విజ్ఞానకోశము ఎన్నికలను సక్రమముగ జరిపించుటకుగాను మన రాజ్యాంగ విధానమందు ఎన్నికల కమీషనర్ అను పేర ఒక ఉన్నతో ద్యోగి నియమింపబడి యున్నాడు. 9. ఎన్నికల మూలమున కలుగవలసిన ప్రయోజన ములు రెండు మూడు కలవు. అవి లభించినప్పుడే ఎన్ని కలు సార్థకములైనవని చెప్పదగియున్నవి. (1) రాజకీయ విషయములలో ప్రధానాంశములను గురించి ప్రజల యందుండు ముఖ్యమైన అభిప్రాయములను వ్యక్తపరచ గల సభ్యులు ఎన్నుకొనబడుట మొదటి ప్రయోజనము. వోటుచేయుటకు హక్కు గలవారిలో అధిక సంఖ్యాకులు ఎన్నికలలో పాల్గొన్నప్పుడు ఈ ప్రయోజన మేక్కువగ లభించుచున్నది. అజ్ఞానము వలనను, అలసత్వమువలనను నిరుత్సాహము వలనను, వోటర్లలో అనేకులు ఎన్ని కలలో పాల్గొనకపోవుట సంభవించుచున్నది. 1952 లో మన దేశ మందు జరిగిన ఎన్నికలలో 40.40% వోటర్లు మాత్రమే పాల్గొనిరి. ఇది జరుగరాని విషయము. (2) మన రాజ్యాంగమువంటి రాజ్యాంగముగల దేశము లలో... పార్ల మెంటరీ విధానము ననుసరించువానిలో --- ఎన్నికలు ఎవరు శాసన సభ్యులుగ నుండవలెనో నిర్ణ యించుట కేగాక ఏపథములవారు మంత్రులుగ దేశ పరి పాలనము గావించవలెనో నిర్ణయించుటకుకూడా ఉద్దే శింపబడి యున్నవి. ఏదో ఒక పక్షము మెజారిటీ బలముతో ఎన్నుకొనబడునప్పుడే ఈ ఉద్దేశము సులభసాధ్యమగును. అట్లుగాక ఎన్నికల ఫలితముగ రెండుమూడు పార్టీలు సమానసంఖ్యాబలముతో శాసన సభకు వచ్చినప్పుడు మంత్రివర్గ నిర్మాణము కష్టసాధ్యమగుచున్నది. ఎన్నికలు సార్థకములై నవా అన్న విషయమును విమర్శించునప్పుడు మంత్రివర్గ నిర్మాణమునకు సంబంధించిన ఈ అంశమును గమనించవలసి యున్నది. (8) ఎన్నికల మూలమున కలుగ వలసిన ప్రయోజన మింకొకటి యున్నది. రాజకీయ విషయములను గురించి. సామాన్య ప్రజలలో జ్ఞానము, చైతన్యము వ్యాపించుటకు ఎన్నికలు ప్రధానసాధనములు. ఎన్నికల కాలమున జరుగు ప్రచారము దీనికెంతో తోడ్పడుచున్నది. ప్రతి నియోజకవర్గమందు అభ్యర్థులు పోటీ చేయునప్పుడే ఇట్టి ప్రయోజనము లభించగలదు. వివిధ పథములవారు గావించు ప్రచారమును వినుటకు: 1 343 ఎమండ్సెన్ – రోల్డు (క్రీ. శ. 1872-1928) వోటర్లందరికి అవకాశముండవలెను. పోటీలేకను, ఏక గ్రీవముగను ఎన్నిక జరిగినపుడు ఇట్టి అవకాశ ముండదు. మా. వెం. రం. ఎమండ్సెన్ - రోల్డు (క్రీ. శ. 1872-1928) : ఈయన నార్వే దేశస్థుడు. బోర్గియను గ్రామములో క్రీ. శ. 1872 జులై 16 వ తేదీయందు జన్మించెను. ఆన్లోలో విద్యాభ్యాసము ప్రారంభించి 1890 లో బి.ఏ. (డిగ్రీ) పట్టము పొంది, 1894 లో నౌకాయానవృత్తిలో ప్రవేశించినాడు. ఇతడు ఉత్సాహవంతుడగు యువకుడు. 1908 జూన్ 17వ తేదీయందు "జో" అను 47 టన్నుల పెట్రో లియం మోటారు లాంచిలో, ఆస్లోనించి, ఆరుగురితో నేర్పడిన సహాయ సిబ్బందితో, ఉత్తరధ్రువ కేంద్రమును నిర్ణయించుటకై బయలుదేరెను. డెన్మార్కు దేశస్థుడగు హేన్సన్ ఇతని సహాయులలో నొకడుగా నుండెను. కింగ్ విలియం అను దీవిలో పీటర్సన్ అఖాతములో నున్న "జో" అను రేవు పట్టణములో ఆ సంవత్సరము చలి కాలము గడ ఫెను. ఇచ్చట రెండు సంవత్సరముల కాలము నివసించి, కుక్కలచే లాగబడు బండ్లలో, మంచు గడ్డలపై ప్రయాణము చేసి 72° శము వరకుగల ప్రదేశములో పరిశోధనములు సలిపెను. "విక్టోరియా" అను ఉత్తరధ్రువ ప్రాంతమందలి దీవిని ఇతడు సమగ్రముగ పరిశీలించెను. 1905 ఆగస్టులో "జో" నుంచి బయలు దేరి కెనడా ఉత్తర ప్రాంతమును ఇతడు చేరుకొనెను. "కింగ్ పాయింట్" అను ప్రదేశ మువద్ద మంచులో ఇరుకుకొనిపోయి, ఒక ఒక సంవత్సర కాలము అచ్చట గడపెను. 1906 జులై 11 వ తేదీయందు ఉష్ణ ధారల ప్రభావమువలన మంచులో నుంచి వెలువడి, వెట గోనియాకు ఉత్తర దిశగా, అమెరికా భూఖండమును 323 అను దాటి, అసియా అమెరికాలమధ్య “బేరింగు" జలసంధి ద్వారమున పసిఫిక్ మహాసముద్రములోనికి ఇతడు వయ నించెను. అట్లాంటిక్ మహాసముద్రమునుండి బయలు దేరి ఉత్తర ధ్రువప్రాంతముద్వార పసిఫిక్ సముద్రములోనికి కావింపబడిన ప్రప్రథమ ప్రయాణమిదియే. 1918-21 ల మధ్య కెప్టెన్ రోల్డు ఎమండ్సెన్, “మాడ్" అను పడవలో ఈశాన్యదిక్కుగా, సైబీరియాకు ఉత్తర దిశగా పయనించి, అలాస్కా దేశమును చేరుకొనేను. ఈ
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/384
స్వరూపం