ఎరువులు
సంగ్రహ ఆంధ్ర
3. మానవుల మలమూత్రములు: మానవుల మల మూత్రములందు కూడ ఇతర జంతువుల మలమూత్రము లందు వలెనే కొంతసారముకలదు. కాని వీటి చెడువాసన వలన మనదేశపు కర్షకులు అసహ్యపడి వాటి సంతగా వాడుటలేదు. చైనా, జపాన్ మొదలగు కొన్ని దేశము లందు మలము, నెండబెట్టి, దానిని దుర్గంధము లేని ‘పూడెట్టు' (Poudrette) అనబడు ఎరువు; చేసి ఉపయోగించుచున్నారు. ఇటీవల మన దేశమునగూడ, మానవుల మలమును పట్టణపు వీథులచేత్తతో కలిపి, పొరలు పొరలుగ కుప్పలు పెట్టి, మధ్యనొకటి రెండుసార్లు వాటిని తిరుగ వేసి 45 మాసములలో దుర్గంధములేని ఎరువుగ తయారుచేయు చున్నారు. దీనికే పురీషపుచీకుడు ఎరువు (Night Soil Compost) అని పేరు. గ్రామపరిసరము లందుకూడ, మలవిసర్జనమునకు కాలువలనుతీసి, మలమును మట్టితో కప్పు తాత్కాలికపు దొడ్ల నేర్పరుచుకొన్నచో,
కొంతకాలమునకు ప్రశస్తమైన ఎరువు లభ్యమగును.
4. పందిపెంట : పంది వెంటయందు, పశువుల పేడ యందుకంటె నత్రజనియు, భాస్వరమును అధికముగ నుండును. దీనిని పశువుల ఎరువుతో కలిపి, కొంత చీకిన తరువాత వాడుట శ్రేష్ఠము. నీరు పెట్టి సాగుచేయబడు పలువిధములైన కూరగాయలు, ఉల్లి, చెరకు, తమలపాకులు మొదలగు సస్యములకుకూడ ఇది ప్రశస్తమైన ఎరువు. ఎండిన పంది పేంటను పొడిగా నలుగగొట్టి, వరి మొదలగు పైరులకు, పెరుగు చున్నపుడు గూడ పైన చల్ల వచ్చును.
5. గుఱ్ఱపు ఎరువు: గుఱ్ఱపు లద్దిలోకూడ పశువుల పేడయందుకంటె నత్రజనియు భాస్వరమును చాల అధికముగ నుండుము. గుఱ్ఱపుఎరువు బాగుగ చీకనియెడల, లబ్ధియందు జీర్ణము కాని వారపదార్థము ఎక్కువగా నుండుటచే, ఇది నేలయందు తగినంత నీరు పెట్టని యెడల వేడిని పుట్టించి, సస్యములను చెరచును. బాగుగ చీకిన గుఱ్ఱపు ఎరువు శీతకాలపు పూలజాతులకు కూరగాయలకు శ్రేష్ఠము.
6. చీకుడు ఎరువు : (Compost) చేత్తచేదారములు ముందుగ కొంత కాలము క్రుళ్ఫుటవలన ఏర్పడు ఎరువు 'చీకుడు ఎరువు' అనబడును. దీనిని తయారుచేయుటకు, పొలములయందు లభించు కలుపు మొక్కలు, పైరులు కోసిన తరువాత నిరుపయోగముగ మిగిలియుండు దుబ్బులు, ఇతర భాగములు . 2-3 అడుగులు లోతుగల గోతులలో నింపిగాని, నేలపై పోగులుగా గాని, పొరలు పొరలుగా గాని ఏర్పరచి, నీటితో తడుపుచుండవలెను. గోతులన్నియు చెప్తే చేదారములతో నింపునపుడు, ప్రతి రెండు చెత్తపొరలమధ్యను పేడనీటిని, పశువులశాలలలోని మూత్రముతో ఊరినమట్టిని, కట్టెల బూడిదను చల్లి, గోతి పైభాగమును పట్టితో కప్పిన యెడల, 3 4 నెలలలో ఈ చెత్త చీకి, సస్యముల కెరువుగా వేయదగినట్లుండును. ఇట్లు తయారుచేసిన చీకుడు ఎరువు యొక్క సంఘట్టనము కొంచెము ఇంచుమించు పశువుల ఎరువును పోలియుండును.
7. పచ్చి రొట్ట : అడవులయందును, బంజరుభూముల యందును, బాటల ప్రక్కలందును, పొలముల గట్లయందును, పెరుగు మొక్కల యొక్క పచ్చిరొట్టను ఎరువుగా ఉపయోగింప వచ్చును. వెంపలి, జిల్లేడు, తంగేడు, సీమ తంగేడు, (Glyricidia maculata) నేపాళము, అవిసె, కానుగ, నిద్రగన్నేరు, వేప, గంగరావి, మొదలగువాటి యొక్క పచ్చిరొట్టను ఇట్లు ఉపయోగించవచ్చును. సాధారణముగా పచ్చిరొట్ట వరిచేలయందే ఎరుపుగ ఉపయోగింపబడుచున్నది. కాని, తోటభూములలో కూడ తగినంత నీరు పెట్టుబడి పైరుచేయబడు కూరగాయలు, ఉరలగడ్డ, మిర్చి, అరటి, చెరకు, మొదలగు సస్యములకును, బాగుగా వర్షము కురియుచోట్ల జొన్న, గోధుమ, పొగాకు మొదలగు వర్షాధారమున పెరుగు మెట్ట సస్యములకును కూడ పచ్చి రొట్టను ఎరువుగా ఉపయోగింపవచ్చును. ఇది లభింపని కాలములయందును, ప్రదేశములందును, సీమచింత, తంగేడు, నిద్రగన్నేరు, దిరిసెన మొదలగు చెట్ల యొక్క రాలుటాకులు గూడ నీటి వసతి గల సస్యములకు ఉపయోగింపవచ్చును. ఇవిగాక కర్షకులు తమ పొలములందే జనుము, జీలుగ, సీమజీలుగ (Sesbania-speciosa), పిల్లి పెసర, నీలి, వెంపలి, బొబ్బర, ఉలవ, గోరుచిక్కుడు, మొదలగు కాయధాన్య కుటుంబ మునకు చెందిన జాతులను పచ్చి ఎరువునకుగాను ప్రత్యేకముగ పైరుచేయుటయు గలదు. ఇట్లు పెంచి, సత్తువచేయదలచిన పొలమునందే దున్ని వేయుటకు, జనుము తక్కిన