ఎలకూచి బాలసరస్వతి మును అగ్రహారముగా బడసినట్లును బాలసరస్వతీయ పీఠికలోని ఈ పద్యభాగమువలన తెలియుచున్నది. "ఆతిరుమలేంద్రు డళియ రామావనీశ దత్త యెడవల్లి ముఖ్య సద్దాన హేమ చామర చ్ఛత్ర పల్యంకికా మణివి భూషుడై వై దుషీ స్ఫూర్తిఁ బొలుపుమించే" బాలసరస్వతి తండ్రియైన కృష్ణయార్యుడు ప్రఖ్యాత పండి తుడైయుండెను. ఆతడు 'పాకనాటి సకలవండిత కవి జనా చార్యుఁడై 'కీ ర్తి వహించినట్లు బాలసరస్వతియే ఉగ్గడించెను. తలిదండ్రులు - విద్యాభ్యాస వైదుష్యములు : బాల సరస్వతితండ్రి కృష్ణయ్య. తల్లి లక్ష్మమ్మ. ఈవై దిక బ్రాహ్మణవంశము వారిది కౌండిన్య గోత్రము. బాలసరస్వ తికి ఆదిత్యకవి అను నొకసోదరు డుండెను. ఈసోదరు లిరువురు తమ తండ్రి యొద్ద నే శాస్త్రాధ్యయనము గావించి పండితులైరి. విద్వద్వా తావరణములో పుట్టి పెరుగుటచే బాల్యమున నే విద్వాంసుడనిపించుకొని కృష్ణార్యుని జ్యేష్ఠ పుత్రుడు‘‘బాలసరస్వతి” యను ప్రఖ్యాత బిరుద నామమును వహించియుండునని పరిశోధకులు తలచుచున్నారు. బాల సరస్వతి అనునది సాధారణముగా తెలుగునాటి నామ ధేయమై యుండదనియు భావించుచున్నారు. నామము నామ ధేయముగా స్థిరపడుట ఆంధ్రులలో క్రొత్త గాదు. కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థాన పండితు డును, బహు గ్రంథకర్తయునగు అగస్త్యపండితుడు విద్యా నాథుడుగా ప్రసిద్ధుడైనట్లు పండితులు నిరూపించియే యున్నారు. బాలసరస్వతీ వ్యాకరణాది బహుశాస్త్రముల సభ్యసించెను. వేదాధ్యయనము గావించెను ఆయు ర్వేద బిరుద సంగ్రహ ఆంధ్ర నివాసము : ఎలకూచివారు కృష్ణాతీర వాసులు. కావు ననే ఆ ప్రాంతమందున్న పరిటాల (పర్తియాల)జటప్రోలు సంస్థానములలో వీరికి ప్రవేశ సన్మానములు లభించినవి. బాలసరస్వతీ తన చంద్రికాపరిణయ ప్రబంధమును పరిటాల రాజున కంకితము చేసెను. జటప్రోలు సంస్థానాధీశ్వరుడైన సురభిమల్ల భూపాలుని పేర భర్తృహరి సుభాషితములను తెలిగించెను. రసికుడగు మల్లభూపాలుడు బాలసరస్వతిని రెండువేల దీనారములతో బహూకరించెనట. విజయనగ రముకూడ వీరిలో కొందరికి ఉనికిపటై యుండెను. బాల సరస్వతి జ్యేష్ఠ ప్రపితామహుడు విద్యానగరములో నుండెను. బాలసరస్వతికి ఆంధ్రశబ్దచింతామణి లభించి నదియు విద్యానగరములోనే కావున నీ మహోపా ధ్యాయుడును కొంత కాలము విజయనగర వాసము గావించి యుండును. ఉనికిపట్టె 4 కాలము : బాలసరస్వతి క్రీ.శ. పదునారవ శతాబ్ది మధ్యమునుండి పదునేడవ శతాబ్ది ప్రథమ పాదమువరకును గల కాలమున నుండెను. ఈతనికి కొలది కాలము పిమ్మట నుండిన అప్పకవి తన గ్రంథారంభమును గురించి చెప్పుచు అయ్యది (క్రీ. శ. 1858నకు సరియగు ) శా. శ. 1578 మన్మథనామ సంవత్సర శ్రావణ బహుళాష్టమి (అనగా శ్రీకృష్ణాష్టమి) నాడు భగవదాదేశమున ఆరంభింపబడినట్లు నుడివెను. అంతియేగాక ఆ ఆంధ్రశబ్దచింతామణి గ్రంథ మంతకుముందే అనగా అప్పటికి సన్నిహితపూర్వమైన కీలక నామ సంవత్సరమున సిద్ధునిచే బాలసరస్వతికి అనుగ్ర హింపబడినట్లును, దాని కతడు బాలసరస్వతీయమను టీక ను రచించినట్లును చెప్పెను. అప్పకవికిని, బాలసరస్వతికిని దాదాపుగా ఏబది సంవత్సరములు కాలభేదముండు నన్నచో బాలసరస్వతికి పైన సూచించిన సరిపడును. అప్పకవి గ్రంథరచన చేసిన మన్మథ సంవత్సర మునకు వెనుక నుండిన కీలక సంవత్సరము క్రీ. శ. 1608 సంగీతములలో గూడ ఆమేధావి పాటవమును గడించి యున్నట్లుగా ఆతని యాదవ రాఘవ పాండవీయ గ్రంథా రంభమున 'వేదశాస్త్రపురాణ వివిధ సంగీత సాహిత్యాది వివిధో పబృంహణుండ’అని యుండుటవలనను, బాలసరస్వతీ యములోని 'బాహటస్థాన నిబంధ నుండ' అను వాక్యమువల నను తెలియుచున్నది. ఇన్నిట మహావిద్వాంసుడు కావుననే ఆతడు మహోపాధ్యాయ బిరుదాంకితుడై వాసికెక్కెను. బాలసరస్వతికి 'సకల భాషాకవితా స్వతంత్ర భట్టారకు'డను వేరొక బిరుదము కూడ మన్నట్లు బాలసరస్వతీయ పరిచ్ఛే సొంత గద్యములవలన విశదమగుచున్నది. ప్రాంతము కాగలదు. నిబంధనుండ 366 కాలము కావున బాలసరస్వతీయము క్రీ. శ. 1610లో వ్రాయబడియుండునని సంభావింప వచ్చును. ఈతని పూర్వుడయిన తిరుమలయ్య అళియరామ రాజుచే గౌరవింపబడుటయు దీనితో సంబద్ధమగుచున్నది. గ్రంథములు : బాలసరస్వతి బహుముఖమైన ప్రజ్ఞ గలవాడు. ఆతని లేఖిని కావ్యరంగములో పలుభంగిమలు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/407
స్వరూపం