ఉష్ణ విద్యుత్ ఉత్పాదక స్థావరములు
సంగ్రహ ఆంధ్ర
రాలో రానున్న కొరతను గూర్చి విద్యుత్ యంత్రచాలకులు బాధపడరు. భూమధ్య రేఖా ప్రాంతపు దేశస్థులును, ఎడారులు కల దేశస్థులును, సూర్యకిరణములనుండి విద్యుత్తును ఉత్పత్తిచేయు సమస్యను గూర్చి తీవ్రముగ ఆలోచన చేయగలరు.
విద్యుత్ ఉత్పాదకస్థావరముల యొక్క ప్రదేశము: బొగ్గుతో నడచునవియైనను, నూనెతో నడచునవియైనను ఉత్పాదక స్థావరముల నెచట నిర్మింపవలెను అను సమస్య కొంత విచారింపవలసియున్నది. విద్యుత్ శాఖలో విద్యుత్ భారములయొక్క గురుత్వ కేంద్ర మెచ్చటనుండునో ఆ స్థలము స్థావరమునకు ఆదర్శమైనది. దానివలన దీర్ఘమైన ప్రసార రేఖలను ఉపయోగించు అవసరము ఉండదు. ఈ యంశమునుబట్టి పట్టణములో జనసమ్మర్దముగలభాగము సరియైన ప్రదేశముగా కనబడును. కాని స్థలసంకోచమును బట్టియు భరింపరాని స్థలమూల్యమునుబట్టియు అది సాధ్యము కాకుండును. ప్రదేశమును ఎన్నుకొనుటలో ఈ దిగువ విషయములు ముఖ్యమైనవి.
- 1. స్థలము యొక్క ధర,
- 2. తగినంత చల్లనినీటి సరఫరా.
- 3. ఇంధనములు చవుకగా లభించుట, రాకపోకల సదుపాయములు,
- 4. కనీసముగ పౌరస్థాపత్యపు పనులుండుట.
- 5. బూడిదను పారవేయుటకు తగు సదుపాయములు,
- 6. గృహాది స్థావరములవలన కలుగు ఇబ్బంది పరిమితిగా నుండుట,
- 7. సిబ్బందికి నివాస గృహములు లభించుట.
పై వానిలో రెండవ యంళమునుబట్టి కావలసినంత చల్లని నీరు ఎడతెగక లభించు నది యొక్క ప్రక్కనో, తటాకము ప్రక్కనో స్థావరమును ఏర్పాటుచేయుట అవసరమగును. ఇది వీలు కానిచో నీటిని చల్లబరచు స్తంభములు నిర్మింప వలసియుండును. ఆరవ యంశమునుబట్టి విద్యాసంస్థలుగాని, కాపురముండు స్థలములుగాని చుట్టుపట్ల దగ్గరలో నుండుటకు వీలు లేదు. 5,6,7 అంశముల ప్రకారము స్థావరము చుట్టును చాలినంత ఖాళీస్థలము ఉండవలెను. నీటి సరఫరా నిచ్చు వసతి, పడవల రాకపోకలకు అనుకూలముకాని నది యైనచో, ప్రక్కగా రైలుమార్గములుండుట ఆవశ్యకము. రైలు మార్గములు బొగ్గునుపయోగించు యంత్రముల దగ్గరను కేంద్రముగనున్న గిడ్డంగుల దగ్గరను, బాయిలరు, వరీ పర్తము ఉన్న గృహములకు సంబంధించిన ఒక అఖాతము దగ్గరను ఆగిపోవలెను. పైనుండి బరువైన సరకులను దించు భారోత్తొలక యంత్రము (crane) యొక్క సహాయమున రైలుపెట్టెలనుండి సరకులు తీసికొనబడును. పట్టాలుగల వాహకముల ద్వారమున బొగ్గు బాయిలర్ల లోనికి రవాణా చేయబడును. ఈ ఏర్పాటుల వలన శరీర క్రమము మిక్కిలి స్వల్పమగు.
ఆవిరిచే నడచు విద్యుత్ ఉత్పాదక స్థావరములు : ఒక బాయిలరు గృహము, బొగ్గు, బూడిదను సంగ్రహించు యంత్రము అనునవి ఆవిరిచే నడచు విద్యుత్ ఉత్పాదక స్థావరమునకు ప్రత్యేకమైన చిహ్నములు. వీటితో సరియైన భాగములు పీడనజ్వాలాస్థావరమునకు ఉండవు.
తక్కువ నీటి మట్టముననున్న పెద్ద జలవిద్యుత్ యంత్ర విషయమున ఒకప్పుడును విద్యుత్ యంత్రకారునికిని, నీటిసరఫరా యంత్రకారునికిని మధ్య పెద్ద ఎత్తున నున్న నీటిని పంపకముచేయు విషయమున గొప్ప సమస్య ఏర్పడి నపుడును అవిరిచే నడచు విద్యుత్ స్థావరములు సహాయ విద్యుత్ స్థావరములుగా ఉపయోగపడును. జల విద్యుత్ స్థావరములతో పోల్చినపుడు అవిరిచేనడచు విద్యుత్ స్థావరముల పెట్టుబడివెల తక్కువ. కాని, ఇంధనముల ధర, పనివాండ్ర వేతనములు నడుపుటకగు ఖర్చు రెండింటను గూడ ఎక్కువగా నుండును.
ఇంధనము : బొగ్గు, నూనె, వాయువు అను వాటిలో దేనితోనైనను బాయిలర్లు మండునవిగా నుండవచ్చును. రైలుపెట్టెల మూలమున లేక తొట్టెలద్వారమున దగ్గరలోనున్న చిన్న బొగ్గుగనుల నుండి బొగ్గును గ్రహించు యంత్రము వద్దకు క్రమముగారవాణా చేయవలసి యుండును. దులిపి వేయం యంత్రసాధనములోనికి రైలు పెట్టెలు తీసికొని పోబడును. అచట ఒక వలయాకారపు చట్రము రైలుపెట్టెను గట్టిగా పట్టుకొనును. చట్రము, పెట్టెతోసహా గిరగిర తిరుగునట్లు చేయబడును. ఒక పండ్ల చక్రముద్వారమున విద్యుత్ మోటారువలన, ఆచట్రము తిరుగుచుండును. ఒక పెద్ద ఉక్కు తొట్టెలోనికిగాని.