Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎముకలు - కీళ్ళు

సంగ్రహ ఆంధ్ర

(ఎడమతట్టునుండి వెన్నెముకను చూచినచో కానవచ్చు.దృశ్యము (1) మెడలోనివెన్నెముకలు- 3 (2) ఛాతీలోనుండు వెన్నెముకలు —12 (3) నడ్డిపూసలు - 5 (4) త్రికాస్థులు - 5 (ఒకటిగా కలిసినవి) (5) గుదాస్థులు - 3

ముక అను పేరుగల ఎనిమిది వెన్నెముకల యొక్క కలయికచే నేర్పడుచున్నది.

ఛాతి ఎముకలు: ఆ క్రిందగల పన్నెండు వెన్నెముకలను ఛాతీ వెన్నెముకలు అందురు. ప్రతి నైపునను పండ్రెండేసి ప్రక్క యెముకలు (Ribs) ఉండును. అవి వెనుక ప్రక్కన ప్రారంభమై కీళ్ళద్వారమున ప్రతి జతయు వెన్నెముకకు కలుపబడును, మరియు ముందుకు చొచ్చుకొని వచ్చి కోమ లాస్థి యొక్క బాహ్య మగు వెన్నెముకతోపాటు కీళ్ళ యందలి రొమ్ము ఎముకతో చేర్చబడును, దీనినే ఉరోస్థి(Sternum) అందురు. 'పైభాగమునగల ఏడు మాత్రమే ఈ విధముగా చేర్చబడును. ఆ తర్వాత మూడును వెనుక వైపునగల వెన్నెముక తో చేర్చబడును. కాని అవి ఉరోస్థితో సరిగా చేర్చబడక పై వైపునగల ఎముక యొక్క కోమలాస్థితో చేర్చబడును. ఇవి ఈ విధముగ కడుపు యొక్క పై భాగపు సరిహద్దును ఏర్పరచును. చివరి రెండు ప్రక్క ఎముకలు చిన్నవి. అవి వెనుక ప్రక్కనుగల 11వ 12వ కశేరుక పిండములతో చేర్చబడినవి. కాని అవి ముందరి వైపున "స్వేచ్ఛను కలిగియున్నవి. వీటినే కృత్రిమములగు ప్రక్క ఎముకలు అందురు. ప్రక్క ఎముకల మధ్య గల కాళీస్థలము ఇంటర్ కోస్టల్ కండరములచే నిండి యున్నది. ఈ విధముగా ఎముకలచే ఒక పంజరము తయారగుచున్నది. అందు ఊపిరితిత్తులు, హృదయము, మహావాహికలు (great vessels) నిక్షిప్తములయినవి. కడుపులోని కశేరుకపిండములు: కడుపు ప్రాంతము యొక్క వెన్నెముకను ఏర్పరచునట్టియు నడుమునకు సంబంధించినట్టియు స్థూలమగు కశేరుక పిండములు అయిదు గలవు.

కటి (Pelvis) : కటిప్రాంత మొక పేటిక, ఇందులో జననేంద్రియములు, మూత్రపుతిత్తి, మలపుగొట్టము (Rectum) కలవు. పైనిగల పొత్తికడుపునకు సరసనే ఇది యుండును. వెనుకటిభాగము 5 కశేరుక పిండముల యొక్క సమ్మేళనము వలన ఏర్పడును. దీనినే త్రికాస్థి (Sacrum) అందురు. ఈలియం, ఇస్కియం, ప్యూబిస్ అనునవి ఏకమై కటియొక్క ప్రక్క గోడలను, ముందు గోడలను ఏర్పరచును. మనము ఇస్కియంపై కూర్చుందుము. తుంటి ఎముక యొక్క త్రికాస్థికి ' సేక్రోయిలి యేక్కలు' అను పేరుగల కీలు చేర్చబడి యుండును. ప్యూబిక్ ఎముకలు, ముందు ప్రక్కన కలియును. అవి ఒక అర్ధచంద్రాకారమును ఏర్పరచును. దానినే ప్యూబిక్ అర్ధచంద్రా కారమందురు. ప్యూబిక్ అర్ధచంద్రాకారము క్రింద ఇరుప్రక్కల ఇస్కియల్ ఎముకలు కలవు. ఇది కటికి బహిర్ద్వారము. బాహ్య జననేంద్రియము లిందే గలవు. స్త్రీల యొక్క కటి, ప్రసవసమయమున శిశువుబైటికి పోవుటకు వీలగునట్లుగ వైశాల్యము కలిగియుండును.

గుదాస్థి (కాక్ సిక్సు); ఇందు చిన్ని కశేరుక పిండములు 3 గలవు. జంతువులలో ఇది పెద్దదిగా నుండి తోక క్రింద మారును. పై న వర్ణింపబడినట్లు కశేరుక పిండము లన్నియు ఒక దానిపై నొకటి అమర్పబడి యున్నవి. ప్రతి కశేరుక పిండమునకు ముందువైపున శరీరము, వెనుక వైపున అర్ధ చంద్రాకారవలయము ఉండును. ఆ అర్ధ చంద్రాకారపు నడుమనుండి ఒక మజ్జవంటి కూటము ఉద్భవించును. మన మెడ మధ్యలో అది యన్నట్లు మనకు స్ఫురించుచునే యుండును. మొదటి మృగశీర్షకంధర పూస (అక్సిస్ మరియు అట్లాస్) కు శరీర ముండదు. మొదటి రెంటికి మజ్జారూప కూటము లుండవు. చుట్టును కప్పబడిన పేటిక యుండును. ఈ రంధ్రములో వెనుబాము మెదడునుండి ప్రారంభమై కడుపులోని రెండవ కశేరుక పిండము వరకు వ్యాపించును. వెనుబాము సన్నని పొరచే కప్పబడి యుండును. దీనినే డ్యూరా అందురు. ఈ పొర రెండవ త్రికాస్థి కశేరుక పిండమువరకు ఉండును. వెనుబామునకును డ్యూరాకును మధ్య డ్యూరాకును మధ్య ఒక విధమైన