Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము యెడల ఎముకలకు, కీళ్ళకు వచ్చు క్షయ మొదలగు వ్యాధులు రాకుండ నివారింపవచ్చును. అవి వచ్చిన పిమ్మట సాధారణముగ ఒకటి రెండుసార్లు శస్త్రచికిత్స చేయవలసి యుండును. మరియు ఆ వైకల్యమును సరిదిద్దుటకు దీర్ఘ కాల చికిత్స ఆవశ్యకమగును. ఎముక విరుగుట (ఫ్రాక్చర్): ఎముక విరుగుట మూడు రకములు. (1) సామాన్యముగ విరుగుట అనగా ఇందు ఎముక విరుగుట మాత్రమే జరుగును (2) ఎముక రెండుగా గాని అంతకన్న నెక్కువగా గాని ముక్క చెక్క లగుట, (B) బయటికి విరుగుట అనగా ఎముకలోని ఒక ముక్క చర్మములోనికి చొచ్చుకొనిపోవును. అందువల్ల గాయమగును. ఇట్టిది జరిగిన యెడల శస్త్రచికిత్స చేయుట అనివార్యము. ఇట్టిసంఘటన జరిగిన సాధ్యమైనంత త్వరలో రోగిని శస్త్రశాలకు తీసికొనిపోవలెను. గాయమును తా శుభ్రముచేసి విరిగిన ఎముకను సర్ది కుట్టి పట్టి వేయుదురు. జీవాణు వ్యతి రేక -ఔషధములను సూదిమందుద్వారమున ఉపయోగించవలెను. అందువలన క్రిమిజన్య విషదోషము (సెప్సిస్) ను నివారించుటకు వీలుకలుగును. కపొలము నందలి ఎముకలు విరిగిన మెదడునకును, ప్రక్క ఎముకలు విరిగిన ఊపిరితిత్తులకును, కటి ఎముకలు విరిగిన మూత్రా శయమునకును, వెన్నెముక విరిగిన వెనుబామునకును హాని సంభవింపవచ్చును. గాయము తగిలిన వ్యక్తిని ఆ ప్రదేశమునుండి కదల్చుటలో గూడ మిగుల జాగరూకత వహించవలెను. లేని ఎడల లోపలి భాగములస్థితి మరింత చెడును. ఇందులకు జరుగవలసిన చికిత్సలోని ప్రధాన విషయములు : (1) ఎముకలలో విరిగిన భాగములను యథాస్థానము నందు అమర్చవలెను. మైకముకల్గించు మందులను ఉపయో గించి ఈ పనిని చేయుట శ్రేష్ఠము. (2) విరిగిన అవయవమువద్ద పట్టికట్టవలెను. వెన్నె ముక విరుగుట సంభవించినయెడల రోగి పట్టికట్టుయొక్క ఆధారముపై పరుండి యుండవలెను. (8) విరిగినతునుకలు యథాస్థానములో నున్నవో లేవో తెలియుటకుగాను యక్సురే చిత్రమును తీయించవలెను. అట్లు లేకున్నచో మైకము కల్గించు మందులను ఉపయో గించి వానిని యథాస్థానమునకు తేవలయును. 349 ఎముకలు - కీళ్ళు (4) అట్లు సాధ్యము కానియెడల ప్రత్యక్ష శస్త్రచికిత్స చేసి వాటిని యథాస్థానమునకు రప్పింపవలెను. (5) పట్టి వేసినపిమ్మట అనవసరపు ఒత్తిడి లేకుండుటకు మిగుల శ్రద్ధతీసుకొనవలేను. చేతివ్రేళ్ళును, కాలివ్రేళ్ళును వెచ్చగానుండవలెను. రోగి వాటిని స్వేచ్ఛగా కదుపుటకు అవకాశముండవలెను. (6) బాధను నివారించుటకు మొదట కొన్ని దినములు ఔషధములు ఉపయోగింపవలెను. సాధారణముగా ఎముకలు కలియుటకు మూడు వారములు పట్టును. ఆ పిమ్మట అవి దృఢమగుటకు మరి 3 లేక 4 వారములు పట్టవచ్చును. ఈకాలమందంతటను రోగి తన కాళ్ళ యొక్కయు చేతుల యొక్కయు వ్రేళ్ళను కదలించునట్లు ప్రోత్సహించవలెను. ఇందుమూలమున కండరములు క్షీణించకుండుటకు, పట్టి ఊడదీయగానే రోగి తన మామూలు పనులను నిర్వ ర్తించుకొనుటకు అవకాశము కలుగును, స్థానము తప్పుట (డిస్లో లొకేషన్) : ఇది గాయము తగులుటవలనగాని, వ్యాధులవలనగాని సంభవించును. దెబ్బ తగిలినయెడల భుజపుకీలు ఉపరిభాగము పాత్రనుండి బయట పడును. తుంటి కీలునందు తొడ యెముక యొక్క ఉపరిభాగమును క్షయవ్యాధి తినివేయుటవలన స్థానము తప్పును. దెబ్బవలన స్థానము తప్పినయెడల దానిని మైకము కల్గించు మందులను ఇచ్చి యథాస్థానమునకు రప్పింపవలెను. రోగమువలన ఉపరిభాగము తినివేయ బడినయెడల పట్టి వేసి దీర్ఘకాలము విశ్రాంతినిచ్చి మొదట వ్యాధికి చికిత్స చేయవలసియుండును. ఆ పిమ్మట కృత్రిమ మైన ఉపరిభాగమును అమర్చవచ్చును. లేదా స్థానము తప్పుటను అట్లేయుంచి ఆ అంగవైకల్యమునకు సరియైన శస్త్రచికిత్స చేయవచ్చును. భుజపుకీలు స్థానము తప్పుట 'తరచుగా జరుగుచుండును. మాటి మాటికి ఇది జరిగిన యెడల శస్త్రచికిత్స అవసరమగుచుండును. కీళ్ళకు గాయములు తగులుట: తుపాకీ దెబ్బవలన గాని, లేక కీలును ఏర్పరచు ఎముక కొనలు విరుగుటవలన గాని కీళ్ళకు గాయములు తగులును. కీలులో రక్తము చేరును, దానిని సరిచేసి అవయవముపై పట్టి వేయవలెను. అందుమూలమున వారద్వారమున కానీ, ధాతువు ద్వార i