Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎరువులు దేశములలోను, ఇటీవల మనదేశములోను ఉపయోగింప బడుచున్నవి. ఎరువులను స్థూలమగు సామాన్యపు ఎరువులు (Bulky general manures) గను, ఉత్సారపు చెరువులు (concentrated manures) గను, విభజింపవచ్చును. పశువుల ఎరువు, పచ్చిరొట్ట మొదలగు స్థూలనుగు సేంద్రియపు చెరువులయందు సస్యములకు వలసిన నత్రజని, భాస్వరము, పొటాసియము మొదలగు ముఖ్యద్రవ్యములు స్వల్పపరిమితులలో నుండును. అందుచే వీటిని, కొద్ది భూమికై నను విస్తారముగా వాడవలసి యుండును. ఆదియునుగాక, వీటిని దూరపు పొలములకు గొనిపోయి వేయుట కొంత శ్రమతోకూడినపని. ఇవి భూమియందు నెమ్మదిగా పనిచేయుటచే, విత్తుటకు ముందుగనే వీటిని నేలపై చల్లి, మట్టితో కలిపి దున్న వలసియుండును. వీటి యందు సేంద్రియ పదార్థముకూడ ఎక్కువగా నుండుట వలనను, ఇవి నేలలోని ఉపయోగకరమగు సూక్ష్మజీవుల అభివృద్ధికి తోడ్పడుటవలనను, ఈ ఎరువులు నేలయందలి బలము నభివృద్ధిచేయుటయేగాక, అందలి భౌతిక లక్షణ ములనుగూడ బాగుపరచును. వీటిని వాడుటవలన, నేలల యొక్క నీటిని గ్రహించి, పట్టియుంచుశక్తి అధికమగు టయేగాక, నేల గుల్లబారి, పైరుల యొక్క వ్రేళ్ళు బాగుగా లోనికిపోవుటకు వీలగును. నేల గుల్లబారుట వలన వ్యవసాయపు పనిముట్లతో సాగుపనులు చేయుట కూడ చాల సులభము. మరియు వీటియొక్క సారము, వివరములు సంగ్రహ ఆంధ్ర మొదట వేసిన పైరున కేగాక తరువాత నొకటి రెండు పైరులకుకూడ లభించును. అమ్మోనియా గంధకిదము ammonium sulphate), అధిస్ఫురితము (super- phosphate) మొదలగు ఉత్చారములగు ఎరువులయందు ఒకటి రెండు ప్రధాన ద్రవ్యములు మాత్రమే ఎక్కువ పరిమాణము నందుండుటవలన, వీటిని దూర ప్రదేశములకు గూడ గొనిపోవుటయు, సస్యములకు చేర్చుటయుకూడ సులభము. వీటియందలి ఆహారద్రవ్యములు సాధారణముగా సస్యములు చురుకుగా పనిచేయుటచే పెరుగు. నారంభించిన తరువాతనే వీటిని వాడవలయును. స్థూలమగు సామాన్యపు జెరువులు: 1. పశువుల ఎరువు ; ఇది సర్వత్ర విరివిగా ఉపయోగింపబడుచున్న జంతు సంబంధమగు సామాన్యపు చెరువు. పశువుల యొక్క మలమూత్రములును అవి నివసించు శాలలలోని చెత్త చెదారములును కలిసి చీకుటవలన ఈ ఎరువు ఏర్పడును. పశువుల ఎరువునందు, సస్యములకు వలయు నాహార ద్రవ్యము లన్నియు కొంచె మించుమించుగా నుండును. వీటి యొక్క పరిమితులు ఎరువునందు చేరిన మలమూత్ర ములను బట్టియు, చెత్త చెదారముల యొక్క సంఘట్టన మును బట్టియు, సారము పోకుండ చీక బెట్టి వాటిని ఎరు వుగా మార్చు పద్ధతిని బట్టియు మారుచుండును. మనదేశము నందలి సాధారణ జంతువుల మలమూత్ర ముల సగటు సంఘట్టనము ఈ క్రింది పట్టిక యందు వివరింప బడినది. నత్రజని స్ఫురత్సంచామ్లజని తము P 26% K 20% 0.2 N% 1. పశువులు

వేడ 0.8 0.2 మూత్రము 0.9 స్వల్పము 1.0 ல் 2. పెంటికలు 0.9 0.6 స్వల్పము మూత్రము 1.7 స్వల్పము 2.2 8. మేక

వెంటికలు 0.7 0.5 స్వల్పము మూత్రము 1.8 స్వల్పము 2.5 4. గుఱ్ఱము అద్ది 0.6 0.4 0.8 మూత్రము 0.2 0.1 1.0 5. పంది వెంట 0.7 0.5 స్వల్పము మూత్రము 0.4 0.1 0.45 6. మనుష్యులు మలము 1.0 0.8 0.4 మూత్రము 0.8 0.1 0.2 354