ఎడ్డింగ్టను
సంగ్రహ ఆంధ్ర
ముగా తిరుగుటలేదు. ప్రవాహములుగా అవి కదలు చున్నవి. వీటినుండి స్థానికమైన నక్షత్ర ప్రపంచము (నక్షత్ర వీథి) యొక్క ఆకృతిని, సంచారమును కొంతవరకు గ్రహింపవచ్చును”. ఎడ్డింగ్టను కేస్టిన్ యొక్క ఈ అభిప్రాయములను ధ్రువపరచి, విస్తరింపజేసెను. ఇతడు వెల్లడియైన నక్షత్ర ప్రపంచము యొక్క గణితశాస్త్ర
సంబంధములగు విశిష్ట లక్షణములనుగూర్చి చర్చించెను. పిమ్మట ఆరు సంవత్సరములవరకు ఇతడు ఈ ముఖ్య కార్యమునందే నిమగ్నుడయ్యెను. అప్పటి పరిశోధన విషయములు 1914 లో ప్రచురింపబడిన "నక్షత్ర సంచారములు——విశ్వ నిర్మాణము" అను అతనిగ్రంథములో సంగ్రహముగా వ్రాయబడియున్నవి.
1918 లో నతడు నక్షత్రముల కాంతి ప్రసారమునకు సంబంధించిన సరితూనిక ను (Radiative Equilibrium) పరిశీలించుటకు పూనుకొనెను. స్చ్వానోజ్ స్చైల్డ్ (Schwanzschild) 1906 లో నక్షత్ర వాతావరణపు కాంతి ప్రసారమునకు సంబంధించిన సరితూనిక సిద్ధాంతమును వివరించెను. కాని అతడు దానిని నక్షత్రము యొక్క లోపలి భాగమునకు అన్వయించి యుండలేదు. ఎడ్డింగ్టను ఈ సిద్ధాంతమును నక్షత్రము యొక్క లోపలి భాగమునకు అన్వయించుట నక్షత్రము యొక్క ద్రవ్యరాశికిని, ఔజ్వల్యమునకునుగల సంబంధమును తెలిసికొనుటకు పాధన మగునని వివరించియున్నాడు. మొదటిలో ఈ సిద్ధాంతము బ్రహ్మాండమైన నక్షత్రములకు మాత్రమే వర్తించుసని భావింపబడినది. కాని 1924 లో నక్షత్రముల ద్రవ్య రాసులను గూర్చి ప్రామాణికములైన నిర్ణయములు జరిగెను. వాటిచర్య ఫలితముగా ఈ సిద్ధాంతము యొక్క సూత్రము నక్షత్రములయొక్క పరిమితితో నిమిత్తము లేకయే అన్ని నక్షత్రముల యొక్క సంపూర్ణ పరిమాణ మును కచ్చితముగా తెలిసికొనుటకును ఈ సిద్ధాంతము మనకు తోడ్పడగలదని ఇతడు కనుగొనెను.
నక్షత్రముల ద్రవ్యరాసులకును, ఔజ్వల్యములకు గల పరస్పర సంబంధమును గూర్చిన చర్చ గొప్ప ప్రాముఖ్యము గల ఫలితము. ఈచర్చ శాస్త్రజ్ఞ ప్రపంచములో అతని కీర్తికి ముఖ్యమగు పునాది. ఎడ్డింగ్టను 'సెఫీడ్ వేర్యబుల్సు: ఆమ సమస్యనుగూర్చి పరిశోధనమొనర్చెమ. ఆపరిశోధనమునకు ఆధారము వాటి కాంతి భేదములు సమకాలిక పరిపాటిగల నాడీ సంచలనము వలన ఏర్పడును అనెడి ఊహయే.
హార్వర్డువద్ద 1912 లో మిస్ లీవిట్ చే కనుగొనబడినట్టియు, అనక్షత్రములచే అనుసరింపబడునట్టియు, నియమిత కాలపరిమితిగల ఔజ్వల్యము యొక్క సంబంధమును సహేతుకముగా నిరూపింపగలుగుటయే అతని పరిశోధన ఫలితమై యున్నది. 1926 లో ఎడ్డింగ్టను "నక్షత్రముల ఆంతరంగిక నిర్మాణము" (The Internal Constitution of the Stars) అను పేరుగల తన సుప్రసిద్ధ గ్రంథములో ఈ పరిశోధనలను సక్రమముగా వివరించెను. 1927 లో ప్రచురింపబడిన “నక్షత్రములు, అణువులు" అను గ్రంథములో సామాన్య పాఠకునికి అర్థమగురీతిగా అతడు తన పరిశోధనమునందలి ఇతర ఫలితములను రమ్యముగాను, సంపూర్ణముగాను వివరించెను.
ఈ పరిశోధనలతోబాటు ఐన్ స్టేన్ (Einstein) 1915లో ప్రతిపాదించిన 'సామాన్యధర్మముగా జేయబడిన సాపేక్ష (Generalised Relativity) అను సిద్ధాంతమునుగూర్చి పరిశోధించుటలో గూడ నిమగ్నుడై యుండెను. 1918 లో లండన్ ఫిజికల్ సొసయిటీవారి కొరకు ఇతడొక నివేదికమ తయారుచేసెను. గురుత్వాకర్షణము యొక్క సాపేక్ష సిద్ధాంతమునుగూర్చి (Report on the Relativity Theory of Gravitation) ఆంగ్లేయ భాషలో వెలువడిన నూతన సిద్ధాంతములలో ఇది మొదటిది. ఆంగ్ల భాష నెరిగిన వారికెల్ల ఈ నూతన సిద్ధాంతమును ఎరుక పరచుటచే ఈ నివేదిక యొనర్చిన ఉపకారము అమూల్యము. స్థలము, కాలము, గురుత్వాక ర్షణము (Space, Time and Gravitation) విషయముపై అతడు వ్రాసిన గ్రంథము ప్రతిభావంతము, ప్రజారంజకము నగుటచే పదునొకండు భాషలలోని కనువదింపబడినది.
ఎడింగ్టను 1921-23 సంవత్సరములలో 'రాయల్ ఎస్ట్రోనామికల్ సొనయిటీ'కి అధ్యతుడయ్యెను. 1924లో ఆ సంఘము యొక్క సువర్ణపతకము అతనికి ఇవ్వబడెను. 1930 లో ఆతనికి “సర్” బిరుదము ఒసంగబడెను. 1938 లో 'ఆర్డర్' ఆఫ్ మెరిట్' ను పొందెను. ఆ సంవత్సరమే అతడు 'అంతర్జాతీయ ఖగోళ శాస్త్రీయ సంఘము వకు