డిసన్ థామస్ఆల్వా " సామగ్రి పోవుటయేగాక రైలు అధికారిచే అతడు చెంప దెబ్బతిని పూర్తిగా చెవిటి వాడ య్యెను. ఇది అంతయు అతని పదునైదవ సంవత్సరమున జరి అతడు తారా సందేశ విద్య (Telegraphy) నేర్చుకొని తన గ్రామమునందే రాత్రివేళలలో తంతుల కంపుపని సంపాదించెను. పగలు నిద్రపోవుటమాని శాస్త్ర రిశోధనలు చేయుచు మరల రాత్రియుద్యోగము చేయు కుండెను. ఎన్నోమార్లు అతడు నిద్రపోవుటయు, తంతి కార్తలు పచ్చుటయు సంభవించి వైయధికార్ల ఆగ్రహ మునకు గురియై చివరకు ఉద్యోగమునే పోగొట్టుకొ నెను. అయినను తారా సందేశ విద్యయందు స్వంత పరిశోధనలు వేసి మంచి మేధాశక్తి గలిగినవాడయ్యెను. 1888 వ సంవత్సరమునందు బోస్టను అను నగరములో ఒక ఉద్యోగ మతనికి మరల దొరికెను. ఫెరడే అను శాస్త్రవేత్త రచించిన విద్యుత్ విషయములను అప్పుడే అతడు చదివి ప్రజ్ఞావంతు డయ్యెను. క్రొత్త యంత్ర ములను, క్రొత్త విషయములను కనిపెట్టవలెనని నిశ్చ యము చేసికొని నేను. ఆ సమయములో ఎన్నిక లకు పనికివచ్చు నోట్లను లెక్కించు యంత్రమును కనిపెట్టెను. కాని రాజ్యాధికారుల కది నచ్చలేదు. అందు కతడు నిరుత్సాహపడకుండ పరిశోధనలను చేయుచుండెను. ఆ రోజులలో అతనికి పొట్టగడచుటయే చాల కష్టముగా నుండెను. తాను తంతివార్తా ప్రసారమందు కని పెట్టిన కొత్త పోకడలను ఆనగరములోనున్న “వెస్టరన్ యూని యన్ కంపెనీ" అను సంస్థలోని అధ్యక్షునకు తెలుప తలం చెను. అతని కవి ఉపయోగపడినచో కొంత ధనమున సంపాదింపవచ్చునని అతని యొద్దకు వెళ్ళెను. ఆ సంస్థ వారు ఇతనిని గూర్చి అంతయు తెలిసికొని మిగుల సంతో షించి, అతనికి ఒక ఉద్యోగము నిచ్చిరి. అతనిని పరిశోధన లను చేయుమని ప్రోత్సహించిరి. ఎడిసను సంతోషమునకు అంతులేకపోయెను. ఒకే పర్యాయము ఇటునటు ఒకే తంతిపై వార్తలుపోవు పద్ధతి కని పెట్టెను. నిమిషమునకు 8,500 మాటలను తంతిపై పంపు పద్ధతిని, అమాటలు అవ తలి స్థానమునందు వాటంతట నవియే వ్రాసి పెట్టుటకు వీలగు ఒక విధమైన రసాయనపు కాగితమును కనిపెట్టెను, దీనివలన సంస్థకు అధికముగా లాభము వచ్చేను. ఎడిసన్ సంగ్రహ ఆంధ్ర కూడ అధిక ధనమును సంపాదించెను. అంతలో అతనికి తృప్తితీరలేదు. ఒకే సమయములో ఒకే తంతిపై నిటు నటు రెండు వార్తలను పంపుపద్ధతి కనుగోనెను. ఇందు వలన వార్తలు త్వరితముగా పోవుచుండెను. ఎంతో ఖర్చు కూడ తగ్గెను. ఎడిసన్ ఆదాయము ఇంక నెక్కువయ్యెను. వచ్చినధనము నత డెప్పుడును శాస్త్రపరిశోధనమునకే విని యోగించుచుండెను. ఒకేమారు మూడు వార్తలను పంపు టకై ఎంతో ప్రయత్నించెను. ఎంతో ధనమును వ్యయము చేసెను. కాని కని పెట్టలేకపోయెను. అదే సమయమున అలెగ్జాండరు గ్రాహమ్బల్ అను నాతడు తారాసంభాషణ యంత్రమును (Telephone) కనుగొనెను. ఎడిసన్ యొక్క దృష్టి దానిపై బడెను. 1877 78 కాలములో కర్బన ప్రేషణయంత్రము (Carbon transmitter) అను విధానమును కనిపెట్టి టెలిఫోను యంత్రమును జైనందిన కార్యములలో పనికివచ్చు యంత్రముగా మార్చివేసెను. ఇప్పటికిని కొద్ది మార్పుతో. ఎడిసన్ విధానమునే ఉపయోగించుచున్నారు. 330- టెలిఫోనుపై పరిశోధన చేయుచుండగనే అతి పల్చని రేకుముక్క ధ్వనివలన కంపించిపోవుట గ్రహించి "ఫోనో గ్రావ్" అను యంత్రము నతడు కనుగొనెను. (1877) దీనిపై పరిశోధనలను జేసి గ్రామఫోన్ యంత్రమును కను గొనెను. మరి శీలీ సంవత్సరములు అయినతరువాత (అనగా 1912 లో కొన్ని పరిశోధనలతో మూగ సినిమాలలో ఈ గ్రామఫోను విధానమును అమర్చి మాట్లాడు సినీమాను తయారు చేయవచ్చునని అతడు ప్రకటించెను. వేరు పను లలో నిమగ్నుడగుటవలన అతడే ఆ పనియందు శ్రద్ధ వహించ వీలు కలుగలేదు. ఎడిసన్ ప్రజలకు చేసిన సేవలో చెప్పతగినది చవుక యైన విద్యుత్ దీపములను వారి కంద జేయుటయే. లేనిచో కోటి కొకచోట విద్యుద్దీపమును చూడగలుగుదుము. ఎన్నో రాత్రింబగళ్ళు పనిచేసి ఎన్నో ప్రయోగములను చేసి, ఎన్నో సార్లు విఫలమై, నలుబది వేల డాలర్లు వెచ్చించి చివరకు నలుబదిగంటలు మండెడు కర్బనపుతీగ గల దీపమును తయారు చేసెను. దానిపై అతడు, ఇంకను కొందరు శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి ఎన్నో దినములు మండు టకు వీలుగా నుండు విద్యుత్ దీపములను కనుగొనిరి. ఇందు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/371
స్వరూపం