Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎన్నికల చట్టములు హెచ్చరికపై ఫిట్టిరాల్డు పట్టుబడకుండ తప్పించుకో నేను. పూర్తిగా తప్పించుకొని పారిపోవు అవకాశముండి కూడ తానే వారిని ప్రమాదస్థితిలోనికి నడిపినందున తన యనుచరులను విడిచివెళ్ళుటకు ఆయన నిరాకరించెను. మార్చి 30 వ తేదీన సైనిక శాసనము అమలులోనికి వచ్చెను. ఫిట్టిరాల్డును పట్టుకొనువారికి 1000 పౌనులు బహు మతిగా నియ్యబడునని ప్రకటించబడెను. ఫిట్టిరాల్డు డబ్లిన్ నగరములో ఒక మిత్రునియింట దాగియుండెను. కానీ బహుమతికి ఆశపడిన మాగన్ అను నతడు ఈ రహస్య మును బయట పెట్టెను. మేనెల 18 వ తేదీన ఫిట్టిరాల్డు వ అరెస్టు చేయబడెను. అరెట్టుకుముందు జరిగిన సమర ములో నతడు తీవ్రముగా గాయపడెను. తుపాకి దెబ్బలు కూడ తగిలినవి. న్యూగేటు జైలులో నుంచబడ్డాను. ఆ గాయములతో అక్కడనే ఇతడు 1798 జూన్ 4వ తేదీన మరణించెను. ఆయన ఆస్తిని స్వాధీన పరచుకొనుటకు ఒక శాసనము జారీచేయబడెను. భ ర్త మరణించక పూర్వమే దేశమును విడిచివెళ్ళవలసినదిగా అతనిభార్య ఆదేశించబడెను. పమేలా హాంబర్లు వెళ్ళి 1800 లో జె. పిట్ కైరన్న వివాహము చేసికొనెను. అయినను చనిపోవు వరకు ప్రథమభర్తను స్మరించుచు అతనిపట్ల భక్తి ప్రవృత్తులను కలిగియుండెను. ఆమెకు ఫిట్టిరాల్డువలన ముగ్గురు పిల్లలు కలిగిరి. పిన్నవయసులోనే ఇంతటి సాహసకార్యములకు దిగిన ఫిట్టిరాల్డు పొట్టిగా, అందముగా నుండెడివాడు. అతని చక్కని మూర్తిత్వము, ప్రేమ, ఉదారబుద్ధి కుటుంబ సభ్యులందరి ప్రేమకు పాత్రమైనవి. కాని ప్రజలలో తాను చేయబూనిన సాహసచర్యలకు అవసరమగు కఠిన లక్షణ ములు ఆయనలో లేకుండినవి.. కపట మెంతమాత్రము లేక నిర్భయముగా వ్యవహరించెడివాడని రీష్ హార్డు వ్రాసినాడు, ఫిట్టిరాల్డు జీవితమునుగూర్చి థామస్ మూర్, మార్టిన్ మాక్ డెర్మాత్, ఐ. ఏ. పేలరు మున్నగువారు పుస్తక , ములను వ్రాసిరి కం. కా ఎడ్విన్కానన్ : సంగ్రహ ఆంధ్ర ప్రసిద్ధ ఆంగ్ల ఆర్థిక శాస్త్రవేత్తయగు ప్రొఫెసర్ కానన్ ఆక్సు ఫర్డ్ విశ్వవిద్యాలయమునందలి క్లీన్జకా కళాశాలయందును, బేలియల్ కళాశాలయందును విద్యను అభ్యసించెను. ఇతడు క్రీ.శ.1907వ సంవత్స రమున అర్థశాస్త్రాచార్యుడై 1927 లో ఆపదవినుండి విర మించెను. లండళా ఆర్థిక, రాజకీయ శాస్త్ర బోధనాల యము స్థాపింపబడిన నాటినుండియు ఇతడా సంస్థయందు బోధకుడై యుండి, ఆ సంస్థ యొక్క ఆర్థిక సంప్రదాయ ముల నేర్పరచుటలో కొంతవరకు బాధ్యుడయ్యెను. ఇతని గ్రంథములు చదివినవారు ఇతని సనాతన దృక్పథమును, విమర్శనాత్మకముగు మనస్తత్వమును గుర్తించ గలరు. తనకు గురుతుల్యులని చెప్పదగిన ఆర్థికశాస్త్రవేత్తలను విమర్శించుటకే ఇతడు తనకాలమును, శక్తిని వెచ్చించి నప్పటికిని, ఇతడు ఆ శాస్త్రమందలి సంప్రదాయశాఖకే పెక్కు విధములుగ ప్రతినిధి. 334 ఉత్పత్తి, పంపకములకు సంబంధించిన సిద్ధాంతములు, ఆంగ్ల దేశమందలి స్థానికపు రేటుల చరిత్ర, సంపద, ధనము అనునవి ఈతని ప్రధానరచనలు. అంతేగాక ఆడమస్మిత్తు మహాశయుని గ్రంథమునకుకూడ ఈతడు పరిష్కర్త. వీటన్నిటియందును సంపదయను పేరుగల ఈతని గ్రంథము స్థిరమైన దృక్పథము చక్కని సంబంధ సామ్యముగల ప్రఖ్యాతరచన. ధనము, మరియు డెమొగ్రఫీ (Demography) కి సంబంధించిన ఆర్థిక సూత్రముల విషయములలోను, ఆడ ముస్మిత్తు యొక్క సరఫరా మరియు అ పేద (Demand) సిద్ధాంతములను విభజించి, నవీనపరిస్థితుల కనుగుణ్యముగా సంతరించుటలోను, అతడు ఆర్థిక శాస్త్రమునకు సేవ చేసెను. ఎన్నికల చట్టములు; D. ప్రజా ప్రభుత్వమునకు ప్రజలచే ఎన్నుకొనబడు వ్యక్తులే తాత్కాలిక పాలకులగుట, ఒక ముఖ్యవిశేషము. సమస్త ప్రజానీకమునుండి అట్టి పాలకులను ఎన్నుకొనుటయే ఎన్నిక విధాన మనబడుచున్నది. ప్రాచీన సంప్రదాయములో రాజ్యాధిపతీరాజై ప్రజలను పరిపాలించి మరణాంతమున