విజ్ఞానకోశము- ౨
ఎరువులు
పచ్చి ఎరువు పైరులకంటే చాల అనుకూలము. ఇది త్వరగా ఎదిగి, దున్నిన వెనుక చాలత్వరగా చీకును, జనుము కొంచెమించుమించు అన్ని నేలలకును అనుకూలించును. కాని ఇది గరపనేలలలో బాగుగా నెదుగును. ఇది పశువులకు చాల రుచి కరమైన గ్రాసము. జీలుగ చవిటి భూములకును, పిల్లి పెసర
నల్లబంక నేలలకును, వెంపలి ఇసుక నేలలకును అనుకూలములై ఉండును. వరిపొలములయందు ఇవి యన్నియు 7 - 10 దినములలోను, తోట లేక మెట్టభూములయందు 4 - 6 వారములలోను చీకును పచ్చి రొట్టయందు నత్రజని నూటికి 0.5–1.0 పాళ్ళును, ఎండు రొట్టయందింతకు మూడు, నాలుగు రెట్లు అధికముగను ఉండును.
8. సామాన్యమైన ఇతర ఎరువులు: నదీ తీరము లందును, చెరువు గర్భములందును, లభించు వండలిమన్ను, తేలిక నేలలందు పెంచబడు వేరుసెనగ, జొన్న వంటి సస్యములకును, కొబ్బరి మొదలగు ఫల వృక్షములకును, ఎరువుగ ఉపయోగించును. పురాతన గ్రామములందలి పాటిమన్ను వరిచేలకును, నారింజజాతి తోటలకును, అరటి తోటలకును మంచి సత్తువ నొసగును. బియ్యపు మరలయందు లభించు వడ్లదూగర (Rice mill dust), చక్కెర కర్మాగారములయందు లభించు చెరుకురసపు తెట్టు (Scum), వడపోత పిట్టు (Filter presscake), చక్కెర పాకు (molasses), కర్మాగారములనుండి వదలివేయబడు మురుగునీరు, పట్టణముల మురుగునీరు (town sewage), మురుగు నీటిపిట్టు (sewage sludge), తోళ్ళ కర్మాగారములనుండి లభించు చెత్త (tannery refuse) మొదలగు వస్తువుల నన్నింటిని ఎరువులుగ ఉపయోగింపవచ్చును.
1. ఉత్పారపు టెరువులు: నత్రజనిని హెచ్చుగ కలిగియున్న జంతు, వృక్ష సంబంధమైన ఉత్సారపు టెరువుల యొక్క సంఘట్టనము ఈ క్రింది పట్టికయందు తెలుపబడినది.
| సంఖ్య | ఎరుపు | నత్రజని | స్సు. సం. | పొటాష్. |
|---|---|---|---|---|
| 1. | వేరుసెనగపిండి | 8.0 | 1.4 | 1.2 |
| 2. | ఆముదపుపిండి (పొట్టుతీసినది) | 6.4 | 2.6 | 1.2 |
| 3. | ఆముదపుపిండి (పొట్టుతీయనిది) | 4.5 | 1.9 | 0.7 |
| 4. | నువ్వుపిండి | 6.1 | 2.4 | -- |
| 5. | ప్రత్తిపిండి | 3.0 | 1.2 | -- |
| 6. | కొబ్బరిపిండి | 3.5 | 1.4 | -- |
| 7. | కుసుమపిండి | 3.2 | 1.2 | -- |
| 8. | కానుగపిండి | 4.2 | 0.9 | -- |
| 9. | వేపపిండి | 4.7 | 1.9 | -- |
| 10. | ఎండుచేపలు | 4.0 | 4.0 | -- |
| 11. | చమురు తీసిన చేపల ఎరువు(fish guano) | 7.8 | 7.8 | -- |
| 12. | రక్త వుపొడి | 11.0 | 2.0 | -- |
నత్రజనిని హెచ్చుగ కలిగియున్న పిండి ఎరువులలో వేరు సెనగపిండి, ఆముదపుపిండి ముఖ్యమైనవి. పిణ్యాకము లన్నిటిలోను వేరుసెనగ పిండియందు నత్రజని 'హెచ్చుగ గలదు. ఆముదపుపిండియందు స్ఫురత్సం చామ్లజనిదము కొంచెమధికముగా నుండుటయేగాక, దీని నుపయోగించు నేలలందు చెదలవాధ అంతగా నుండదు. వేపపిండి చవిటి భూములందలి చౌడు నణగగొట్టుటయేగాక, దానియందలి ఘాటువలన చెదల బాధ కూడ వారింపబడును. నూనెగింజల పిట్టులయం దెంత తక్కువ చమురున్న అవి అంత త్వరలో చీకి, పైరులకు ఉపయోగపడును. వీటిని వరి, చెరకు, పసుపు, మిర్చి, ఉల్లి, కూరగాయలు మొదలగు అనేక అవ్యసస్యములకును వాడవచ్చును. చేప ఎరువునందు