Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

ఉష్ణ విద్యుత్ ఉత్పాదక స్థావరములు


తడిపద్ధతి, పొడిపద్ధతి అను రెండు ముఖ్యమైన పద్ధతులుగా నుండును. పొడి పద్ధతిలో తిన్నగా కొలిమి అడుగుభాగమున నుండియే బూడిద పెట్టెలలో నింపబడును. ఆ పెట్టెలు చుట్టుపట్లనున్న నిమ్న ప్రదేశములో పోయుటకొరకు చిన్న అయోమార్గముపై తీసికొనిపోబడును. అట్టి బూడిదలో చాల సేపు వరకు మండుచున్న బొగ్గులుకూడ ఉండుటకు అవకాశము కలదు. ఆబొగ్గులు ఆరిపోయిన తరువాత మరల బూడిదను తీసివేయవలెను. బూడిదను గ్రహించుయంత్రము స్థావరమునకు గాలి కొట్టుచున్నవై పున ఉండునట్లు చూడవలెను. రోడ్లపై పరచుటకును, పెద్దగోతులు పూడ్చుటకును బూడిద ప్రధానముగా ఉపయోగించును. అంతేగాక, విద్యుత్ ఉత్పాదక స్థావరమును ఆనుకొని సముద్రమున్నచో పెద్ద పడవల (Barges) సహాయమున బూడిదను సముద్రపు నీటిలో అడ్డుగా వేయవచ్చును.

తడిపద్ధతిలో తీసికొనిపోవలసిన స్థలమునకు రవాణా చేయుటకుముందు బూడిదను నీటితో చల్లార్చుదురు. ఏ పద్ధతి ప్రకారము బూడిదను గ్రహించినను, యంత్రము బూడిదచే గీట్లు గీచుకొనిపోకూడదు. అది స్వల్పముగా విద్యుత్తును ఉపయోగించుచు బూడిదను హెచ్చురేటున గ్రహించునదిగా ఉండవలెను.

ఆవిరి ఇంజనులు, ఆవిరి పరివర్తములు (Steam boilers and steam turbines): ఇవి బాయిలరు నుండి వచ్చు ఆవిరిచే నడచు ముఖ్య చాలకములు, ఆవిరి ఇంజనులకు బదులు విశేషముగా పరివర్తములు ఉపయోగ పడుచుండుటచే, అవి ఇప్పుడు వాడుకలో లేవు. పరీవర్తమునకు ఒక కాండమును, వెక్కు చక్రములును ఉండును. ఆ చక్రముల అంచులయందు అధిక సంఖ్యలో వంపు తిరిగిన ఆకులు అమర్చబడియుండును. ఆ ఆకులపైన ఆవిరిని పంపినపుడు కాండము పరిభ్రమణము చేయును. సెకండునకు 500 పరిభ్రమణములు చేయు అత్యధిక వేగముగల పరివర్తములు గలవు. కానీ అట్టి హెచ్చు వేగముగల వరీవర్తములు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగకరములు కావు. ఎందుచేత ననగా, ఒక ఏకాంతరీకము (Alternator) యొక్క అత్యధిక వేగము నిమిషమునకు 3000 పరిభ్రమణములు. హెచ్చు పీడనముతో హెచ్చు ఉష్ణోగ్రతతో బాయిలర్లనుండి వచ్చిన అవిరి, వరీవర్తములలో వ్యాకోచమునొంది, తరువాత తిరిగి ద్రవీకరణసాధనములలో ద్రవీకరణము నొందును. వరీవ ర్ములలోనికి ఆవిరి పోయినపుడు, అవి దానికి పీడనము - వేగము కలుగజేయు విధానమునుబట్టి వరీవర్తములు వర్గీకరింపబడినవి. వరివర్తములలో కొన్ని ప్రేరణకు సంబంధించినవి. కొన్ని ప్రతిక్రియకు సంబంధించినవి. వాటిలో మరల పీడనము కలవి, వేగముకలవి, పీడన వేగముల సమ్మేళనము కలవి అను ప్రవిభేదములు కలవు.

వరీవ ర్తముల సంఖ్య, వాటికి ఉండదగిన సామర్థ్యము అను విషయములను నిశ్చయించుటకు ముందు ఆ యంత్రమున కెంత ఊతమున్నదో పరిశీలించవలెను. మొత్తము యంత్ర భాగములో మూడవవంతు మరమ్మతులు చేయించుట కొరకును, పరీక్షించుటకొరకును ఏ వేళయందైనను విరామముండునట్లు ప్లాను వేసికొనవలెను.

పరీవర్తము యొక్క సామర్థ్యము, దానియొక్క ఫలోత్పత్తి దాని ఆకులపై సూటిగా ఆధారపడియుండును. అందుచే వాటిని చాల జాగ్రత్తతో నిర్మించి, నిర్వహించవలెను. వరీవర్తములకు హెచ్చు వేగములు, విస్తారమగు ఫలోత్పత్తులు కావలసినచో చక్కని యోజన, చక్కగా కందెనచేయు పద్దతులు అవసరము. పరీవర్తము యొక్క వేగము, కావలసిన ప్రమాణమున “శాసకుని "చే స్థిరముగా నుంచబడును.

ద్రవీకరణ యంత్రములు : ద్రవీకరణ యంత్రములు పెద్ద స్తూపాకారపు తొట్లు, వాటిలో అన్వాయామముగా (Longitudinal) అమర్చబడిన గొట్టములుండును. ఆ గొట్టములలో చల్లనినీరు ప్రవహించుచుండును. గొట్టముల చుట్టును ఆవిరి ప్రవేశ పెట్టబడి, నీరుగా ద్రవీకరణము చేయబడును, ఆనీరు అడుగు భాగమునకు దిగజారి, ద్రవీకరణ యంత్రమునుండి బయటకు తీయు గొట్టము ద్వారమున వచ్చును. దానిలో కలిగిన తరుగు, రసాయనిక క్రియ జరిగిన నీటితో భర్తీ చేయబడి, అది మరల ఆవిరిని ఉత్పత్తి చేయుటకు బాయిలరులోనికి పంపబడును.

చల్లగానున్న నీరు ద్రవీకరణము కావలసిన నీటితో కలియదు. కాబట్టి అది స్వచ్ఛముగా నుండనవసరము లేదు. పైని సూచించినట్లు, గొట్టములలో అడ్డపడు కుళ్ళు