విజ్ఞానకోశము - గొనవలెను. త్వరితమగు రోగనిర్ధారణ, సక్రమమగు చికిత్స యిందుల కవసరము. ఇందులకు చికిత్స : (1) రోగిని ఇతరులనుండి వేరుచేసి అతడు ఉమ్మినదానిని నాశనము చేయుట. (2) మంచి ఆహారము, విశ్రాంతి, స్వచ్ఛమైన గాలి, రోగి పొందునట్లు చూచుట. (3) గాలిని ఫ్లూరల్ పేటికలోనికి సూదితో ఎక్కించుట ద్వార ఒక ఊపిరితి త్తికి విశ్రాంతినిచ్చుట. (4) శ్వాసనాళవ్యాధి పరిహారార్థమై శస్త్రచికిత్స చేయుట. (5) స్ట్రెప్టో మైనికా సూదిమందు, నికొటిన్ ఆసిడ్, హైడ్రోజన్ మాత్రలు, పారా అమైనో పెల్సిలిక్ ఆసిడ్ మాత్రలు ఉపయోగించుట. వాటిని ప్రత్యేకముగా గాని రెంటిని మిశ్రమముగా గాని ఉప యోగించవచ్చును. ఇందలి మరణకారణ పరిస్థితులు: (1) బలహీనత. (3) రక్తకఫరోగము. (8) శ్వాసనాళ ముల జబ్బు. (4) గుండె ఆగిపోవుట, (5) ఇతర క్లిష్ట పరిస్థితులు. క్షయవ్యాధి తీవ్ర శ్లేష్మాధిక్య జ్వరరూపములో రావ చ్చును. లేక వృద్ధులకు దీర్ఘకాలము దగ్గురూపములో సుండవచ్చును. తీవ్రమైనదయ (ఎక్యూట్ మైలరీయ) వచ్చినచో క్షయసంబంధమైన జీవాణువులు రక్త ప్రవా హములోనికి ప్రవేశించును. అవయవములన్నియు వీనితో నిండిపోవును. రోగికి టైఫాయిడ్ను పోలిన జ్వరము వచ్చును. ఊపిరితిత్తులకు ఎక్సురే పటమును తీసిన యెడల చిన్ని గుండ్రనినీడలు కనబడును. ఊపిరితిత్తులు ముకుళించుకొనిపోవుట (కొలాప్స్ ఆఫ్ లంగ్): ఏదేని అన్యపదార్థము కాని శ్లేష్మముగాని శ్వాస నాళముల నడ్డగించినయెడల దానికి సంధాయకమైన వాయువు పీల్చుకోనబడి ముకుళించుకొనుట జరుగును. శస్త్రచికిత్స తర్వాత రోగి యొక్క శ్వాసకోశ వృత్తమం దంతటను వీణత వ్యాపించవచ్చును. త్వరలో శ్లేష్మాధిక్య వ్యాధిలక్షణములను పోలిన చిహ్నములు పెంపొందును. ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్యలు ఏమనగా : శస్త్ర చికిత్సాలయమునుండి రోగిని బైటకు తీసికొని వెళ్ళుటకు పూర్వము రోగి చక్కగా పిల్చునట్లుచేయుట శ్వాసనాళ దర్శిని సహాయముతో వాయు గ్రహణము ద్వారా అన్యపదార్థములను తొలగింపవచ్చును. క్రిమి వ్యతిరేక ఔషధముల నుపయోగింపవలెను. 38 297 ఊపిరితిత్తులు ఎంఫిసిమా : ఇది క్షీణించిన ఒక భాగము చుట్టును స్థానికముగా నుండవచ్చును. వృద్ధులలో నిది సామా న్యము. నోటితో నూదు గాలి యంత్రముపై గానము చేయువారికి కూడ ఇది సామాన్యముగా వచ్చును. వాయు కోళపు తిత్తులపొరలు అదృశ్య మగును. అందుచే పెద్ద గాలి పంచులు ఏర్పడును. ఛాతి శాశ్వతముగ వాయు గ్రహణానుకూలమైన యునికిలో అమర్పబడును, ఎల్లప్పుడు దగ్గువచ్చును. పనిచేసినపుడు ఊపిరాడకుండుట ఉండును. వ్యాధిముదిరినచో గుండెపనిచేయని చిహ్నములు కను పించును. ఉబ్బసముకూడ ఈ వ్యాధివచ్చుటకు గల కార ణములలో నొకటి, నివారణ అసంతృప్తికరము, మరియు కేవలము వ్యాధిలక్షణానుసారము. శ్వాసనాళసంబంధ రోగము (బ్రాంకై యక్ టీసీన్) : ఈ పరిస్థితిలో నున్న వారికి శ్వాసనాళ గొట్టములు సంచి వలె నుబ్బును. వేటికలకు సంపర్కదోషము కలుగుట వలన ఈ చిహ్నములు గోచరించును. రోగి బాధతో దుర్వాసనగల శ్లేష్మమును ఎక్కువగా ఉమియును. దగ్గులో రక్తము నుమియుటకూడ ఉండవచ్చును. వ్రేళ్ళు నీలిగా నగుటయు, వ్రేళ్ళకొనలు ఉబ్బుటయు ఉండును. ఇందులకు చేయవలసిన చికిత్సలు శ్లేష్మము బైటికి వచ్చుటకు అనుకూలముగా పరుండి, తలదించుట, మరియు క్రిమివ్యతిరేక ఔషధములను ఉపయోగించుట. చెడిన వృత్తములను తీసివేయుటవలన ఇటీవల సత్ఫలితములు కలిగినవి. చెడిపోయిన శ్వాసనాళములోనికి అయినుతో కూడిన నూనెను వేసిన పిదప ఎక్సు రేచిత్రము తీయుట 'ద్వారా రోగనిరూపణ గావింప వీలు చిక్కును. ఊపిరి తిత్తులలో వ్రణము పుట్టుట, మరియు అందలి మాంసము క్రుళ్ళుట : ఒకప్పుడు విషకరమగు శరీర ప్రక్రియ సంఘటిల్లి స్థానిక ధాతువులు (లోకల్ టిస్యూస్) నిర్మూల మగును. మాంసము క్రుళ్లుట విరివిగాజరిగిన, రోగి కలుషిత రక్తవ్యాధి (టాక్సేమియా) వలన మరణించును. అది ఒకే ప్రాంతమున కేంద్రీకరించి యున్న యెడల చీము ఏర్పడి అది బైటకు ఉమ్మబడును. అందువల్ల ఊపిరి తిత్తులలో వ్రణము కలుగును. నోటినుండి దుర్వాసనగల ఉమ్మి బైటకు వచ్చును. వ్రేళ్ళ కొనలు శీఘ్రముగా ఉబ్బును. రోగికి జ్వరము వచ్చుట, రక్తము కలుషిత
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/338
స్వరూపం