Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎడారులు

సంగ్రహ ఆంధ్ర


భూఖండమునకు చెందిన వేడి ఎడారులు ఖండముల లోపలిభాగములలో కనబడుచున్నవి. ఆఫ్రికాలోని సహా రాను, అరేబియాలోని ఎడారులను కలిపినచో ప్రపంచములో ఒక పెద్ద ఎడారిగా ఏర్పడును. ఆస్ట్రేలియా ఎడారి, దక్షిణ ఆఫ్రికాలోని 'కల్హారీ' ఎడారి, భారతదేశములో వాయవ్యదిక్కుననున్న 'ధార్' ఎడారి, ఇవి భూఖండమునకు చెందిన ఎడారులు.

ఈ ఎడారుల పడమటితీర భాగములను వెన్నంటి ప్రవహించు శీతల జలప్రవాహముల వలన సముద్ర భాగ మునకు చెందిన వేడి ఎడారులు ఏర్పడుచున్నవి. పర్వతములకును, సముద్రతీరమునకు మధ్యగల ఇరుకైన భూభాగములలో ఈ ఎడారులు ఏర్పడియున్నవి. ఉదా: ఉత్తర అమెరికాలోని కాలిఫోర్నియా ఎడారి; దక్షిణ అమెరికాలోని ఉత్తర చిలీ ఎడారి; దక్షిణ పెరూ ఎడారి. ه శీతలపు టెడారులు యూరేషియాలోను,ఉత్తర అమెరికాలోను, దక్షిణ అమెరికాలోను కలవు. యూరేషియా ఎడారులు కాస్పియన్ సముద్రమునుండి తూర్పున ఖంఘన్ (Khinghan) పర్వతముల వరకును వ్యాపించి యున్నవి. అవి టక్లా మఖాన్ (Takia - Makhan), టర్కా స్థాన్, గోబీ ఎడారులు. నీటిపారుదలకై వాటిలో సరస్సులు కలవు. ఉ త్తర అమెరికాలో ఇట్టి గొప్ప సరస్సు ఒకటి శిలామయములైన పర్వతములలో నున్నది. దక్షిణ అమెరికాలో పెటగోనియా ఎడారి 'ఆండీస్' పర్వతములకు తూర్పువైపున నున్నది.

ఎడారి భూమియొక్క స్వరూపము (Desert Land form) : ఎడారి పరిసరము యొక్క ప్రత్యేకత శీతోష్ణ స్థితి, భౌతికములైన మిట్టపల్లములు, (Relief) — అను వాటి కలయిక చేత ఏర్పడుచున్నది. ఎడారులలో అన్ని విధములైన భూతలములు (Surfaces) కనబడుచున్నవి. ఉదా : ఇసుక, మట్టి, కంకర, చెట్టుచేమ లేని రాయి. ఎడారుల భూతలము ఒకప్పుడు చెట్లు చేమలు లేని శూన్యమగు మైదానముగా నుండవచ్చును; లేక ఎత్తువల్లములతో అలలవలె పడిలేచు పై భాగము కలదిగా నుండవచ్చును; లేదా పెక్కు పర్వతపంక్తులు మైదానములపై కనిపించవచ్చును. సహారా ఎడారిలో వేర్వేరు భూతలములకు వేర్వేరు పేర్లు వాడబడుచున్నవి : వీచెడి గాలిచే దిబ్బలు ఏర్పడిన ఇసుక 'ఎర్గ్' అని పిలువబడుచున్నది. కంకర మైదానములకు 'రేగ్' (Reg) అని పేరు. శూన్యము లయిన రాతి పొరలకు 'హమాదా' అని పేరు.

మైదానములు పెరుగుటకును, క్షీణించుటకును గాలి ప్రబలమైన కారణము. గాలివీచు దిశలోనున్న ఇసుక దిబ్బల ఆకారములు వేరు వేరుగ నుండుము, నెలవంకవలెనున్న ఇసుక మెట్టకు 'బ రెహాన్ ' అని పేరు. ఇట్టి స్వరూపముగల భూమి తరచుగా కానవచ్చును. వేడిమి బలమై, మార్పులకు లోనగు వాయు ప్రవాహములను పుట్టించును (Convectional currents), అట్టి వాయువులు ధూళిని కొరడాతోవలె చెల రేగకొట్టును. స్థానికములైన ఆ సుడి గుండములను ధూళిగమ్యములందురు. అవి పెద్ద యెత్తున సహారానుండి వీచును. 'సీతాకో' 'సై మూన్' 'ఖాంపిన్' అని వాటికి పేర్లు, అవికూడా వేడి యిసుక రేణువులను కొనిపోవును. అందుచే కొన్ని తావులలో 140° ఫా. వరకు గూడ ఉష్ణోగ్రత పెరుగుచున్నది; అది భరించరాని వేడిమి . దానివలన మనుజుల చర్మము, వ్రేలి గోళ్లు పగిలిపోవును. సన్నని ధూళి నోటిలోనికి, చెవులలోనికి, ముక్కులలోనికి ప్రవేశించును. కావున అచ్చటి అవసరములకు అనుగుణముగా అరబ్బులు తమదుస్తులు ఏర్పాటు చేసికొందురు. అట్లే ఈజిప్టుదేశీయులు 'ఖాంసిన్' అని పిలువబడు ఇసుక యొక్క వేడిగాడ్పుల వలన అచటి శవములు చెడకుండు నట్లు ఏర్పాట్లు కావింతురు. ఎడారి జలప్రవాహములను, లోయలను అరబ్బులు 'వాడి' లేక 'ఎట్టోయా' లు అందురు. మేఘములనుండి పడు నీరు ఎడారిలో నీటి ప్రవాహములుగా ప్రవహించి, వెంటనే ఇసుక లోనికి, రాళ్ళలోనికి ఇంకి మాయమగును. ఎడారికి ఆవలి భాగమున నున్న పర్వతములపై నుండి మంచు కరగుటవలన పుట్టిన నదులు ఎడారిగుండా ప్రవహించుచు సన్నగిలిపోవును. నిట్టనిలువుగాను, ఎగుడుదిగుడుగాను వరుసతప్పి ఉండు గట్లుగల లోతైన లోయల మధ్యగా నదులు ప్రవహించుచు, అడుగున నున్న మెతక రాళ్ళ నేలలను కోయుచు పోవుచుండును. ఉదా : ఎరిజోనా యందలి 'గ్రాండు కేనియన్' (Grand Canyon) ప్రాంతముగుండా ప్రవహించు 'కొలరేడో" (Colorado) అను వది. ఒక నైలునది మాత్రమే సహారాలో నుండి ప్రవహించుట లేదు.