Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము – ౨

ఎన్నీకల చట్టములు


వారసత్వరిత్యా కుమారునకు రాజ్యము నంద జేయుటయు, ప్రజలు సమ్మతించుటయు జరుగుచుండెడిది. నేటి ఆధునిక ప్రపంచములో రాచరికము దూష్యమై ప్రజాయత్తరాజ్యతంత్రము ఉత్తమమని నమ్మకము కలుగు చున్నది. ప్రజాయత్త రాజ్యమునకు ఎన్నిక విధానము ముఖ్యబీజము.

ప్రభుత్వోద్యోగులు తప్ప మిగిలిన వారెల్లరు ప్రభుత్వ నిర్వహణమునందు ఎన్నుకొనబడవలసిన వారలే. లోక శాసన సభలయందును, రాష్ట్ర శాసన సభలయందును, పురపాలక సభలయందును, వ్యాపారవర్తక సంఘసభల యందును సభ్యులెల్లరు ఎన్నికరూపమున అధికారమును పొందుచున్నారు. ముఖ్యముగా రాజ్యాంగ, శాసనసభల యందు ఎన్నిక విధానము చట్టరీత్యా ప్రతిష్ఠింపబడినది. రాజ్యాంగప్రణాళికలు తెలిపినరీతిగా భారతదేశమునందు యుక్త వయస్సుగలిగిన ప్రతివ్యక్తియు (21 సం. మించినవారు) స్త్రీ, పురుష, మత, జాతి, అధిక, నీచ, ధన, ధన హీన, భేద భావము లేకుండ ఎన్నిక విధానమునందు పాల్గొ నుటకు అధికార మివ్వబడినది. భారతదేశమున స్వతంత్రత చేకూరగనే యెన్నిక సమస్యలో ప్రథమ సోపానముగా 1950 లో "లోకసభ" వారు (Act 41 of 1950) చట్టమును శాసించి యున్నారు. ఈ చట్టరీత్యా భారత భూమిలో నున్న యెన్నిక దారులనందరిని (వోటర్లు) జాబితాలలో చేర్చి ప్రతి ప్రాంతమునందును ప్రభుత్వ యాజమాన్యము క్రింద అచ్చొత్తింపబడినవి. ఈ జాబితాలో ప్రతీయుక్త వయస్కుడు ఎన్నిక దారుడుగా పేర్కొనబడి గుర్తునిమిత్తము తండ్రి పేరు - వయస్సును - నివసించు గ్రామమును కలిగియుండును. ఈ జాబితాలోనుండు పొరపాట్లను గురించి సవరణచేయుటకు జిల్లా యధికారులకు అధికార మివ్వబడినది. ఏ వ్యక్తి వేరైనను ఒకటికిమించి పెక్కు జాబితాలలో పేర్కొనబడినచో, ఆవ్యక్తికి ఏ 'యొక్క ప్రదేశమునందు మాత్రమే 'వోటు' (నియోజన చేయు) చేయు అధికారము గల్గియుండును.

1951 లో (Act 43 of 51) ఎన్నికల విధానమును గురించి శాసనము లోకసభలో చేయబడ్డది. ఈశాసనరీత్యా ఎన్నికకు ముఖ్యములు ఏవియనః నామనిర్దేశము (నామినేషను), ఉపసంహరణ, వోటుచేయుట (ఎన్నిక, లెక్కింపు, ప్రకటన,

ఇరువదియైదు సంవత్సరములు మించిన వయస్కులే, రాష్ట్ర, కేంద్రశాసనసభలకును, ముప్పదియైదుకు మించిన వారలు కేంద్ర శాసనసభలకును, సభ్యత్వము పొందదగినవారు. వీరు భారతదేశములో ఏ నియోజక వర్గమునకయినను చెందిన వారలై యుండవలయును. ప్రతిసభ్యుని నామనిర్దేశమునకు (నామినేషను) ఆయా నియోజక వర్గములనుండి ఒక యుక్తవయస్కుడు ప్రతిపాదింప వలయును. మరియొక యుక్తవయస్కుడు బలపరచ వలయును. వీరిరువురును ఆ నియోజక వర్గ జాబితాలో నియోజకుడు (వోటరు) గా నుండి తీరవలయును. ఒక యభ్యర్థి పెక్కు నియోజకవర్గములలో పోటీచేయు నవకాశము కల్గియుండగలడు. ప్రతి నామనిర్దేశమునకు పూర్వమే రాష్ట్ర సభలకు రు. 250- లోకసభకు రు.500- రుసుము ప్రతియభ్యర్థియు ధరావతుగా చెల్లించవలయును. నామ నిర్ధేశపత్రముల నన్నింటి నొక సాంకేతిక సమయమందు నియోజకాధికారి యభ్యర్థుల సమక్షములో పరిశీలించి దోషములున్నచో ఈనాము నిర్దేశ పత్రములను రద్దు చేయవచ్చును. చట్టసమ్మతమైన యభ్యర్థి పత్రములను మాత్రమే స్వీకరించి ఎన్నికలకు అర్హత కల్గియున్న వారుగా ప్రకటించును. ప్రతియభ్యర్థియు ఎన్నికల సాంకేతిక చిత్రములలో (symbols) నొకటినో రెంటినో పేర్కొన వలయును. ఉపసంహరణమునకు కొద్దివ్యవధి ఇవ్వబడును.ఆకాల వ్యవధిలో అభ్యర్థులు ఉపసంహరించు కొనుటకు అవకాశమున్నది, ఎన్నికల ప్రకటనానంతరము నియమింపబడిన తేదీలో ప్రతి నియోజక వర్గములోను ఖండ ఖండములుగా ఎన్నిక కేంద్రములను తగు రక్షణలతో స్థాపింపబడి యొక యెన్నికల అధికారికి స్వాధీనము చేయబడి యుండును. జాబితాలో పేర్కొనబడిన ఆయాస్థల నియోజకులు ఆ సాంకేతిక దినమునందు క్రమబద్ధముగా ఒకరివెంట నొకరు లోపలికిపోయి యభ్య ర్థులకు వేరువేరుగా నిర్దేశింపబడిన సాంకేతిక చిత్రములతో (Symbols) సూచింపబడు ఎన్నికల పెట్టె లకు పైభాగముననున్న రంధ్రములో వారివారి ఇష్టానుసారముగా ఎన్నిక చీటివి ఉంచవలయును. ఈవిధాన మందు ఏవ్యక్తి యెవరి పెట్టెలో చీటీ వదిలివచ్చినది తెలియకుండునట్టి రహస్యము రక్షింపబడవలెనను సిద్ధాంతము