ఋగ్వేదము. (1) నేత్రసంధులయందు జనించువ్యాధులు 9; (2) కను రెప్పలయందు జనించు వ్యాధులు 21; (3) తెల్లగుడ్డు లందు జనించువ్యాధులు 11; (4) నల్లగుడ్డులందు జనించు వ్యాధులు 4; (5) నేత్రగోళము లందు జనించు వ్యాధులు 17; (B) కనుపాపలయందు జనించు వ్యాధులు 12; (7) ఆగ నుజ వ్యాధులు 2; మొత్తము 76. 4. ముక్కు రంధ్రములందు జనించు వ్యాధులు 31; ఇందు భాగములు 4, గతులు 31: (1) ముక్కు రంధ్రములయందు జనించువ్యాధులు 7; (2) ముక్కు నెలవులయందు జనించు వ్యాధులు 4; (8) ముక్కు దూలములందు జనించు వ్యాధులు 4; (4) నాసా ఫలక మునందు జనించు వ్యాధులు 16; మొత్తము 31. 5. ముఖమునందు జనించు వ్యాధులు 67; అందు భాగములు 8: గతులు 87 : (1) పెదవులయందు జనించు వ్యాధులు 12; (2) చెక్కిళ్ళయందు జనించు వ్యాధులు 2; (8) దంత ములయందు జనించు వ్యాధులు 10; (4) చిగుళ్ళయందు జనించు వ్యాధులు 12; (5) నాలుకయందు జనించు వ్యాధులు 8; (7) చెంపలయందు జనించు వ్యాధులు 12; (8) నోటియందు జనించు వ్యాధులు 5; మొత్తము 67. సర్వసాముదాయికాంకము 213 : (1) శిరోరోగములు 11; (2) కర్ణరోగములు 28; (8) నేత్రరోగములు 76; (4) నాసారోగములు 31; (5) ముఖరోగములు 87; మొత్తము 218. సంగ్రహ ఆంధ్ర ఈ వ్యాధు లన్నింటికి సుశ్రుతుడు నిదానచికిత్సలను వివరముగా చెప్పెను. కాని పై దేహాదులు తంత్రముల యందు విశేషాంశాంశ కల్పనములతో ఈ ఊర్ధ్వాంగ వ్యాధులు అణుశః పరిబృంహితములై అసంఖ్యాక ములుగా చెప్పబడియున్నట్లు సుశ్రుతముపై గల దలవాణ వ్యాఖ్య కనబడుచున్నది. సుశ్రుతమున కది మూలముగా సుశ్రుత వ్యాఖ్యానమునందు తెలియుచున్నది. లక్ష్యలక్షణ సమన్వయముతో ప్రత్యక్ష శారీరమును, బహుముఖముల శస్త్రశాలోక్య చికిత్సా సిద్ధాంతములను, విశ్వతో ముఖవ్యాప్తి నొందించినవారు చంద్రవంశ్యపు రాజర్షులు నిమిసంతతివా రగు కాశీరాజులు. వీరనేకము అయిన ఆయుర్వేద సభలలో పాల్గొనినట్లు చరకము ప్రమాణము. మిసంహిత, కరాలసంహిత, సాత్యకి సంహిత... అనునవి వీరి వంశరచనలే. ఇవి వ్యాఖ్యా నములయందు తప్ప కొనబడుటలేదు. ఇవిగాక రావణ తంత్రము, జీవకతంత్రము, వృద్ధజీవక తంత్రము అనునవి వాకృచారమున గలవు. బోపదేవుడు వైద్యమును గూర్చి తొమ్మిది గ్రంథములు వ్రాసెననియు, అం దైదు ప్రత్యేకముగ శాలా క్యాభినివేశములనియు ప్రతీతి - ఇందు వైద్యకళత మనునది మాత్రము ముద్రితముగా కనబడుచున్నది. భోజుని గ్రంథములలో అసమగ్రము, అస్తవ్యస్తము నగు చారుచర్య తప్ప మిగిలినవి శ్రుత మాత్రములే. వే. లి. వేం. రా. స్వా- ఋ ఋగ్వేదము : ఆర్యులు, వేదములు : అనేక వేల సంవత్సరములకు పూర్వము ఆర్యులను నొకజాతిజనులు ఇతర దేశ ములనుండి మనదేశమునకు వచ్చిరని పాశ్చాత్య చరిత్రజ్ఞుల యభి ప్రాయము. వారు మొట్టమొదట నీదేశమునకు వాయవ్య భాగముననున్న సింధునది కిరుప్రక్కలమండు దేశము 304 కాల నాక్రమించి యచ్చట నివాసము చేయుచుండి క్రమమున వారు ఈదేశమునంతను వ్యాపించి వారి భాష యైన గీర్వాణభాషను, వారి సంస్కృతిని దేశమంతటను వ్యాపింపజేసిరి. వారు సింధునదీ ప్రాంతమున నుండగా ఋగ్వేద మంత్రములను రచించిరి. ఈ ఋగ్వేద రచన యే భారతీయ వాఙ్మయమునకు ప్రారంభము. మిగిలిన వేద
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/345
స్వరూపం