Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఋగ్వేదము మొదటి తొమ్మిది నుండలములలో పౌర్వాపర్యమును నిర్ణయించుటకు సాధనము లేమి వారికి దొరకలేదు. కాని ఇవన్నియు సమకాలికములనియు మనము అన లేము. పురాణములలో వర్ణింపబడిన ఋషివంశములను బట్టి వేద ఋషులలో కొందరు ప్రాచీనులు మరికొందరు కనులు మనము నిశ్చయముగా చెప్పవచ్చును. మరియు కొన్ని సూక్తములలో పూర్వకవులు స్మరింపబడి యున్నారు. అందుచే ఋగ్వేద మంత్రములన్నియు రచి యింపబడుటకు సుమారు వేయి సంవత్సరములు పట్టి యుండవచ్చును. ఇంతకాలము భాష యేకరీతిగా నుండి సదా యనినచో గ్రంథస్థభాష ఏకరీతిగా నుండుట కవకా ళ ముకలదు. ఋగ్వేద మంత్రపాఠము : ఋగ్వేదమంత్రము లతీ ప్రాచీనమై కాలనిర్ణయము చేయుట కవకాశము లేని పై సప్పటికి వాటి పాఠము, క్రమము అంత ప్రాచీన మైన ట్లగపడదు. బ్రాహ్మణములలో నచ్చటచ్చట సంహితలోని గొన్ని భాగముల యక్షరసంఖ్యలు నిర్దేశింపబడియున్నవి. ఆ సంఖ్య లిప్పటి సంహితాపాఠముతో సరిపడుట లేదు. ఈ భేదము సామాన్యముగా పదసంధివలన కలుగుచున్నది. బ్రాహ్మణములలో వ్యాకరణచర్చయే యగపడకపోవుట చేతను, ఆరణ్యకములయందును, ఉపనిషత్తుల యందును గనబడుటయే కాక వ్యాకరణ పారిభాషిక పదములును వైయాకరణులు ను పేర్కొనబడియుండుట చేతను బ్రాహ్మణ-ఆరణ్యకముల మధ్యకాలమున నిప్పటిసంహితా పాఠ నేర్పడినదని మనమూహింపవచ్చును. శాఖలు: ఋగ్వేదమున కయిదుశాఖలుండినట్లు చరణ వ్యూహమున చెప్పబడియున్నది. అన్ని శాఖల పాఠమును మనకు లభింపలేదు. శాకల శాఖాపాఠమే ప్రస్తుతము ప్రచారములో నున్నది. అదియే ముద్రింపబడినది. ఆశ్వ లాయన శాఖలో వాలఖిల్య మంత్రములన్నియు, శాంఖా యన శాఖలో వాటిలో కొన్నియు ప్రామాణిక ములుగా తలపబడి సంహితలో చేర్చబడినవి. మిగిలిన విషయము లలో శాకలశాఖకును వీటికిని భేదమేమియును లేదు. అందువలననే కావలయును, పురాణములలో శాకల, బాష్కల, మాండూక శాఖలు మూడే పరిగణింపబడి యున్నవి. బాష్కల శాఖయందు శాకలశాఖయందు సంగ్రహ ఆంధ్ర కంటె నెనిమిది సూక్తము అధికముగా నున్నట్లును, మొదటి మండలములో గొన్ని సూక్తములను స్థలాంతర ములో పఠించినట్లును చెప్పుదురు. మాండూక శాఖను గురించి మన కేమియును దెలియదు. స్వరము : ఋగ్వేద సంహిత, స్వరముతో నుచ్చరింప వలసియున్నది. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, అని యీ వేదమున స్వరములు మూడు, వర్ణముల యొక్క క్క స్వరము తెలియుటకు పుస్తకములయందు గుర్తులుంచ బడును. ఋగ్వేదమున స్వరితముగా నుచ్చరింపవలసిన యక్షరమునకు పైన నొక నిలువుగీతయు, అనుదాత్త ముగా నుచ్చరింపవలసినయక్షరమునకు గ్రింద నొక యడ్డు గీతయు, "పెట్టబడియుండును. ఉదా త్తవర్ణమునకు గుర్తు లేదు. ఉ ॥ యజ్ఞస్య. ఇచ్చట 'జ్ఞ' ఉదాత్తముగాను, 'స్య' స్వరితముగాను, 'య' అనుదాత్తముగాను నుచ్చరింప వలేనని సంజ్ఞలు సూచించును. I ఛందస్సు : ఋగ్వేద సూక్తములలో ఋక్కులసంఖ్య మూడింటికి తక్కువ కాకుండను ఏబది యెనిమిదింటికి హెచ్చుకాకుండను నుండును. కాని సామాన్యముగా వది వండెండింటికి హెచ్చదు. ఈ ఋక్కులు 15 ఛందస్సులలో సున్నవి. వీటిలో గాయత్రి, త్రిష్టుప్, అనుష్టుప్ అను మూడు ఛందస్సులు తరచుగా నుపయోగింపబడియున్నవి. ఋగ్వేదమున అనుష్టుప్ ఛందస్సుకంటె గాయత్రీ ఛందస్సు అధికముగా వాడబడియున్నను క్రమక్రమముగా అనుష్టుప్ ఛందస్సు ప్రబలి గాయత్రివాడుక తగ్గుచువచ్చి తుదకు సంస్కృత వాఙ్మయమునందు గాయత్రి లోపించినది. సాధారణముగా నొకసూక్తము నందలి ఋక్కులన్నియు నొక ఛందస్సులో నే యుండును. కాని కొన్ని సూక్తము లలో సంక్యఋక్కు మరియొక ఛందస్సులో గూడ నగపడు చున్నది. మరికొన్ని సూక్తములలో నొక ఛందస్సునం దుండు రెండేసిగాని, మూడేసిగాని ఋక్కుల సముదాయ ములు చేరియుండును. ఇంక కొన్ని సూక్తములలో సరి సంఖ్య గల ఋక్కు లొక ఛందస్సులోను, బేసిసంఖ్య గల ఋక్కులు మరియొక ఛందస్సులోను ఉండుట గూడ గలదు. శైలి : ఋక్కుల శైలి సులభముగాను, దీర్ఘ సమాస రహితముగాను నుండును. 'రెండు పదములకు మించిన 306