడినట్లు భావింపబడుచున్నది. సూత్రా త్మకములగు ఆర్యాగీత్యుద్గీతి రూపములగు సంస్కృత శ్లోకములతో, ఐదు పరిచ్ఛేదములతో ఈ ఆంధ్ర వ్యాక రణము వెలయుచున్నది. డాలసరస్వతి శ్లోకగత సూత్రము లను విడదీసి, సూత్రార్థమును తెనుగులో వ్రాసి, పద నిష్పత్తిని చూపి వివరించెను. ఈ కలియుగములో ఆంధ్ర భాషకు చేకూరిన మొట్టమొదటి వ్యాకరణము ఈ ఆంధ్రశబ్ద చింతామణియే అనియు, అయ్యది నన్నయ భట్టారకునిచే రచింపబడెననియు, ఆ గ్రంథము చిర కాలము లుప్తప్రాయమైయుండి దై వచోదనమువలన తన కయ్యది యొక యోగివర్యుని మూలమున లభించె ననియు బాల సరస్వతి చెప్పెను. '.... మున్నొకనాడు విద్యానగరిలో నచింత్యకారణో పొగమ స్నేహసాహచర్యుండగు శివయోగివర్యునిచే దైవ చోదనం బరిప్రాప్తమైన ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథము నకు లోకోపకారార్థంబుగా టీక గావింపగోరి నెమ్మనమ్మున 'ఏమిమహాద్భుతంబిది హరి హరి ! యెక్కడి యాంధ్ర శబ్ద చిం తామణి పక్కి, యెక్కడి మతంగన గంబు యుగాది సంభవుం డై మని చన్న నన్నయ మహాకవి యెవ్వడు, సిద్ధుఁ డెవ్వ డా హా ! మదగణ్య పుణ్య సముద్రగతం జేరుటెఁ గాథేయిన్ని యున్.' 'ఇలఁ బ్రజ్ఞాధికులౌ కవుల్ మునుపు లేరే? వారు వ్యాఖ్యానక
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/408
స్వరూపం