Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎన్నికలు మున్నదో ఆ దామాషాన, శాసనసభలోని స్థానములు వాటికి చందుటయే యుక్తమని కొందరి అభిప్రాయము. వోటుచేసినవారిలో నూటికి నలుబదిమంది కాంగ్రెసుకు వోటు చేసినయెడల శాసనసభలోని స్థానములలో నూటికి నలుబది స్థానములు ఆ పార్టీవారికి లభించుట ధర్మమనియు, అంతకంటె ఎక్కువగాని, తక్కు వగాని లభించుట ధర్మ విరుద్ధమనియు వారి వాదము. దీనిమూలమున ప్రజలలో ఎన్ని అభిప్రాయ భేదములు ముఖ్యముగ నున్నవో వాటిలో కొన్ని మాత్రమేగాక అన్నియు శాసనసభలో ప్రతిబింబితమగుటయు, నిజమైన ప్రజాభిప్రాయానుసారము ప్రభుత్వము సాగుటయు జరగగలదని వారి విశ్వాసము. ఈ సిద్ధాంతములో గుణములతోపాటు దోషములు కూడ కొన్ని యున్నవి. కాని ఏక పార్టీ నిరంకుశత్వమును తొల గించుటకును అధికారములోనుండు పక్షము యొక్క కార్యక్రమమును విమర్శించగల ప్రతిపక్షములు బలపడు టకును ఇది కొంత సహాయకారిగ నుండగలదు. రాజ్యసభ ఎన్నికలందును, రాష్ట్రపతి ఎన్నికయందును దామాషా సిద్ధాంత మనుసరించబడుచున్నది. ట 7. దేశములో జరుగు ఎన్నికలలో కొన్ని ప్రత్యక్ష ములుగను, కొన్ని పరోక్షములుగను ఉన్నవి. ఎన్నుకొస వలసిన సభ్యులను స్వయముగ ప్రజలే ఎన్నుకోనుట ప్రత్యక్షపు ఎన్నిక. లోకసభకు జరుగు ఎన్నిక ఇట్టిది. ఇట్లుకాక, ప్రజలెన్నుకొన్న సభవారు ఇంకొక సభాసభ్యు లను ఎన్నుకోనుట పరోక్షపు ఎన్నిక. రాజ్యసభకు జరుగు ఎన్నిక ఇట్టిది, ప్రజలు రాష్ట్రములోని శాసనసభను ప్రత్యక్ష ముగ ఎన్నుకొనుటయు, ఆ శాసనసభాసభ్యులు రాజ్యసభ వారి నేన్నుకొనుటయు జరుగుచున్నది. ప్రజలకును, రాజ్య సభకుమమధ్య రాష్ట్ర శాసనసభ యొకటి యుండుటచేత " రాజ్యసభలో ప్రజలకుగల సంబంధము ప్రత్యక్ష సంబంధము కాదు. అనేకములైన ఎన్నికలలో పాల్గొనుట ప్రజలకు విసుగుగ నుండుననియు, శాసనసభలో రెండుశాఖలున్న ప్పుడు వాటిదృక్పథములో భేదము కల్పించుట అవసర మనియు, ఒక శాఖను ప్రత్యక్షముగను, మరియొక దానిని పరోక్షముగను, ఎన్నుకొన్నప్పుడు ఇట్టి అవసరము తరుగ గలదనియు పరోపు ఎన్నికలు తక్కువ ఖర్చుతోడను, తక్కువ శ్రన్ధుతోడను కూడుకొన్న వనియు, అందుచేతకొన్ని 342 సంగ్రహ ఆంధ్ర సందర్భములలో పరోక్ష విధాన మనుసరణీయమనియు కొందరి అభిప్రాయము. ప్రజలు గ్రామపంచాయతీలను మాత్రమే ఎన్నుకొనవలెననియు, గ్రామపంచాయతీలు జిల్లా పంచాయతీలను, జిల్లా పంచాయతీలు రాష్ట్ర సభ లను, రాష్ట్ర సభలు కేంద్రసభలను ఎన్నుకొనవలెననుట పరోక్షపు ఎన్నికల సిద్ధాంత ప్రాబల్యమే. శాసనసభలలో ప్రధానతమములకు ప్రత్యడపు ఎన్నికలే తగినవి. అప్పుడు గాని అవి ప్రజలయెడ బాధ్యతతో ప్రవర్తించుట జరుగదు. 8. సక్రమములని చెప్పతగ్గ ఎన్నికలకు కొన్ని ప్రధాన లక్షణములున్నవి. రాజ్యాంగరీత్యా ఎన్నికలలో పాల్గొను టకు హక్కుగలవారి పేర్లన్నియు వోటర్ల జాబితాలలో నమోదు కావలెను. హక్కు లేని వారి పేర్లు అందులో ఉండరాదు. ఇది పూర్తిగ జరుగుటకు వోటర్ల జాబితాలను తయారుచేయు అధికారులతో రాజకీయ పక్షములవారు సహకరించవలెను. దేశములోని వివిధ రాజకీయపక్షముల వారికి ప్రచారము గావించుటకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండవలెను. అభ్యర్థులుగ నిలచినవారి విద్య, వృత్తి, ప్రజా సేవ, సుగుణసంపత్తి మొదలగు వాటిని గురించి పూర్తి వివరములు వోటర్లకు తెలియునట్లు ప్రకటితములు కావలెను. కొన్ని నియోజక వర్గములు మిక్కిలి పెద్దవిగను కొన్ని మిక్కిలి చిన్న విగను ఉండక అన్నియు సాధ్యమైనంతవరకు సమానసంఖ్యగల వోటర్లతో కూడియుండవలెను. ఎన్ని కలు జరుగుటకు నిర్ణయింపబడిన దినములు, ఏర్పరుప బడిన ప్రదేశములు (Polling booths) ఓటర్లకు అను కూలముగ నుండవలెను. ఎన్నిక లను నడిపించు అధి కారులు పక్షపాత రహితముగను, బెట్టుగను ప్రవర్తించవలెను. ఓటర్లు లంచములకు లోబడక ఓటుచేయవలెను. రాజకీయ పక్షములుగాని, ప్రచారము చేయువారుగాని, వోటర్లు గాని చట్టవిరుద్ధములగు మార్గముల ననుసరించకూడదు. నోట్లను లెక్క బెట్టువారు చట్టసమ్మతముగ వారి పనులను నిర్వర్తించవలెను. ఎన్నిక ఫలితములను గురించి వివాద 'ములు సంభవించినపుడు వాటిని పరిష్కరించుటకు తగిన న్యాయస్థానము లుండవలెను. అధికారములో నుండు రాజకీయపథములుగాని, మంత్రివర్గముగాని వోటర్ల స్వేచ్ఛకు భంగము కలిగించరాదు. ఇన్ని నియమములకు లోబడినప్పుడే ఎన్నికలు సక్రమములని చెప్పదగియున్నవి.