నిజ్ఞానకోశము - ౨ ములు ఆర్యు లచ్చటినుండి గంగానదివరకును వ్యాపించిన తరువాత రచింపబడినవి. క్రీ.పూ. 5000 - 8000 – ఇది ఆర్య నాగరికతయందు ద్వితీయ యుగము. ఇది మృగశీర్ష యుగము. ఇందు ఋగాది వేదములలోని అనేక సూక ములు ఆవిష్కృతములైనవని తిలక్ పండితుడు వచించేను. జాకోబీ పండితుడు ఋగ్వేదము క్రీ. పూ. 4000 సంవత్స రములకు పూర్వమే వ్రాయబడెనని అనెను. ఈ వేద యుగము క్రీ.పూ. 4500--800 అని సి. వి. వైద్యపండితుని అభిప్రాయము. ఋగ్వేదము-సూక్తములు : ఋగ్వేదము ఋక్కులు అను ఛందోబద్ధ మంత్రములతో నిండియున్నది. కొన్ని మంత్రముల సముదాయమునకు సూక్తమని పేరు. ఋగ్వే దమున నాలఖిల్య సూక్తములతో గలిసి 1028 సూక్త ములు కలవు. వీటిని పదిమండలములుగా విభజించి యున్నారు. మండలము అన్నిటియందును సూ క్షముల సంఖ్య (191) సమానముగా నున్నది. సూక్తముల యేర్పాటు పదిమండలములలోను సూ క్ష ముల యేర్పాటు ఏక విధముగా లేదు. రెండు మొదలు ఏడువరకునుండు మండలములలో నొక్కొక్క సూక్తము సామాన్యముగా ఏకఋషి కర్తృకముగా నున్నది. వీటిలో ఒక్కొక్క దేవతాస్తుతిపరములైన సూక్తము లొక్క చోట చేర్చబడియున్నవి. ఒకటవ, ఎనిమిదవ, పదవ మండ లములలోని సూక్తము లన్నియు నొక్కొక్క ఋషిచే వ్రాయబడినవిశావు. వాటిలో నొక్క ఋషిచే వ్రాయ బడిన సూక్తము లొకచో చేర్చబడియున్నవి. తొమ్మిదవ మండలములోని సూక్తములన్నియు సోమదేవతావాస్తావ కములుగా నున్నవి. దీనిలో సూక్తముల యేర్పాటు ఛందస్సామ్యము ననుసరించి యున్నది. మండలముల యేర్పాటు : రెండు మొదలు ఏడువరకు నుండుమండలములలో వొక్కొక్కటి యొక్కొక్క ఋషి వంశమువారిచే రచియింపబడినది. రెండవది గృత్సమద మండలము. మూడవది విశ్వామిత్రమండలము, నాల్గవది వామదేవమండలము. అయిదవది అత్రిమండలము. ఆరవది భరద్వాజకుండలము. ఏడవది వసిష్ఠమండలము, వీటికి గోత్రమండలములని వ్యవహారము కలదు. పూర్వకాలమున నీమండలము ల నాయా ఋషి వంశములవారు తమ 39 305 ఋగ్వేదము పూర్వులయందుండు గౌరవముచే సంప్రదాయము పోకుండ నధ్యయనము చేయుచు నుండుట సంభావ్యము. ఈ మండలములలో సూక్తములసంఖ్య క్రమముగా సధిక మగుచున్నది. మొదటి మండలములోని ఉత్తరార్ధము తొమ్మండుగురు ఋషుల చే వ్రాయబడిన సూక్త సముదాయ ఘటితముగానున్నది. ఇట్లీ భాగము పై వారు మండలములను బోలియున్నది. ఇవి చిన్న చిన్న సముదా యము అగుటచే ప్రత్యేక మండలములుగా జరిగణింపబడక ఒకమండలములో చేర్చబడినవి. మొదటి మండలములోని పూర్వార్ధములోని సూక్తములును, ఎనిమిదవ మండ లములోని సూక్తములును కణ్వవంశమువారిచే రచియింప బడినవి. ఈ రెండు భాగములలోని ఋక్కులకును, వృత్త సామ్యము, పాదసామ్యమును కలవు. తొమ్మిదవ మండ లములోని నూ క్తము లన్నియు సోమదేవతా స్తోత్రములు. అందుచే దీనికి సోమమండలమని, పావమానసుని పేర్లు. పూర్వమండలములలోని సూక్తములను రచించిన ఋషులే ఈ సూక్తములనుగూడ రచించిరి. సోమసూ క్తములు విశే షముగా నుండుటచేతను, సోమయాగము యొక్క ప్రాము ఖ్యముచేతను వీటిని ప్రత్యేకమండలముగా చేసియుందురు. మండలముల పౌర్వాపర్యము : పదియవ మండలము. సోమమండలమునకు తరువాతనుండుటచేతను, మరికొన్ని కారణాంతరములచేతను మిగిలిన తొమ్మిది మండలముల కంటే నవీనమని పాశ్చాత్య విమర్శకుల యభిప్రాయము. పదవచుండలము మిగిలిన మండలములకంటే నవీననునటకు కొన్నియుక్తులు — (1) పదవమండలములో నొక ఋషి. చే రచింపబడిన సూక్తసముదాయ 'మొకటి (20-26) "అగ్ని మీరే " అను పదములతో ప్రారంభింపబడియున్నది. (2) పదవ మండలమునకును తత్పూర్వమండలముల కును దేవతావిషయమున భేదముకలదు. (3) పదవ మండలమునకును మిగిలినమండలములకును విషయమునందు భేదముకలదు. (4) వదవమండలములోని భాష మిగిలిన మండలముల లోని భాషకంటె నవీనమనుటకు కొన్ని నిదర్శనములు కలవు. పై కారణములచే పదవమండలము తత్పూర్వమండల ములకంటె నవీనమని పాశ్చాత్య విమర్శకు లూహించినను
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/346
స్వరూపం