Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = ౨ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను. అతడు యావజ్జీవమును బ్రహ్మచారియైయుండి క్రీ. శ. 1944, నవంబరు 22 వ తేదీన ప్రణరోగముచే మరణించెను. 1938 లో హిర్లో షాన్లే సమకాలికుడయిన ఖగోళశాస్త్రజ్ఞులలో అతనిని అత్యుత్తమునిగా పేర్కొ నేను, 3 పైన పేర్కొనబడిన గ్రంథములేకాక ఆతడు ఇతర గ్రంథములను వెక్కింటిని గూడ ప్రచురించెను. వీటిలో తుది గ్రంథము 1948 లో అతని మరణానంతరము ప్రచు రింపబడెను. దీనిలో ఒక నూతన సిద్ధాంతము ప్రతిపాదింప బడినది. ఈ తత్త్వమును సమగ్రముగా గ్రహించినవారు కాని, ఒకమాదిరి గ్రహించినవారిలో దీనిని అంగీకరించిన వారుగాని లేరు అని ప్రతీతి. ఎడ్వర్డు ఫిట్టి రాల్డ్: రా. స. లార్డు ఎడ్వర్డు ఫిట్టి రాల్డు (1788-1798) ఐరిష్ దేశ భక్తుడు. ఇతడు లీన్స్టన్ యువరాజగు జేమ్సు, అతని భార్య ఎమిలో మేరీల ఐదవ కుమారుడు. 1769 వ. సంవ త్సరమున అక్టోబరు నెల 15 వ తేదీన డబ్లిన్ నగర సమీప ములో నున్న కార్టన్ హౌస్ లో ఇతడు జన్మించెను. 1779 లో సైన్యములో చేరి లార్డు రాడన్ సిబ్బందిలో అమెరికాలో పనిచేసినాడు. 1781 సెప్టెంబరు 1వ తేదీన ఇతడు యాటార్క్టింగ్సు యుద్ధములో తీవ్రముగా గాయ పడినాడు. 1788 లో ఫిట్టిరాల్డు ఐర్లండునకు తిరిగివచ్చి ఎట్టినుండి ఐరిష్ పార్లమెంటుకు ఎన్నుకొనబడెను. తరు 'వాత గ్రాధన్ నాయకత్వములో నున్న చిన్న ప్రతిపక్ష ములో నితడు చేరెను. కాని చర్చలలో ఎక్కువగా పాల్గొ నేడివాడు కాదు. ఆ తరువాత నితడు పూల్ విచ్ లో సైనిక విద్యాభ్యానమును పూర్తిచేసికొని 1787 లో స్పెయిను దేశమును పర్యటించెను. జార్జియానా లెనక్సు అను యువతిని ఇతడు ప్రేమించెను. కాని యామె ఈతని | ప్రేమను నిరాకరించెన; మేజరు హోదాలో ఐదవ రెజి మెంటులో చేరుటకు ఇతడు నౌక'లో న్యూట్రాన్స్విక్ వెళ్ళినాడు. 1789 లో ఇతడు ఎవరికి ఏమాత్రము తెలియని మారుమూల ప్రాంతములతో సహా ఫ్రెడరిక్ . స్టోన్ నుండి క్వెబెక్ వరకు దేశమంతటా పర్యటించెను. ఆ తరువాత సాహసయాత్రకు పూనుకొని డెట్రాయిట్ పూనుకొని డెట్రాయిట్ వెళ్ళగా 333 ఎడ్వర్డు ఫిట్టి రాల్డ్ హురాన్సు ఆదివాసులు ఆయనను తమనాయకునిగా స్వీక రించినారు. ఫిట్టిరాల్డు అక్కడినుండి మిసిసిపి ప్రాంత ములో న్యూ ఆర్లియన్సు వరకు పర్యటించి ఇంగ్లండుకు తిరిగి వచ్చెను. ఈ లోపుగా ఫిట్టిరాల్డు కీల్డేన్ నుండి ఐరిష్ పార్ల మెం టుకు ఎన్నుకొనబడెను. ఒక గోష్ఠిలో పాల్గొనుచు ఇతడు వంశ పరంపరగావచ్చు గౌరవబిరుదములను రద్దుచేయవలె నను ప్రతిపాదనను బలపరచియుండెను. స్వయముగా తన కున్న లార్డు బిరుదమునే ఇతడు త్యజించెను. ఇట్టి చర్యకై ఆయన సైన్యమునుండి తొలగించబడెను. ఈ సమయ ములో ఫిలిప్పె, డిజిన్ లిస్ దంపతుల కుమా రేయైన పమేలా అను యువతి నతడు 1792 వ సంవత్సరము డిసెంబరు 21 వ తేదీన టోర్నేలో వివాహము చేసి కొనెను. 1798 జనవరిలో ఈ నూతన దంపతులు డబ్లిన్ నగరము చేరుకొనిరి. ఫిట్టిరాల్డు తిరిగి పార్లమెంటుకు ఎన్నుకోసబడి, ప్రతి పక్షములో ప్రముఖపాత్రను వహించెను. ప్రభుత్వ ప్రకట నము నొకదానిని తీవ్రముగా ప్రతిఘటించుచు ప్రసంగించి నందులకు ఈతడు అరెస్టు చేయబడి సభా న్యాయస్థాన మెదుట క్షమాపణము చెప్పుకొనవలసినదిగా కోరబడెను. తరువాత ప్రత్యేక రిపబ్లిక్ ను నెలకొల్పవలెనను ఉద్య మములో చేరెను. 1796 లో ఐరిష్ ప్రజల స్వాతంత్య్ర పోరాటములో ఫ్రెంచివారి సహాయమును అర్థించుట కై వోల్ఫ్టోన్ ప్యారిస్కు వెళ్ళెను. అదే నెలలో ఫిట్టిరాల్డు ఒక మిత్రునితో కలిసి హాంబర్లు వెళ్ళి ఫ్రెంచి మంత్రి గ్రీన్ హార్డు ప్రభృతులతో చర్చలు జరిపెను. ఈ రాయబార ములను విరమించుకొన వలసినదిగా భర్తకు చెప్పుమని పమేలాను యార్కు యువరాజు కోరెను. అయినను ఫిట్టి రాల్డు ఆ ప్రయత్నములను విరమించుకొనలేదు. స్వాతంత్య్ర సమర మునకు 280,000 మంది సిద్ధముగా నున్నా రని చూపు పత్రములను చేతబూని, తమకు సహాయముగా ఫ్రెంచివారిని దండయాత్ర జరుపవలెనని ఆయన కోరెను. ఆ సందర్భములో ఏర్పడిన సైనిక సంఘమునకు తానే నాయకత్వము వహించెను. 1798 మార్చి 12 వ తేదీన థామస్ రేనాల్డు అందచేసిన సమాచారము చాలమంది కుట్రదారులను నిర్బంధించుటకు దారితీసెను. రేనాల్డు